వర్గం చర్చ:తెలంగాణ ప్రభుత్వ ఆవిష్కరణలు
స్వరూపం
పేరు గురించి
[మార్చు]- కింది చర్చలో పాల్గొని దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడంలో సహకరించండి. చర్చపై నిర్ణయాన్ని ప్రకటించినవారు ఈ మూసను తీసేసి దీని స్థానంలో {{Discussion top}} అనే మూసను, చర్చకు అడుగున {{Discussion bottom}} అనే మూసనూ చేర్చవలసినది.
దీని పేరు "ఆవిష్కరణలు" అని ఎందుకు అన్నారో తెలీలేదు. పథకాలు అని గాని, సంస్థలు అని గానీ, కార్యక్రమాలు అనో అనవచ్చేమో. ఆవిష్కరణ అంటే సుమారుగా ప్రకటన/వెల్లడి అనే అర్థం వస్తుంది. పథకాన్నో, కార్యక్రమాన్నో, సంస్థనో, నామ ఫలకాన్నీ, ప్రాజెక్టునో ఆవిష్కరిస్తారు. అలా ఆవిష్కరించడమే అవిష్కరణ అవుతుంది. డిస్కవరీ/ఇన్వెన్షన్ అనే ఇంగ్లీషు మాటలకు తెలుగు అర్థంగా దీన్ని వాడుతున్నారు. కానీ ఇక్కడ అది పొసగదు అనిపిస్తోంది. పరిశీలించండి. __చదువరి (చర్చ • రచనలు) 01:24, 13 నవంబరు 2021 (UTC)
- చదువరి గారికి నమస్కారం. ఈ వర్గంలో ఉన్న వ్యాసాలు ప్రభుత్వ పథకాలు, సంస్థల వ్యాసాలు కావు. ప్రభుత్వం కొత్తగా రూపొందించిన (ఇన్నోవేట్ చేసిన) యాప్స్, వివిధ కార్యక్రమాలకు సంబంధించిన వ్యాసాలు కాబట్టి `ఆవిష్కరణలు' అన్న పదాన్ని ఉపయోగించాను. సభ్యులు నిర్ణయిస్తే ఆ పదాన్ని మార్చడంగానీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలు వర్గం ఉన్నది కాబట్టి ఇంకో వర్గం అనవసరం అనుకుంటే ఈ వర్గాన్ని తొలగించి వ్యాసాలను తెలంగాణ ప్రభుత్వ పథకాలు వర్గంలో చేర్చడంగానీ చేస్తాను.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 04:31, 13 నవంబరు 2021 (UTC)