Jump to content

వర్గం చర్చ:ఆదర్శ వనితలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఏ వర్గం లోకి ఏ పేజీలు చేర్చాలి - ఆదర్శ వనితకు నిర్వచనం ఏంటి?

[మార్చు]
కింది చర్చలో పాల్గొని దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడంలో సహకరించండి. చర్చపై నిర్ణయాన్ని ప్రకటించినవారు ఈ మూసను తీసేసి దీని స్థానంలో {{Discussion top}} అనే మూసను, చర్చకు అడుగున {{Discussion bottom}} అనే మూసనూ చేర్చవలసినది.

ఈ వర్గంలో ఏ పేజీలను చేర్చాలనే విషయమై అంత స్పష్టత లేదు. పేజీ విషయమైన వ్యక్తికి ఉండే లక్షణాలను బట్టి పేజీని ఈ వర్గం లోకి చేర్చాలనేది స్పష్టం. కానీ ఏ లక్షణాలుండాలి అనేది తేలడం లేదు. "ఆదర్శనీయం" అనే పదానికి చాలా విస్తృతార్థం ఉండొచ్చు. ఉదాహరణకు, ఒక రచయిత్రి పేజీ ఉందనుకోండి.. ఆమె ఆదర్శనీయమైన వనిత అని ఎలా చెబుతాం- చేసిన రచనలు ఆదర్శనీయంగా ఉంటేనా? మరి ఆ రచనలు ఆదర్శనీయమైనవేనా కాదా అనేది ఎలా నిర్ణయిస్తాం? ఒక కళాకారిణి ఆదర్శ వనితో కాదో అని ఎలా చెప్పాలి? స్వాతంత్ర్య సమర యోధులు ఆదర్శనీయులైతే, అలాంటి మగవారికి ఆదర్శ పురుషులు అనే పేజీ పెట్టలేదు కదా?! అసలు ఆదర్శ వ్యక్తులు అనే వర్గం కూడా లేదు. ఆదర్శ వనిత అనే పేరుగాంచిన బిరుదు లాంటివి పొందిన వ్యక్తులకు తప్ప ఆదర్శ వర్గం లోకి చేర్చలేమేమో అనిపిస్తోంది. పరిశీలించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 04:49, 16 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]