వర్తికా సింగ్
అందాల పోటీల విజేత | |
జననము | వర్తికా బ్రిజ్ నాథ్ సింగ్ 1993 ఆగస్టు 26 లక్నో, ఉత్తర ప్రదేశ్, భారతదేశం |
---|---|
పూర్వవిద్యార్థి | ఇసాబెల్లా థోబర్న్ కళాశాల, లక్నో విశ్వవిద్యాలయం లక్నో, భారతదేశం |
వృత్తి | మోడల్ |
బిరుదు (లు) | ఫెమీనా మిస్ గ్రాండ్ ఇండియా 2015 మిస్ యూనివర్స్ ఇండియా 2019 |
ప్రధానమైన పోటీ (లు) | మిస్ దివా 2014 (టాప్ 7) ఫెమినా మిస్ ఇండియా 2015 (ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా 2015) మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2015 (2వ రన్నర్-అప్) మిస్ దివా 2019 (విజేత - మిస్ యూనివర్స్ ఇండియా 2019) మిస్ యూనివర్స్ 2019 (టాప్ 20) |
వర్తికా బ్రిజ్ నాథ్ సింగ్ (జననం 1993 ఆగస్టు 26) భారతీయ మోడల్, అందాల పోటీ టైటిల్ హోల్డర్, ఆమె మిస్ యూనివర్స్ ఇండియా 2019గా నిలిచింది. మిస్ యూనివర్స్ పోటీ 68వ ఎడిషన్‌లో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.[1] దీనికి ముందు, ఆమె 2015లో ఫెమినా మిస్ ఇండియా ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్‌గా కిరీటాన్ని పొందింది.[2] జిక్యూ మ్యాగజైన్ (GQ) ఆమెను 2017లో భారతదేశంలోని హాటెస్ట్ మహిళల్లో ఒకరుగా నిలిపింది.[3][4]
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]ఆమె 1991 ఆగస్టు 27న ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జన్మించింది. అక్కడ, ఆమె కనోస్సా కాన్వెంట్ స్కూల్‌లో చదువుకుంది.[5] ఆమె ఇసాబెల్లా థోబర్న్ కళాశాల నుండి క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందింది.[6] ఆమె లక్నో విశ్వవిద్యాలయం నుండి పబ్లిక్ హెల్త్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తిచేసింది.[7]
ప్రస్థానం
[మార్చు]ఆమె మిస్ దివా 2014 పోటీలో పాల్గొన్నది, అక్కడ ఆమె టాప్ 7లో నిలిచింది. పోటీలో ఆమె 'మిస్ ఫోటోజెనిక్' అవార్డును కూడా గెలుచుకుంది.[8] 2015లో, ఆమె ఫెమినా మిస్ ఇండియా పోటీల 52వ ఎడిషన్‌లో పోటీ పడింది. ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా 2015 కిరీటాన్ని పొందింది.[9]
ఆమె 2019 డిసెంబరు 8న అట్లాంటా, జార్జియాలలో జరిగిన మిస్ యూనివర్స్ 2019 పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి టాప్ 20లో నిలిచింది.[10][11]
సంగీత వీడియోలు
[మార్చు]సంవత్సరం | పాట | సింగర్ | రికార్డ్ లేబల్ | మూలం |
---|---|---|---|---|
2019 | కిష్మిష్ | యాష్ కింగ్, ఖరాన్ | టైమ్స్ మ్యూజిక్ | [12] |
2017 | సవేర్ | అనుపమ్ రాగ్, రహత్ ఫతే అలీ ఖాన్ | టైమ్స్ మ్యూజిక్ | [13] |
మూలాలు
[మార్చు]- ↑ Wadhwa, Akash (3 October 2019). "A traditional homecoming for Miss Diva Universe 2019 Vartika Singh". The Times of India. Retrieved 1 May 2022.
- ↑ "Femina Miss India 2015 Vartika Singh is at Miss Grand International 2015". The Economic Times. Archived from the original on 7 అక్టోబరు 2019. Retrieved 12 September 2016.
- ↑ "Vartika Singh skipped her PhD to become a Miss India". GQ (India). Retrieved 30 September 2014.
- ↑ "Vartika Singh on Representing India at Miss Universe, 'Feel Immense Pressure, Responsibility'". News18. 15 November 2019.
- ↑ Wadhwa, Akash (5 October 2019). "It's very nostalgic to relive moments you've cherished: Miss Diva Universe 2019 Vartika Singh in Lucknow". The Times of India. Retrieved 23 November 2019.
- ↑ "Lucknow's Vartika Singh to represent India at Miss Universe 2019". Amarujala (in హిందీ). 28 September 2019. Retrieved 23 November 2019.
- ↑ "Lucknow girl Vartika Singh becomes Miss Diva Universe 2019, to represent India at Miss Universe 2019 pageant". Dainik Jagran (in హిందీ). 5 October 2019.[permanent dead link]
- ↑ "Vartika Singh: All you need to know about the Miss Diva Universe 2019". New Indian Expres. 9 October 2019.
- ↑ Press Trust of India (29 September 2019). "Feel confident I'll bring back the crown: Vartika Singh". Business Standard India. Business Standard News.
- ↑ "Beauty Pageants Celebrate Women, Says Miss Diva Universe 2019 Vartika Singh". News18. Retrieved 20 September 2019.
- ↑ Wadhwa, Akash (13 October 2019). "Miss Diva Universe 2019 Vartika Singh is all for women empowerment". The Times of India.
- ↑ "Ash King, Momina and Qaran's debut collaboration 'Kishmish' is about love at first sight at a wedding!". 18 January 2019.
- ↑ "'Saware' features actor Kunal Khemu and Femina Miss India Grand International, Vartika Singh". The Times of India. 26 February 2017.