వాడుకరి:Kotha Swetha/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భాష - ప్రయోజనాలు

[మార్చు]

భావ వ్యక్తీకరణకు ఉపయోగించేే సాధనం భాష. భావ వినిమయాకి సమాజం సమిష్టిగా సృష్టించిన వాగ్రూప సాధనం భాష. అంటే భాష సమాజం సృష్టించుకున్న సంకేతాల సముదాయం అని గ్రహించవచ్చు. సమాజం సృష్టించుకున్న సంకేతాలు కాబట్టి భాష ఎప్పుడూ కూడా సంఘాన్ని ఆశ్రయించి ఉంటుంది. మానవ మనుగడకు, సంస్కృతికి ప్రతిబింబంగా భాషను చెప్పుకోవచ్చు.ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 7117 భాషలు ఉన్నటుగా తెలుస్తుంది . అయితే కొన్ని భాషలకు మాత్రమే లిపి ఉంది చాలావరకు భాషలకు లిపి లేదు ,ఐనా సరే భావ ప్రసారాల మాధ్యమంగా లిపిరహిత భాషలు ఎంతగానో తోడ్పాటును అందిస్తూనే వున్నాయి . మానవ నిర్మితమైన భాషకు ముఖ్యంగా రెండు ప్రయోజనాలు ఉన్నాయి.

1 . సామాజికం

సామాజిక ప్రయోజనం

ఒక సమాజంలో పురోగతి కనిపిస్తోంది అంటే దానికి ముఖ్య కారణాలు ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, పారిశ్రామిక, శాస్త్ర-సాంకేతిక రంగాలలో వృద్ధి సాధించినప్పుడు మాత్రమే. ఈ రంగాలన్ని వృద్ధి సాధించడంలో ప్రధాన పాత్ర భాషదే. భాష సమాజంలో అన్ని రంగాలలో ఉన్నవారికి అనుసంధాన ప్రక్రియగా మారినప్పుడు మాత్రమే ఆ సమాజం పురోగతిని సాధించగలదు. మరోవిధంగా చెప్పాలంటే ఆయా రంగాలలో ఉన్నవారికి 'భాష' తన ప్రయోజనాత్మకతను అందించిందని చెప్పవచ్చు. అంటే ఇది భాష అందిస్తున్న సామాజిక ప్రయోజనం అని క్లుప్తంగా అర్థం చేసుకోవచ్చు. రాబోయే తరాలకు మన చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాలు మొదలైన ఎన్నో విషయాలు అందించడానికి భాష ప్రధానమైన వాహకం. భావ వ్యక్తీకరణలో కానీ జ్ఞానసముపార్జనకు కానీ భాష ప్రధానమైనది. సామాజిక జీవితాన్ని ప్రభావితం చేయటంలో భాష కీలక పాత్ర పోషిస్తుంది.

వ్యక్తిగత ప్రయోజనం

[మార్చు]

దీనిలో తిరిగి రెండు విధాలైన ప్రయోజనాలు ఉంటాయి .

సాంకేతిక ప్రయోజనం (Symbolic)

[మార్చు]

ఉద్దీపన ప్రయోజనం (Evocative)

[మార్చు]

పై రెండు కూడా ఒక్కొక్కటిగా అభివ్యక్తి (expressive) , గ్రహణం (Reseptive) అని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు . ఉద్దీపనకు , భావావేశాన్ని వ్యక్తీకరించడానికి ముఖ్యంగా మాతృభాషకే అధిక ప్రాధాన్యం , అధికారం ఉంటుంది . మాతృభాషపై పట్టు ఉన్నట్లైతే భావ సంభ్రమాన్ని , కళా వంధత్వాన్ని అధిగమించవచ్చు .

    మానవ నిర్మితమైన ఈ భాష రెండు రూపాల్లో కనిపిస్తుంది . మౌఖికంగా , సంకేతాల ద్వారా అభివ్యక్తం అవుతుంది . అక్షరాలు , సంకేత పదాల ద్వారా లిఖిత పూర్వకంగా మన భావాలను వెల్లడించడానికి అవకాశం ఉంటుంది . అదే ఉద్దీపన విషయంలో సంకేతాల అవసరం లేదు . రసావిర్భూతికి , భావోద్రేకాలను వ్యక్తం చేయడానికి మాత్రమే మౌఖిక భాష అందులో కూడా ప్రధానంగా మాతృభాషకు ప్రాధాన్యం ఉంటుంది . 
  సంకేత పదాలవినియోగం అనేది బుద్ధి గమ్యాలు .  శాస్త్రాలు మున్నగు విషయాలకు వస్తే మాత్రం ఇవి సూక్ష్మ బుద్ధులకు మాత్రమే వర్తిస్తాయి . కాబట్టి వీటికి సంబంధించి రసావిర్భూతికి తావు లేదు కాబట్టి సంకేత భాష అవసరం అవుతుంది . అదే సాహిత్యం , కళలు మొదలైన ఉద్దిపానానికి ఎక్కువ స్థానం ఉంటుంది . ఎందుకంటే ఇవి రసానందాన్ని ఇచ్చేవి . అంటే మనిషికి సంతోషం లేక ఏదోక భావనలను కలిగిస్తాయి కాబట్టి . అందుకే ఉద్దీపనము అనేది సార్వజనీన సర్వకాలికం అయి ఉంటుంది .

1 . మానవుని నిత్యజీవితంలో సామాన్య వ్యవహారాల నుంచి ఆధ్యాత్మిక చింతన వరకు ఉపకరిస్తుంది . 2 . జనభాహుల్యంలో పరస్పర సంభాషణలకు , లోక వ్యవహారాలకు , భావ వ్యక్తీకరణకు ఉపకరిస్తుంది . 3 . విద్య , వైజ్ఞానిక , సాంస్కృతిక పరంపరను కొనసాగించడానికి ఉపకరిస్తుంది . 4 . మనిషి ఔన్నత్యాన్ని మాట్లాడే తీరును బట్టి భాష ద్వారా తెలుస్తుంది . 5 . విషయ పరిజ్ఞానం పెంచుకోవడానికి కూడా ఉపకరిస్తుంది . 6 . మన ఆలోచనలు , భావాలు , ఆశయాలు , నైతిక , ధార్మిక భావాలను భాష ప్రతిబింబిస్తుంది . 7 . మనిషిలో సాహిత్య తృష్ణను వృద్ధి చేయడానికి ఉపకరిస్తుంది . 8 . మనిషి అనుకుంటున్న , భావిస్తున్న మనోభావనకు ఒక రూపాన్ని ఇచ్చేది భాష . 9 . సృజనాత్మక శక్తిని వృద్ధి చేయడానికి భాష ఉపకరిస్తుంది . 10. క్లుప్తంగా చెప్పాలంటే మానవుని మేదోసంపత్తిని పరిపుష్టం చేయడానికి భాష ప్రధానమైన సాధనము .