వాడుకరి:డాక్టర్ అప్పలయ్య
- ప్రొఫెసర్ (డాక్టర్ ) మీసాల అప్పలయ్య Prof. Dr. Appalayya Meesala
నేను ఎంబీయే, పీహెచ్డీ చేసి దక్కన్ స్కూల్ అఫ్ మేనేజ్మెంట్,, హైదరాబాద్ లో ఆచార్యుని గా పనిచేస్తున్నాను. మా సొంతవూరు విజయనగరం జిల్లా, గనివాడ గ్రామం.
నేనుచేనేత సమస్యల మీద, వ్యాపార నిర్వహణా సమస్యలమీద , వ్యక్తిత్వ వికాసం మీదా వ్యాసాలు రాస్తుంటాను. నేను ప్రొఫెసర్ ముర్రు నాయుడు తో కలిసి వ్రాసిన 'విజయ పథం ' పుస్తకాన్ని ఎమెస్కొబోక్స్ వారు అచ్చు వేసారు. నా వ్యాసాలు ఈనాడు, ఆంధ్ర జ్యోతి, ది హిందూ లలో ప్రచురింప బడ్డాయి .
డాక్టర్ అప్పలయ్య వ్రాసిన ఫ్రీ వెర్సు
1.శ్రమించడమే నీ జీవనం
ఆత్రితగా అధినాయకున్ని
అడుగులో అడుగై అనుసరిస్తూ
అహర్నిషల్నీ పరుగల పాఠాలతో నింపి, నీ ముందున్న సోదరుడు వేసే
అడుగడుగు నీ ఆజ్జ్ఞయై, జవదాటని రాముడవైనపుడు
ఎన్ని సముద్రాలు నీ చెమటల
పరవల్లకు నిష్చేస్తులయ్యయో తెలుసా!
ఎన్ని ట్యాంకర్ల ఫ్యుయల్లని నింపుకున్నా వో నా ముద్దుల చీమా?
గ్రుక్క తిప్పుకోవడం నీ వెరుగవ్!
వీధి చివర బాతాకానీ కొట్టడం కూడా తెలియని అమాయకుడవ్!
శ్రమించడమే నీ జీవనం
విశ్రమించడం నీలో లేని గుణం
నీ నడకా, నీ పరుగు
నీ ఖజానాల్ని నింపే మంత్రాలు
నిన్ను చూసి స్పందించని మిడుతలు
పదోతరగతి పది సార్లు ఫెఇలయ్యే బడుద్ధాయిలు
2. కర్మించని క్షణాలు
క్షణాల రాళ్ల వినిర్మిత
పిరమిడ్ సందోహం ఈ ప్రపంచము
వృధా అయిన ప్రతీ క్షణ కణం
అగాధాల్లోకి తోసివేయబడ్డ
అతి శక్తివంతమైన ప్రభంజనం
ఆవిరైపోయే ఆలోచల్ని కార్యాల్లో పొదిగితే
సిద్ధులయి, కార్యసిద్దులై, బుద్ధులై, ఉథ్ క్రిస్తులయి
తరాల అంబరాలని తాకే
కీర్తి హర్మ్యాలై
జీవనామ్రుత భాణ్దాలై
శక్తి భాండా గారాలై
కార్యచేతన ప్రభాకరులై
బ్రతుకు థారిని చూపే
జ్ఞాన దీపాలై
రాజులు నిష్క్రమించని కోటలై
మిగుల్తై
పోయిన ప్రతి ప్రతీ క్షణము
మహానీయతా మృత భాన్దానికి పడ్డ
చిల్లులై, వృద్దిని మ్రింగే వైకుంఠ పాళీ పాములై
చెదల చీకట్లలో
పీకపిసుక్కున్న పిండాలై
ఝాన్ఝామారుతంలో తన్నివేయబడ్డ
శిశిర కాలపు ఆకులై
వచ్చికుడా చచ్చిపోయిన హీరోలవుతాయ్!
ఆలోచనలు కేవలం ఆలోచనలు
కార్యంతో కలువని మంద భాగ్యులు
తోలు గుడ్లు అవి
రైతుల కడుపు కొట్టే పొల్లు గింజలు అవి
యుగయుగాల చీకట్లలో
విచాన్నమైన పిండాలు అవి
ఎప్పటికి ఎవ్వరికి తలపుకు రాని
సామాన్యత్వపు ఇసుక రీనువులు అవి
'కర్మించని' క్షణాలు
కాలం ఏనుగు విసర్జించిన ఫలాలు