వాడుకరి:Arjunaraoc/తెవికీ చదువరుల ప్రాధాన్యతలు
- మొదటగా 2010లో ప్రారంభించి విస్తరిస్తున్న విశ్లేషణ
తెవికీలో చాలా వరకు సభ్యులు ఎంతమంది, ఎవరు చురుకుగా వున్నారు, ఏ వ్యాసాల సమిష్ఠి పని ఎక్కువగా వుంది అనే అంశాలపై గణాంకాల విశ్లేషణ అందుబాటులో వున్నది. అయితే సభ్యులకన్న చదువరులు లేక పేజీవీక్షణలు ఎక్కువ. ఏ పేజీలు ఎక్కువగా చదవబడుతున్నాయి అనడానికి సమాచారము అందుబాటులోకి వచ్చింది. అయితే ఇది వ్యాసం స్థాయిలో మాత్రమే వుంది. విషయాల సముదాయంగా ప్రాధాన్యతలు ఎలా వున్నాయి అనే విశ్లేషణ, ఈ వ్యాసం ప్రధాన లక్ష్యం. దీనిలో ముఖ్యాంశాలననుసరించి వికీపీడియాలో వ్యాసాల తయారీలో, సూచికలో ఏ మార్పులు కావాలి, తెవికీ ప్రతి తెలుగువానికి సమాచారనిధిగా ఉపయోగపడటానికి ఏం చేయాలో తెలియచేయటం ఇతర ఉద్దేశ్యాలు.
సమాచార మూలాలు
[మార్చు]- పేజీ వీక్షణలు [1]. ఇది డిసెంబరు 2009 కి మాత్రమే ఇవ్వబడినవి.
- నెలసరి వికీపీడియా పేజీ వీక్షణలు[2] దీనిలో డిసెంబరు 2009 వరుస చూడండి. ఇక్కడ నుండి కావలసిన ముఖ్యమైన సమాచారము, మొత్తము వీక్షణలు 4 మిలియన్లు అనగా 40 లక్షలు. ఈ గణాంకము సర్వర్లో వత్తిడి కారణంగా 20 నుండి 30 శాతం తక్కువగా చూపెట్టబడిందట. అది కనుగొనటం ఆలస్యం అవటంతో అసలైన గణాంకాలు అందుబాటులో లేవు. అయినా సరే మన విశ్లేషణకి దీని ని యధావిధిగా వాడుకుందాం.
- పేజీమార్పుల సమాచారము [3], దీనిలో ముఖ్యమైన సమాచారము డిసెంబరు 2009 లో 4.7K మార్పులు జరిగాయి.
- సర్వే సమాచారము
- ఇంటర్నెట్ వరల్డ్ స్టాట్స సంస్థ[4] ప్రకారం, భారతదేశంలో 81మి అంతర్జాల వాడుకరులు (6.9% శాతం జనాభా) వున్నారు.
- భారత ఇంటర్నెట్ అండ్ మొబైల్ సముదాయ సంస్థ[5] ప్రకారం, ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాలునుండి కనీసం నెలకొకసారి అంతర్జాల ము వాడే వాడుకరులు 6 లక్షల మంది వున్నారు. అదే విధంగాభారత పట్టణ ప్రాంతాలలో వున్న 266 మి లో 87మిలియన్లు (లేక 8.7 కోట్లమంది) కంప్యూటర్ వాడుకరులుకాగా, 71మి అంతర్జాల వాడుకరులని అంచనా వేయబడ్డారు.
- అంధ్ర ప్రదేశ్ లో IRS 2009[6] లెక్కల ప్రకారం: ఇంటి నుండి అంతర్జాల సౌకర్య కలిగి వున్న వారు: 3,74,000, స్వంత కంప్యూటర్ కలిగివున్నవారు:8,65,000. ఇంటి దగ్గర కంప్యూటర్ లేని వారు: 6,49,30,000.
- ఈనాడు లోనిలెక్కల ప్రకారం ఆ సైటుకి ఇండియాలో 32 లక్షల వాడుకరులున్నారు.
- మొత్తం వికీ అన్ని భాషలలోచదువరులు 347 మిలియన్లు [7] మొత్తం అంతర్జాల వాడుకరులు1225 మి (సుమారు), గూగుల్ వాడుకరులు (సుమారు75 శాతం), వికీ వాడుకరులు (సుమారు 30 శాతం) )
- 'ఇండియా ఆన్ లైన్ 2008' భారత్ లో ఒక సంవత్సరంలో ఇంటర్నెట్ వినియోగం పై జక్స్ట్ కన్సల్ట్ వారి సమగ్ర పరిశోధన [8] ప్రకారం 40మిలియన్ల పట్టణ ప్రాంత, 9మిలియన్ల గ్రామీణ ప్రాంత నెట్ వినియోగదారులతో కలిపి మొత్తం 49మిలియన్ల నెట్ వినియోగదారులు ఉన్నారు.
విశ్లేషణా పద్ధతి
[మార్చు]అత్యధిక వీక్షణలు కల వ్యాసాలను, ప్రధాన విషయాలపరంగా వర్గీకరించి, ఆ వర్గీ కరణ క్రోడీకరణలను బొమ్మల ద్వారా తెలియచెప్పటం, మరియు విశ్లేషించటం.
చదువరులు డిసెంబరు 2009
[మార్చు]- డిసెంబరు 2009
డిసెంబరు 2009 లో తెవికీ ని చదివేవారి ని క్రింది విధంగా క్రోడీకరించవచ్చు
- క్రియాశీల సభ్యులు 4 కొత్తవారు, 5 కన్న ఎక్కువ మార్పులు చేసినవారు 34, 100 కన్న ఎక్కువ మార్పులు చేసినవారు 5; మొత్తం:41
- క్రియాశీలంలేనిసభ్యులు:337-41 అనగా 296
- మొత్తం తెవికీ చదువరులు: అంచనా వేయాలి
- క్రింద అంచనాలు వేరు వేరు సర్వేల ఆధారంచేసుకొని ఇవ్వబడినవి. నెలకు ఒకసారి అయినా ఇంటర్నెట్ వాడే వారిని క్రియాశీల వాడుకరిగా కొన్ని సర్వేలలో గుర్తించడం జరిగింది.
- ఆంధ్ర ప్రదేశ్ లోపల గ్రామీణ ప్రాంతాలనుండి తెలుగు వెబ్సైట్లు వాడేవారు: 93,500(అంచనా) (ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాలునుండి కనీసం నెలకొకసారి అంతర్జాల ము వాడే వాడుకరులు 6 లక్షల మంది వున్నారు దానిలో 25 శాతం అంతర్జాల వాడుకరులు మాత్రమే తెలుగు వెబ్సైట్లు గురించి తెలిసివుంటారు (IAMAI study)) :
- ఆంధ్ర ప్రదేశ్ లోపల పట్టణ ప్రాంతాలునుండి తెలుగు వెబ్సైట్లు వాడేవారు: 4,15,555 (అంచనా) (జక్స్ట్ కన్సల్ట్ సర్వేలో 40 మి పట్టణ ప్రాంతాల వాడుకరులు 9 మి గ్రామీణ ప్రాంతాల వాడుకరులున్నట్లుగా చెప్పబడింది. అదే అనుపాతము ఇక్కడ వాడటం జరిగింది)
- ఆంధ్ర ప్రదేశ్ లోపల నుండి తెలుగు వెబ్సైట్లు వాడేవారు: 5,09,555(అంచనా). అంటే సగటు చదువరుల లెక్కన, తెలుగు దిన పత్రికలలో ఐదవ స్థానంలో, వార పత్రికలపోల్చుకుంటే ప్రథమ స్థానం అన్నమాట. చూడండి సమాచార సాధనాల విస్తృతి.
- ఆంధ్రప్రదేశ్ బయట భారతదేశంలో తెలుగు వెబ్సైట్లు వాడే వారు: అంచనా వేయాలి
- భారత్ బయట తెలుగు వెబ్సైట్లు వాడే వారు: అంచనా వేయాలి.
వ్యాసాల వర్గీకరణ
[మార్చు]తెవికీ వాడే వారు, గూగుల్ అన్వేషణ ఫలితంగా, వెబ్సైటు లో నేరుగా తెవీకీలో ప్రవేశించవచ్చు. ప్రవేశించిన తర్వాత వ్యాసాల లింకులను బట్టి, వర్గాలను బట్టి, లేక ప్రధాన వ్యాసాల సూచీ ఆధారంగా కొత్త వ్యాసాలు చదవటం చేయవచ్చు. ప్రతి వారం మారే ఈ వారపు వ్యాసం పేజీ వీక్షణలపై ప్రభావం చూపవచ్చు. తెవికీలో వున్న ప్రధాన సూచి ఈవిధంగా వర్గీకరించింది.
- ఆంధ్ర ప్రదేశ్
- భాష మరియు సంస్కృతి
- భారత దేశం మరియు ప్రపంచం
- విజ్ఞానం మరియు సాంకేతికం
- తెలుగు సినిమా
- విశేష వ్యాసాలు
- సహకారం
వీటికి తోడు దోషం అన్న వర్గం కూడా చేర్చి వ్యాసాలని వర్గీకరించండం జరిగింది. ఇలా చేసినపుడు ఈ సూచనలు పాటించడం జరిగింది.
- మొదటి పేజీ, వికీపీడియా నిర్వహణ ప్రత్యేక వర్గం గా చూపడం జరిగింది
- సంవత్సరాలు, నెలలకు సంబంధించిన వ్యాసాలను భారత దేశం మరియు ప్రపంచం లో చేర్చడం జరిగింది
- వాడుకరి పేజీలు, వ్యాస చర్చా పేజీలు సముదాయం లోచేర్చడం జరిగింది
- తెలుగు భాషల, పురాణాల వ్యాసాలు భాష మరియు సంస్కృతిలో చేర్చడం జరిగింది. మిగతావి భారత దేశం మరియు ప్రపంచం లో చేర్చడం జరిగింది.
- మానవీయ శాస్త్రాలు కూడా విజ్ఞానం మరియు సాంకేతికం లో చేర్చడం జరిగింది.
ఫలితాలు
[మార్చు]నేను అనుకొన్న దానికి భిన్నంగా ఫలితాలున్నాయి. మీరు కూడా ప్రాధాన్యతలుఎలా వుండాలో ఒక్కనిముషం ఆలోచించి చదవటం కొనసాగించండి.
వ్యాస సూచి | శాతం |
---|---|
భారత దేశం మరియు ప్రపంచం | 22.30% |
విజ్ఞానం మరియు సాంకేతికం | 17.71% |
సముదాయము | 14.46% |
భాష మరియు సంస్కృతి | 13.39% |
ప్రత్యేక | 12.05% |
ఆంధ్ర ప్రదేశ్ | 9.85% |
దోషం | 6.61% |
తెలుగు సినిమా | 3.64% |
అంధ్రప్రదేశ్ 9.85 శాతంతో 6 వ స్థాయిలో వుంది. భాష మరియు సంస్కృతి కలిపితే మొదటి స్థాయి అంశంతో సరిపోతుంది. దీనికి వీక్షకులలో సగానికి పైగా ఆంధ్రప్రదేశ్ బయటవున్నవారు కావటం, బాగా చదువుకున్న వారు కావటం వలన కావచ్చు, భారతదేశం మరియు ప్రపంచం మొదటి స్థాయిలో నిలిచింది. సామాన్యజ్ఞానంపై ఆసక్తి కావచ్చు. సముదాయ వ్యాసాలపై 14.46శాతంతో ఆసక్తి సముచితంగా వుంది. ఆశ్చర్యం కలిగించే విషయమేమిటంటే, ప్రత్యేక భాగంగా చూపిన తెలుగు సినిమా 3.64 శాతంతో ఆఖరి స్థాయిలో వుండటం. తెలుగు సినిమా, ఆంధ్రప్రదేశ్ తక్కువ స్థాయిలో వుండటానికి వాటిలో మొలక వ్యాసాలు ఎక్కువ గా వుండటం కావచ్చు.
మెరుగుకు సూచనలు
[మార్చు]తెలుగు వికీపీడియా తెలుగు వారిసమాచార అవసరాలకు తోడ్పడాలంటే, ఆంధ్రప్రదేశ వ్యాసాల వీక్షణలు అత్యధిక స్థాయిలో, ఆ తరువాత భారత మరియు ప్రపంచం వర్గం వుండాలి. దానికోసం, తెవికీ పరంగా
- ఆంధ్రప్రదేశ్ లో తెవికీ గురించి జాగృతి కార్యక్రమాలు చేపట్టాలి.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వశాఖల, దైనందిన సంగతులు గురించి వ్యాసాలు పెద్ద పెట్టున చేయాలి
- తెలుగు వికీని పాత్రికేయులకు, విద్యార్ధులకు మూలాలకు మొదటి స్థానంగా చేయాలి.
- ప్రధాన వ్యాసాలసూచీని మరల తయారుచేసి, విజ్ఞాన సర్వస్వాల వర్గీకరణ ఆధారంగా చేయాలి. తెలుగు సినిమాను సంస్కృతిలో భాగంగా చేయాలి. మానవీయ శాస్త్రాలకు ప్రత్యేకసూచీలో కేటాయింపు ఇవ్వాలి.
- మొలక వ్యాసాలను తొలగించటం. ఆ సమాచారము జాబితాలో ఎలాగూ వుంటుంది కనుక.
ముగింపు
[మార్చు]తెలుగు వికీపీడియా త్వరలో 7 సంవత్సరాలు పూర్తిచేసుకోబోతున్నది. ఈ సందర్భంగా తెవికీ కి దిశా నిర్దేశనం క్రియాశీలురైన సభ్యులచే చేయవలసివున్నది. పేజీవీక్షణల విశ్లేషణ ఆధారంగా కొన్ని సూచనలు చేయడం జరిగింది.
వనరులు
[మార్చు]201212
[మార్చు]అంతర్జాల వాడుకరుల(ప్రాంతీయభాషల)నివేదిక అంతర్జాల వాడుకరుల(ప్రాంతీయభాషల)నివేదిక ప్రకారం
- భారత జనాభా:1.2 బిలియన్
- కంప్యూటర్ వాడుటతెలిసినవారు: 224 మిలియన్
- అంతర్జాల వాడుకరులు: 150 మిలియన్ (12%)
- అంతర్జాల(స్థానిక భాష) వాడుకరులు: 45 మిలియన్
- అంతర్జాల(గ్రామీణ, స్థానికభాష) వాడుకరులు:24.3 మిలియన్ (గ్రామీణ అంతర్జాల వాడుకరులలో 64%)
- అంతర్జాల(పట్టణ, స్థానికభాష) వాడుకరులు:20.9మిలియన్ (పట్టణ అంతర్జాల వాడుకరులలో 25%)
- వికీ గణాంకాలు నవంబరు 2012
వికీ గణాంకాలు (వికీ గణాంకాలు పరిశీలనతేది జనవరి 17,2012) భారతదేశం నుండి 22.19 మిలియన్ మంది వికీని వాడుతున్నారు. ఇంటర్నెట్ వాడేవారిలో 31.80 శాతం మందిమాత్రమే వికీవాడుతున్నారు. ప్రపంచమొత్తంగా 484.49 మిలియన్ మంది వికీ వాడుతుండగా20.17 బిలియన్ పేజీ వీక్షణలు వున్నాయి. అనగా ఒక వ్యక్తి 42 పేజీవీక్షణలనుకలిగివున్నట్లు. తెలుగు వికీ పేజీవీక్షణలు డిసెంబరు 2012 లో20,08,988 కాబట్టి, 47833 మంది తెలుగువారు తెవికీని వీక్షిస్తున్నట్లు అనుకోవచ్చు. ఇంతకన్న మెరుగైన వీక్షకుల సంఖ్య కనిపెట్టే పద్దతి ప్రస్తుతము కనబడలేదు. అయితే ఈ సంఖ్యను ఇతర గణాంకాలతో పోల్చి సరియోకాదో తెలుసుకొనటానికి ప్రయత్నించవచ్చు. భారత జనగణన 2011 ప్రకారం రాష్ట్రాలవారీగా కంప్యూటర్ కల నివాసాలు
భౌగోళికప్రాంతం | నివాసాలు | కంప్యూటర్లు గల నివాసాలు | శాతం | జాలసంపర్కంగల | మొత్తం నివాసాలలో % | జాలసంపర్కంలేని | మొత్తనివాసాలలో % |
---|---|---|---|---|---|---|---|
భారతదేశం | 24,66,92,667 | 2,31,89,111 | 9.4% | 76,47,473 | 3.1% | 1,55,41,638 | 6.3% |
ఆంధ్రప్రదేశ్ | 2,10,24,534 | 17,66,061 | 8.4% | 5,46,638 | 2.6% | 12,19,423 | 5.8% |
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నెట్ సంపర్కంగల నివాసాలు 5,46,638 కాబట్టి వీరిలో 31.80శాతం మాత్రమే వికీ వాడుకరులైతే కనీసం ఇంటికి ఒక్కరి చొప్పున 1,63,991 మంది వాడుతుండవచ్చు. అనగా తెవికీ వాడుకరులు 47,833 -1,63,991 అనుకోవచ్చు.
ఇవీ చూడండి
[మార్చు]వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్/2017 viewing devices