వర్దుహి వర్దన్యాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వర్దుహి వర్దన్యాన్
స్థానిక పేరుՎարդուհի Վարդանյան
జన్మ నామంవర్దుహి వర్దన్యాన్
జననం(1976-06-27)1976 జూన్ 27
మరణం2006 సెప్టెంబరు 15(2006-09-15) (వయసు 30)
హైవే, సెవాన్-మార్తుని, ఆర్మేనియా
సంగీత శైలిపాప్, జాస్
వాయిద్యాలుపియానో
లేబుళ్ళుఆర్మేనియా సంగీత సెంటరు

వర్దుహి వర్దన్యాన్ ( 1976 జూన్ 26 – 2006 అక్టోబరు 15) ఒక ఆర్మేనియన్ గాయకురాలు. ఆమె అనేక అంతర్జాతీయ పాటల పోటీలలో పాల్గొని అత్యధిక అవార్డులను గెలిచింది.[1] ఆమెకు అర్మేనియా దేశ ఉత్తమ గాయకురాలి పురస్కారం లభించింది.[2] ఆమె 2006 అక్టోబరు 15న సెవాన్-మార్టుని హైవేపై  జరిగిన ఒక కారు ప్రమాదంలో మరణించారు. ఆమె మరణానంతరం, అనేక ఆర్మేనియన్ కార్యక్రమాలు పేరును తనకు అంకితం, అందులో బెనెఫిస్, హాఫ్-ఊపెండ్ విండోస్, మెకానిజం ఆఫ్ హ్యాపీనెస్ ఉన్నాయి.

ప్రారంభ జీవితం[మార్చు]

వర్దుహి వర్దన్యాన్ 1976 జూన్ 26 న ఆర్మేనియా రాజధాని యెరెవాన్లో జన్మించారు. ఆమె తన కుటుంబంలోని ముగ్గురు పిల్లలలో ఒకరు. ఆమెకు చిన్నతనం నుండి గానం అంటే ఒక అభిరుచి ఉండేది. ఆమె మైక్రోఫోన్ ను పోలిన ప్రతి వస్తువునూ ఉపయోగించారు. చివరికి అది ఆమె స్వీయ-విద్యకు ఏకైక మార్గంగా మారింది. ఆమెకు ఇష్టమైన మార్గదర్శకుల పాటలతో తన దగ్గర ఒక 96-పేజీల ప్రత్యేక పుస్తకం ఉండేది.1983 లో ఆమె ఒక మ్యూజిక్ గ్రూప్ ను స్థాపించి వారికి పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. తరువాత సంగీత గుంపుకు అషాట్ బ్జుని అను పేరు పెట్టారు. 1986 లో వర్దన్యాన్ తన స్వరాన్ని మెరుగుపరుచుకోవడానికి నైరా గ్యుర్జిన్యాన్ దగ్గరకు వెళ్ళడం ప్రారంభించారు. తర్వాత ఆమె అలెక్సాండర్ స్పెండియార్న్ పేరిట స్థాపించిన పాఠశాలలో చదువుకున్నారు. ఈ కాలంలో ఆమె తన సొంత సంగీత రుచిని అభివృద్ధి చేసుకున్నారు. విట్నీ హౌస్టన్ తో కలిసి పాట పాడాలని ఆమె కోరిక.[3]

విద్య[మార్చు]

 • 1992 – అలెక్సాండర్ స్పెండియార్న్ ఉన్నత పాఠశాల నుండి 8 వ తరగతిలో   పట్టభద్రురాలయ్యారు.
 • 1993 – సంగీత పాఠశాల నుండి పట్టభద్రురాలయ్యారు
 • 1993 – వాలెరి బ్ర్యుసావ్ లింగ్విస్టిక్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు, రాజకీయాలను చదివారు.
 • 1994 – రాష్ట్ర పాటల థియేటరులోకి  ప్రవేశించింది, అప్పటి నుండి 1995 వరకు ఆమె అక్కడే పనిచేశారు.
 • 1994-1999 – విశ్వవిద్యాలయంలో చదివిన తరువాత, ఆమె ఆంగ్లాన్ని బోధించడం మొదలువెట్టారు.
 • 2003 – యెరెవాన్ రాష్ట్ర సంరక్షణాలయం నుండి పట్టభద్రురాలయ్యారు.

కెరీర్[మార్చు]

 • 1994 – స్వర్ద్లోవ్స్క్ లో జరిగిన  "జాజ్-పాప్" అంతర్జాతీయ పోటీ లో పాల్గొని గ్రాండ్ ప్రిక్స్ ను పొందారు
 • 1995 – ఆర్మేనియా రాష్ట్ర మ్యూజిక్ థియేటరును ప్రారంభించారు.
 • 1996 – యువ గాయకుల పోటీ "యాల్టా - మాస్కో" ట్రాన్సిట్ లో పాల్గొని, ఉత్తమ ప్రదర్శన బహుమతిని పొందారు.
 • 1999 – అర్మేనియా దేశ ఉత్తమ గాయకురాలి పురస్కారం ఆమెకు లభించింది.
 • 2000 –  బల్గేరియాలో జరిగిన "డిస్కవరీ పోటీలో గ్రాండ్ ప్రిక్స్ అవార్డు , అడిషనల్ ఆడియన్స్ ఛాయ్స్ అవార్డు వచ్చింది.
 • 2000 _ మేసిడోనియాలో ఆమెకు మళ్ళీ గ్రాండ్ ప్రిక్స్ వచ్చింది.
 • 2000 –  స్లవియాంస్కి బజారులో జరిగిన అంతర్జాతీయ ఆర్ట్స్ ఫెస్టివల్ లో రెండవ బహుమతి వచ్చింది.
 • 2001 – యాల్టాలో జరిగిన "మాప్ друзей 2001" అంతర్జాతీయ ఫెస్టివల్ లో రెండవ బహుమతి వచ్చింది.

మరణం[మార్చు]

ఆమె 2006 అక్టోబరు 15న సెవాన్-మార్టుని హైవేపై జరిగిన ఒక కారు ప్రమాదంలో మరణించారు..ఆమెను ఖననం చేసిన ప్రదేశం తొఖ్మాఖ్ శ్మశానం[4]

కుటుంబం[మార్చు]

 • భర్త: అరాం అవోయాన్
 • పిల్లలు:రూబెన్ అవోయాన్, 1998 లో జన్మించారు.

డిస్కోగ్రఫీ[మార్చు]

 • డిసర్రే, 2007
 • Только ты, 2007
 • Իմն ես, 2011
 • 13 పాటలను వర్దుహి వర్దన్యాన్ కు అంకితం చేశారు, 2008[5]

లింకులు[మార్చు]

సూచనలు[మార్చు]

మూస:Ref list

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2018-06-21.
 2. "Varduhi Vardanyan's official website". Archived from the original on 2014-08-19. Retrieved 2018-06-21.
 3. "Varduhi Vardanyan's official website". Archived from the original on 2014-08-19. Retrieved 2018-06-21.
 4. Hush.am cemetery record for Varduhi Vardanyan
 5. Baghdasaryan, Grigor. "Varduhi Vardanayn's official website". WebStar Design!. Archived from the original on 2018-11-25. Retrieved 2022-04-03.