ప్రణీత వర్థినేని
స్వరూపం
(వర్ధినేని ప్రణీత నుండి దారిమార్పు చెందింది)
ప్రణీత వర్ధినేని | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | ఆర్చరీ క్రీడాకారిణి |
ప్రణీత వర్థినేని (జననం 1990 నవంబరు 17) అర్చెరీ క్రీడకు చెందిన క్రీడాకారిణి. బీజింగ్లో జరిగిన 2008 ఒలింపిక్ క్రీడలలో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించింది.
బాల్యం
[మార్చు]1990, నవంబర్ 17న ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని వరంగల్ జిల్లా కల్లెడ గ్రామంలో ఆమె జన్మించింది.
2008 ఒలింపిక్ క్రీడలు
[మార్చు]2008 బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో ప్రణీత వర్థినేని మహిళ అర్చెరీ వ్యక్తిగత, టీం విభాగాలలో ప్రాతినిధ్యం వహించింది. వ్యక్తిగత విభాగంలో రౌండ్ 64లో ఆస్ట్రేలియాకు చెందిన జానె వాల్లెర్‌పై 106-100 స్కోరుతో విజయం సాధించి రౌండ్ 32కు వెళ్ళిననూ, అందులో ఉత్తర కొరియాకు చెందిన కోన్ ఉన్ సిల్ తో 99-106 తేడాతో ఓడి చివరకు 37వ స్థానం పొందినది..[1] టీం విభాగంలో డోలా బెనర్జీ, బాంబ్యాలాదేవిలతో కలిసి పోటీపడిన ప్రణీత వర్థినేని క్వార్టర్ ఫైనల్లో చైనాతో ఒడిపోయి చివరకు 6వ స్థానం పొందింది.
మూలాలు
[మార్చు]- ↑ Athlete biography: Pranitha Vardhineni, beijing2008.cn, ret: August 23, 2008