వర్తూర్ సరస్సు
వర్తూర్ సరస్సు | |
---|---|
ప్రదేశం | వర్తూర్, బెంగళూరు, కర్ణాటక |
అక్షాంశ,రేఖాంశాలు | 12°56′27″N 77°44′48″E / 12.940699°N 77.746596°E |
రకం | నిల్వ నీరు |
సరస్సులోకి ప్రవాహం | వర్షపు నీరు, సిటీ డ్రైనేజీ |
వెలుపలికి ప్రవాహం | నాలా |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
వర్తూర్ సరస్సు బెంగుళూరు నగరం తూర్పు అంచున అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన వైట్‌ఫీల్డ్ టౌన్‌షిప్‌లో భాగంగా ఉన్న ఒక శివారు ప్రాంతం వర్తూర్ లో ఉంది. వర్తూర్ కర్ణాటక రాష్ట్రంలో ఒక శాసనసభ నియోజక వర్గంగా ఉంది.
చరిత్ర
[మార్చు]ఇది ఒక మానవ నిర్మిత సరస్సు. గంగా రాజులు వ్యవసాయం, గృహ అవసరాల కోసం వేలాది సంవత్సరాల క్రితం దీన్ని నిర్మించారు. కానీ గత 50 సంవత్సరాలుగా ఈ సరస్సులో 40% మురుగునీరు బెంగుళూరు నుండి వచ్చి చేరుతుంది.
విస్తీర్ణం,ప్రత్యేకత
[మార్చు]180.40 హెక్టార్ల (445.8 ఎకరాలు) విస్తీర్ణం కలిగిన వర్తూర్ సరస్సు బెంగుళూరు నగరంలో రెండవ అతిపెద్ద సరస్సుగా పేరుగాంచింది. బెంగుళూరులో అత్యంత కలుషితమైన సరస్సులలో ఒకటిగా కూడా దీనిని చెప్తారు.[1]
కాలుష్యం
[మార్చు]ప్రణాళికేతర పనులు, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ వంటి కార్యకలాపాల వలన ఈ సరస్సులోని నీరు కలుషితం అయింది. బెంగుళూరు లోని మురుగు నీరు బెల్లందూర్ సరస్సుకు వెళ్లి అక్కడ నుండి ఈ సరస్సులోకి ప్రవహించడం వలన సరస్సు నీరు మరింత కలుషితం అవుతున్నాయి.[2]
మూలాలు
[మార్చు]- ↑ Madhab, Mahapatra, Durga; H.N., Chanakya; T.V., Ramachandra. "Assessment of treatment capabilities of Varthur Lake, Bangalore, India". International Journal of Environmental Technology and Management. 14 (1/2/3/4). Retrieved 17 April 2018.
{{cite journal}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ "Varthur lake". wgbis.ces.iisc.ernet.in. Retrieved 17 April 2018.