వర్మ కలిదిండి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వర్మ కలిదిండి
Varma Kalidindi.jpg
వర్మ కలిదిండి
జననంకలిదిండి నాగ వెంకట మల్లిఖార్జున వర్మ
(1975-09-11) 1975 సెప్టెంబరు 11 (వయస్సు 46)
పొలమూరు గ్రామం, పెనుమంట్ర మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
వృత్తిఅధ్యాపకుడు
రచయిత, చరిత్ర పరిశోధకుడు
మతంహిందూ
భార్య / భర్తహారిక
పిల్లలుయశస్విని
తండ్రివెంకట కృష్ణం రాజు
తల్లిసుబ్రమణ్యేశ్వరి

వర్మ కలిదిండి అసలు పేరు కలిదిండి నాగ వెంకట మల్లిఖార్జున వర్మ. యువ కవి. కవి సంగమం రచయితలలో ఒకరు.

కలిదిండి వర్మ

జననం[మార్చు]

ఖమ్మం సభలో కలిదిండి వర్మ

ఈయన సుబ్రమణ్యేశ్వరి, వెంకట కృష్ణం రాజు దంపతులకు 1975 సెప్టెంబర్ 11న పొలమూరు గ్రామం, పెనుమంట్ర మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్లో జన్మించారు.

నేను మాత్రం ఇద్దరిని పుస్తకావిష్కరణ సందర్భం

ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం[మార్చు]

ప్రస్తుత నివాసం భీమవరం. పాలిటెక్నిక్ చదువుని మధ్యలోనే ఆపేశారు.

ప్రస్తుతం మినరల్స్ ట్రేడింగ్, విదేశీ వ్యాపారాల ఏజంటు గానూ వ్యవహరిస్తూ సొంత సంస్థని నిర్వహిస్తున్నారు.

సాహితీ సన్మానం

భార్య - పిల్లలు[మార్చు]

భార్య: హారిక కూతురు: యశస్విని.

ప్రచురితమయిన మొదటి కవిత[మార్చు]

మొదటి కవిత "కాలం" మే 1993 ఆంధ్రభూమి వార పత్రికలో ప్రచురితమైంది.

కవి రచయిత్రి సల్మా చేతుల మీదుగా పుస్తకావిష్కరణ

ప్రచురితమయిన పుస్తకాల జాబితా[మార్చు]

 1. నేను మాత్రం ఇద్దరిని (తొలి సంకలనం) ప్రచురణ డిసెంబరు -2014.

బహుమానాలు - బిరుదులు - గుర్తింపులు[మార్చు]

 1. కవి సంగమం కవిగా గుర్తింపు.
 2. "సారంగ"లో "ఇప్పటికీ మించి పోయింది లేదు" కవిత ప్రచురణ
 3. "వాకిలి"లో "సహజ జీవనం" కవిత ప్రచురణ
 4. 2013 ప్రముఖ కవి "యశస్వీ సతీష్" గారి "ఒక చిన్న మాట" (150 మంది తెలుగు కవుల పరిచయం) పుస్తకంలో చోటు.
 5. 2014 ప్రముఖ కవి విమర్సకుడు "నారాయణ శర్మ" గారి "ఈ నాటి కవిత" 75 కవితలపై విమర్స విశ్లేషణలో "గుప్పెడు మన్ను-ఆకుపచ్చని కల"కి చోటు.
 6. సాహితి సేవ వారి సన్మానం.
 7. 04.02.2015 ఖమ్మం నందు "సాహితి స్రవంతి" వారిచే "నేను మాత్రం ఇద్దరిని" పుస్తక పరిచయ సభ, సన్మానం
 8. నాలోనే కవిత్వానికి పుష్యమి సాగర్ విశ్లేషణ
 9. "సారంగ"లో "ఇది మనిషి కాలం" కవిత
 10. "One India.com" నందు "ధన్యోస్మి" కవితపై "కాసుల ప్రతాప రెడ్డి" గారి విశ్లేషణ[permanent dead link]
 11. "సారంగ"లో నాకవిత "కార్తీక పక్షం"
 12. 10.05.2015 ఆదివారం ఆంధ్రజ్యొతి ఆదివారం పుస్తకంలో "ఆవకాయ్ One Demand" కవిత ప్రచురణ
 13. "పుట్టానని ప్రమాణం చేసాక" కవిత "ప్రజాశక్తి" ప్రచురణ
 14. 06.07.2015 "గొదారి పలకరింపు" కవిత "ఆంధ్ర జ్యొతి" ప్రచురణ
 15. 06.07.2015 "నాలుగు మాటలు" కవిత "ప్రజా శక్తి" ప్రచురణ
 16. 12.07.2015 శ్రీ పద్మినీపుర కళా పీఠం-గణపవరం వారిచే నిర్వహించబడిన పుష్కర కవి సమ్మేళనంలో కవితా గానం సత్కారం.
 17. 19.07.2015 తెలుగు సాహితీ సమాఖ్య-తాడేపల్లిగుడెం వారిచే నిర్వహించబడిన పుష్కర కవి సమ్మేళనంలో కవితా గానం సత్కారం.
 18. "సాహితి మిత్రులు" విజయవాడ వారి "కవితా" బైమంత్లీ మే-జూన్ 2015 లో "మట్టి జ్వరం" కవిత ప్రచురణ.
 19. 23.07.2015 గోదావరి మహా పుష్కర కవితోత్సవం -రాజమండ్రి "శ్రీ తనికెళ్ళ భరణి" గారి చేతులమీదుగా సన్మానం
 20. 09.08.2015 "నక్షత్రాలు దూసిన ఆకాశం" కవిత "సాక్షి" ప్రచురణ, సాహితి స్రవంతి ద్వితీయ వార్షికోత్సవ సభ-కాకినాడలో కవితా పఠనం
 21. 17.08.2015 ప్రజా శక్తిలో "ప్లాస్టిక్ పిండం" కవిత ప్రచురణ
 22. 23.08.2015 ఆంధ్రజ్యొతి ఆదివారం పుస్తకంలో "మా ఇంటి శివుడు" కవిత ప్రచురణ
 23. 26.08.2015 kuwaitnris.com లో "కొత్త హామీ" కవిత ప్రచురణ
 24. అక్షరంలో "ప్లాస్టిక్ పిండం" కవిత
 25. నా కవిత నందు...వాకిలిలో "ఒక్క మాట తూలని ఆమెకి" కవిత[permanent dead link]
 26. అక్షరంలో "వనం నిర్మితమయ్యే చోట" కవిత
 27. సారంగలో "హృదీ" కవిత[permanent dead link]
 28. 10.01.2016 ఆంధ్రజ్యొతి ఆదివారం పుస్తకంలో "పెద్ద పండగ" కవిత ప్రచురణ
 29. 06.04.2016 నన్నయ తెలుగు యూనవర్సిటీ-రాజముండ్రి వారిచే "ఉగాది గౌరవ అతిధి పురస్కారం".
 30. 10.07.2016 ఆంధ్రజ్యొతి ఆదివారం పుస్తకంలో "ఆ..పంటబోది" కవిత ప్రచురణ.
 31. World Poetry Day-2016 "ద్రాక్షాపళ్ళ కూర" కవిత "సాక్షి" ప్రచురణ.
 32. కందుకూరి వీరేశలింగం పంతులు అస్థిక కళాశాల-రాజమండ్రి నందు శ్రీశ్రీ కళా వేదిక వారిచే "ఉత్తమ కవి" "ఉత్తమ కవితా సంపుటి నేను మాత్రం ఇద్దరిని" పురస్కార ప్రధానం.
 33. 10.12.2016 "వెంకన్న చెట్లు" కవిత "సాక్షి" ప్రచురణ.
 34. "సాహితి మిత్రులు" విజయవాడ వారి "కవితా" బైమంత్లీ సెప్టెంబర్-అక్టోబరు 2016 లో "చిలకమ్మ పలుకు" కవిత ప్రచురణ.
 35. "సాహితి మిత్రులు" విజయవాడ వారి "కవిత-2015 నందు ఆవకాయ కవిత, 2016 నందు వెంకన్న చెట్లు" కవితలకు స్థానం దక్కింది.
 36. జగద్దాత్రి నిర్వహిస్తున్న రైటర్స్ అకాడెమీ వెబ్ సాహిత్య పేజీలో యానాం లో జరిగిన కవి సంధ్య "పోయిట్రీ వర్క్ షాప్ గురించిన రైటప్ నందు "చిద్విలాసి" కవితకు ప్రత్యేక ప్రసంశ, ప్రచురణ.
 37. 30.06.2017 రాజముండ్రి రోటరీ క్లబ్బు నందు " ఆంధ్ర సారస్వత పరిషత్తు" "ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ అండ్ కల్చరల్ కమీషన్" అధ్యక్షులు "తెలుగు రక్షణ వేదిక జాతీయ అధ్యక్షులు" శ్రీ.పొట్లూరి హరికృష్ణ గారిచే యాబై సార్లు రక్తదానం చేసినందుకు గాను "జాతీయ యువ సేవా పురస్కారం-2017" ప్రదానం.

ఇతర వివరాలు[మార్చు]

తనికెళ్ళ భరణి గారి చేతుల మీదుగా సన్మానం
సాహితీ మిత్రలతో
 • 2003 నుంచి విదేశీ వ్యాపారాల బాధ్యతల నిర్వహణ.
 • విదేశీ వ్యాపారాలకు భయర్ అండ్ సెల్లర్ ఏజంటుగా ఉంటూ పూర్తి బాధ్యతా నిర్వహణ.
 • పేరుపొందిన సుమిటమో మిట్సూయ్, మాయ ఐరన్ ఓర్స్ వంటి సంస్థలకు కన్సల్టెంట్ పనిచేసారు.
 • ధనంజయ ఇంపెక్స్ లో ఆరు సంవత్సరాలు ఫారెన్ ట్రేడింగ్ డాక్యుమెంట్స్ ఎజ్సిక్యూటివ్ గానూ, మార్కెటింగ్ మానేజరుగా పనిచేసారు.

అభిరుచులు[మార్చు]

సాహిత్యపఠనం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, జీవితం పై అవగాహన పెంపొందించుకునే ప్రయత్నంలో అనుభూతులను అప్పుడప్పుడు కవిత్వీకరించడం.

చిత్రమాలిక[మార్చు]

ఇతర లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]