కాకతీయ జూ పార్క్

వికీపీడియా నుండి
(వన విజ్ఞాన కేంద్రం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

కాకతీయ జూ పార్క్ వరంగల్ జిల్లా హన్మకొండ పట్టణంలోని హంటర్ రోడ్‌లో ఉంది.

విశేషాలు[మార్చు]

సామాన్య ప్రజానీకానికి వన్యసంరక్షణ గురించి తెలపడానికి ఈ కాకతీయ జూ పార్క్ ఏర్పాటు చేయబడింది. తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ జూ పార్క్ లో వివిధ రకాల జంతువులతో పాటు చాలా మొక్కలను కూడా పెంచుతున్నారు. ఈ పార్కు దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో జింకలు, లేళ్లు, దుప్పులు, కోతులు, ఎలుగుబంట్లు మొదలగు జంతువులు; చిలుకలు, పావురాలు, నిప్పుకోళ్లు, నెమళ్లు వంటి పలురకాల పక్షులు; తాబేళ్లు, మొసళ్ల వంటి సరీసృపాలు సంరక్షించబడుతున్నాయి. ఈ పార్కులో వన్య సంరక్షణ గురించి పర్యాటకులకు తెలిజేసేందుకు అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ప్రత్యేక కేంద్రాలు కూడా ఉన్నాయి. ఈ పార్కును ప్రతి రోజు సుమారు 500 మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు.