Jump to content

వర్జీనియా దుర్గా దేవాలయం

అక్షాంశ రేఖాంశాలు: 38°43′43″N 77°15′04″W / 38.728602°N 77.251150°W / 38.728602; -77.251150
వికీపీడియా నుండి
వర్జీనియా దుర్గా దేవాలయం
ప్రదేశం
దేశం:యునైటెడ్ స్టేట్స్
రాష్ట్రం:వర్జీనియా
ప్రదేశం:లార్టన్‌
అక్షాంశ రేఖాంశాలు:38°43′43″N 77°15′04″W / 38.728602°N 77.251150°W / 38.728602; -77.251150
ఇతిహాసం
వెబ్ సైట్:http://www.durgatemple.org/

వర్జీనియా దుర్గా దేవాలయం, వర్జీనియాలోని లార్టన్‌లో ఉన్న ఒక హిందూ దేవాలయం. వాషింగ్టన్ డిసి మెట్రోపాలిటన్ ఏరియాలోని హిందూ భక్తులకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా ఉంది. 2010లో, ఈ దేవాలయం ఫెయిర్‌ఫాక్స్ కౌంటీలో నివసిస్తున్న 6500 మంది హిందువులకు ప్రముఖ పుణ్యక్షేత్రంగా నిలిచింది.[1]

చరిత్ర

[మార్చు]

1991లో, దుర్గా దేవాలయం నిర్మాణంకోసం ఉత్తర వర్జీనియాలో ఒక సంస్థగా స్థాపించబడింది.[2] ఫస్ట్ వర్జీనియా బ్యాంక్ (ప్రస్తుతం ట్రూయిస్ట్ ఫైనాన్షియల్‌లో భాగం) నుండి 2.5 మిలియన్ డాలర్ల రుణంతో దేవాలయ నిర్మాణానికి నిధులు సమకూర్చబడ్డాయి. 1996లో దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. 1996 అక్టోబరులో శంకుస్థాపన కార్యక్రమంలో భూమి పూజ నిర్వహించబడింది. 1999 మార్చి 21న దేవాలయ నిర్మాణం పూర్తయింది.[3]

హిందూమతం, హిందూ చరిత్రపై ప్రజలకు అవగాహన కల్పించడానికి దుర్గా దేవాలయం ఆధ్వర్యంలో "హిందూమత శిఖరాగ్ర సదస్సు" జరిగింది. ఇక్కడ భారతీయ సాంస్కృతిపై తరగతులు, ఆధ్యాత్మిక తరగతులు, బాయ్ స్కౌట్స్ ప్రోగ్రామ్‌లను వంటివి అందించబడుతున్నాయి.[4]

మూలాలు

[మార్చు]
  1. Victoria Ross. "Dynamic and Diverse". connectionnewspapers. Retrieved 23 January 2022.
  2. "Durga Temple". Charity Navigator. Retrieved 23 January 2022.
  3. "Durga Temple History". durgatemple. Retrieved 23 January 2022.
  4. Brian Shane (19 June 2011). "Fairfax station temple holds Hinduism Summit". Patch. Retrieved 23 January 2022.