Jump to content

వాడుకరి:కంచర్ల సుబ్బానాయుడు

వికీపీడియా నుండి
కంచర్ల సుబ్బానాయుడు
జననంకంచర్ల సుబ్బానాయుడు
1965 మే 29
సంగం గ్రామం, సంగం మండలం, నెల్లూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
నివాస ప్రాంతంసంగం
ఇతర పేర్లుకంచర్ల,కంసుడు, కేసు, సృజన, జ్యోతిశ్రీ, సేవా నాయుడు, రచయిత, పాత్రికేయుడు, తెలుగు భాష, సాహితీ సాంస్కృతిక సేవా సంస్థ 'సేవ ' వ్యవస్థాపక అధ్యక్షుడు
మతంహిందూమతం
భార్య / భర్తతులసి జ్యోతి
పిల్లలునవీన్ నిశ్చల్
తండ్రికంచర్ల నారాయణ
తల్లికంచర్ల సుబ్బమ్మ

కంచర్ల సుబ్బానాయుడు పత్రిక, సాహిత్య రంగంలో సుపరిచితులు. కళా పరిషత్తులు, పత్రికలు, సాహితీ కార్యక్రమాలు నిర్వహించటంలో ప్రసిద్దులు. తెలుగు భాష, సాహితీ సాంస్కృతిక సేవా సంస్థ సేవ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అంతర్జాల జూమ్ వేదికగా యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారంగా ఋతువుల పేర్లతో కవితా వసంతం, కవితా గ్రీష్మం, కవితా వర్షం, కవితా శరం, కవితా హేమంతం, కవితా శిశిరం ఋతువుల పేర్లతో కవి సమ్మేళనములు, అక్షరార్చన, తెలుగు భాషా వారోత్సవాలు, సహస్ర సాహితీ సప్తాహం, మహిళా వారోత్సవాలు, ముఖాముఖీలు, 2023 ఉగాది నుండి 365 రోజులు అక్షర తోరణం పేరిట ప్రాచీన సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం దాకా వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యం పునః మూల్యాంకణం కార్యక్రమాలు నిర్వహించి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారు. సుప్రసిద్ధ రచయితలు, కవుల సాహిత్యంపై సదస్సులు, సాహితీ సప్తాహాలు, సాహితీ సమాలోచన, సాహితీ అవలోకనం కార్యక్రమాలు అనునిత్యం నిర్వహించి చరిత్ర సృష్టించారు.

జీవిత విశేషాలు

[మార్చు]

కంచర్ల సుబ్బానాయుడు 1965, మే 29 న కంచర్ల నారాయణ, కంచర్ల సుబ్బమ్మ దంపతులకు నెల్లూరు జిల్లా సంగం గ్రామంలో జన్మించాడు. కంచర్ల, కంసుడు, కేసు, సృజన, కేసు, రాక్షసుడు, ఘంటాసురుడు, జ్యోతిశ్రీ కలం పేర్లతో వివిధ పత్రికల్లో వెయ్యికి పైగా వ్యాసాలు పలు రచనలు చేశారు. పాత్రికేయులు ఎ.బి. కె. ప్రసాద్, ఎం.వి. ఆర్. శాస్త్రి, ఆర్వి రామారావు, టి.యస్. ప్రకాష్ , కనకాంబర రాజు, రెంటాల కల్పన, సతీష్ చంద్ , అఫ్సర్, రాఘవ శర్మ, వాసుదేవరావు, గజ్జల మాల్లారెడ్డి, రామచంద్రమూర్తి , పొత్తూరు వెంకటేశ్వరావు, సర్వేపల్లి రామమూర్తి, ఎం.సుబ్రహ్మణ్యం , ఐ.నా.రే., తుంగా రాజగోపాల్ గారు, నెల్లూరు రామమూర్తి గారు, ఆకుల సుబ్రహ్మణ్యం, ధనికుల నరసింహం పీవీ ఆర్కే ప్రసాద్ గార్ల ప్రభావం కంచర్ల మీద వుంది.

విద్యాభాసం

[మార్చు]

నెల్లూరు జిల్లా సంగంలో ప్రాధమిక, ఉన్నత విద్యనభ్యసించాను. తిరుపతిలో మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేశారు.

వృత్తి, ప్రవృత్తి

[మార్చు]

16వ ఏట నుంచే పాత్రికేయ వృత్తిని ఆరంభించారు. విలేకరి స్థాయి నుంచి సంపాదకుని స్థాయి వరకు పత్రికా రంగంలో ఎదిగారు. నెల్లూరు కాలింగ్, జమీన్ రైతు, లాయర్, అపరాజిత, సాయంకాలం, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి పత్రికల్లో పనిచేశారు. నెల్లూరు నుంచి మన పత్రిక అనే స్థానిక పత్రికను నడిపారు. 07-07-2007 వతేదీ తిరుపతిలో ఏడుకొండలవాని శ్రీవారి సన్నిధిన " సేవ" అనే చిరు పత్రిక దినపత్రికగాపుట్టింది. 'సేవ' తెలుగు పత్రికకు ప్రధాన సంపాదకుడిగా కొనసాగుతున్నారు. . కళ సంస్ధ పేరుతో నాటక కళా పరిషత్తును నిర్వహించారు. కళా రంగంలో దర్శకులు, ప్రయోక్త, గుణ నిర్ణేతగా రాణించారు. తెలుగు సాహితీ పితామహుల పొత్తిళ్ళలో పెరిగిన మన తెలుగు భాష గొప్పవిషయాలను, సమగ్ర తెలుగు సమాచారాన్ని, కళలను సాహిత్యాన్ని, తెలుగుకు సంబంధించిన సకల సమాచారాన్ని, తాజా విశేషాలను ఒక చోట భద్రపరచాలనే సంకల్పంతో తెలుగు ఈ’ http://telugue.net/ మరియు http://www.sevalive.com/ అంతర్జాల పత్రికలను నడుపుతున్నారు.