వాడుకరి:శాస్త్రి/ప్రయోగశాల2

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నందలూరు కడప జిల్ల లొ బహుద నది ఒడ్డున గల గ్రామం. ఈ గ్రమం రాజంపేట కు 10 కి.మి, కడప కు 45కి.మి దూరంలొ రాజంపేట-కడప హైవే మీద కలదు. ఈ గ్రామం రైలు స్టేషను చెన్నై-గుంతకల్ సెక్షన్ లొ వస్తుంది. ఈ గ్రామం లొ అతి ప్రాచీనమైన సౌమ్యనాధ స్వామి దేవస్థానం కలదు.

గ్రామ నామవృత్తాతం

[మార్చు]

11 వ శతాబ్ధం శ్రీ కుళోత్తుంగ చొళచతుర్వేదమంగళం(నిరందరనురు) శాసనాల అధారంగా ఈ గ్రామాన్ని ఆయన పరిపాలన జరిపాడు అని తెలుస్తోంది. ఈ గ్రామనికి పూర్వపు పేర్లు నిరందనురు, నిరంతనురు, కాలక్రమంలొ నిరంథపుర, నెలాందలురు తరువాత ఇప్పటి నందలూరు గా పరివర్తన జరిగింది. నిరంతర మహారాజూ ( ధృష్ట్యద్యుమున మహారాజు కొడుకు) ఈ గ్రమ్మన్ని అగ్రాహారం గా ఇచ్చి, "నిరంతపుర" గా తనపేరు పెట్టు కొన్నాడు. ఒకసారి బహుదా నదికి వచ్చిన వరదలలో ఈ గ్రమ్మం అంతా కొట్టుకొని పొటే అప్పటి మహారజు వేశ్య ఇక్కడకు వచ్చి పూర్వపు నిరంతపురం లొని ఉత్తర భాగాన్ని బ్రాహ్మణులకు సర్వాగ్రాహారం గా దానం ఇచ్చింది.

సౌమ్యనాధ స్వామి దేవస్థానం శిలాశాసనాలు

[మార్చు]

ఆలయం లొ ఉన్న శిశాసనానల ప్రకారం 1078 నుండి 1619 వరకు ఈ దేవాలయాన్ని చోళులు, పోత్తాపి తెలుగు చోళులు, నెల్లూరు తెలుగు చోళులు, పాండ్యులు, కాకతీయులు, విజయనగర రాజులు ఆలయాన్ని అభివృద్ది పరచారు.ఈ దేవాలయం 8-12 ఎకరాల విస్తేర్ణంలొ విస్తరించి ఉంది. ఈ గుడిలొ ప్రధాన దేవత సౌమ్యనాధ స్వామి (శ్రీమహావిష్ణువు) , నారదముని ప్రతిష్ఠ.

ఆలయం

[మార్చు]

సౌమ్యనాధ స్వామి దేవలయం తూర్పు ముఖమై ఉంది. దేవాలయానికి రెండు ప్రాకారాలు ఉన్నాయి.బయటి ప్రాకారం దీర్ఘచతురస్రాకారం లొ 3 గాలి గోపురాలతో ఉంటుంది. వెలుపల ప్రాకారానికి లోపలి ప్రాకారనికి మధ్య ఆలయం లొకి ప్రవేశిస్తు ఉంటే వరుసగా తుర్పు ప్రాంగాణంలొ బలి పీఠం,గరుడదేవుని సన్నిధి వస్తాయి. లొపలి ప్రాకారం లొ లొపలి ప్రాంగణం, ముఖ్య మండపం, అంతరాలయం, గర్భగుడి ఉన్నాయి.లొపలి ప్రాకారం లొని ఉత్తర ప్రాంగణం లొ చిన్న బావి కలదు.

  • తూర్పు గాలిగోపురంలొ చోళ శిల్పకళాచాతుర్యం కనిపిస్తుంది. గాలిగోపురం గోడపై మకరతోరణాలు, కపోటకుడూ భుతమాలలతో,మరగుజ్జులతొ కనిపిస్తాడు.
  • దక్షిణ గాలిగోపురం శిధిలావస్థలొ ఉంది.ఈ గాలి గోపురం పై కప్పు పై కమలపత్రం కనిపిస్తుంది.గాలి గోపురం లొ విజయనగర రాజుల శిలా చాతుర్యం కనిపిస్తుంది.
  • ఉత్తర గాలిగోపురం లొ కూడా పై కప్పు పై కమల పత్రాలు, కపోటకుడు కనిపిస్తారు.
  • ఆలయప్రాగణంలొని గరుడిన్ సన్నిధి లొ గరుడుడు రెండు రెక్కల తో స్వామి వైపు చూస్తూ అంజలి ఘటించి కూర్చొని ఉంటాడు.