Jump to content

వాడుకరి:Naidu.a2014/ప్రయోగశాల

అక్షాంశ రేఖాంశాలు: 16°25′48″N 81°56′0″E / 16.43000°N 81.93333°E / 16.43000; 81.93333
వికీపీడియా నుండి
ముత్యాలపాలెం
—  గ్రామం  —
ముత్యాలపాలెం is located in Andhra Pradesh
ముత్యాలపాలెం
ముత్యాలపాలెం
అక్షాంశ రేఖాంశాలు: 16°25′48″N 81°56′0″E / 16.43000°N 81.93333°E / 16.43000; 81.93333
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పుగోదావరి
మామిడికుదురు రాజోలు
ప్రభుత్వం
 - సర్పంచి
వైశాల్యం
 - మొత్తం 1.667 లేక 412 ఎకరములు km² (సమాసంలో (Expression) లోపం: "ల" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను. sq mi)
ఎత్తు 5−25 m (80 ft)
జనాభా (2011)
 - మొత్తం
కాలాంశం IST (UTC+5:30) (UTC)
పిన్ కోడ్ 533248
ఎస్.టి.డి కోడ్ 08862
వెబ్‌సైటు: https://en.wikipedia.org/w/index.php?title=Mutyalapalem&action=submit

ముత్యాలపాలెం, తూర్పుగోదావరి జిల్లా, మామిడికుదురు మండలానికి చెందిన గ్రామము.


గ్రామ చరిత్ర

[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర

[మార్చు]

ముత్యాల అనే ఇంటిపేరు వాళ్ళు ఎక్కువగా ఉన్నందున ఈ ఊరికి ముత్యాలపాలెం అనే పేరు వచ్చింది.

గ్రామ భౌగోళికం

[మార్చు]
ముత్యాలపాలెం అనేది గోగన్నమఠం పంచాయతీలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు. ఇక్కడ పచ్చని పంట పొలాలు అందంగా చాలా విశాలంగా ఉండి ప్రజలకు ఉల్లాసవంతమైన , అరోగ్యకరమైన జీవితాన్నిప్రసాదిస్తాయి. ఈ గ్రామము రాజోలు తాలూకా మామిడికుదురు మండలం తూర్పుగోదావరిజిల్లాలో ఉన్నది. ఇది భౌగోళికపరంగా 16°25'48” ఉత్తర అక్షాంశం మరియు 81°56'0” తూర్పు రేఖాంశం వద్ద ఉన్నది. ఇది సముద్ర మట్టము నుండి 5-25 మీటర్ల ఎత్తులో ఉన్నది. ఈ గ్రామం మొత్తం విస్తీర్ణం 412 ఎకరములు. ఈ గ్రామం నుండి గోదావరి నది 1 కిలోమీటరు మరియు బంగాళాకాతము 3 కిలోమీటర్ల దూరములో ఉన్నవి. ఇది కోనసీమ డెల్టా అనగా గోదావరి నది మధ్యన ఉన్న ద్వీపంలోని ఒక ప్రాంతము. ఇది అమలాపురం పార్లమెంటరీ నియోజక వర్గములోనికి మరియు రాజోలు అసెంబ్లీ నియోజక వర్గములోనికి వస్తున్నది. ఈ గ్రామము సముద్రమునకు మరియు గోదావరి నదికి దగ్గరగా ఉండడం వలన ఇక్కడ అన్ని రకముల రొయ్యలు,పీతలు , చేపలు తాజాగా లభించును. ఇక్కడ ప్రఖ్యాతిగల రామలు అనే చేపలు లభించును. ఇవి చాలా అరుదుగా లభిస్తాయి. ఇవి మరెక్కడా కూడా లభ్యం కావు. ఇక్కడ ఉండే ప్రజలు అందరూ కూడా ఈ చేపలు, రొయ్యలు, పీతలుతో కూడిన విందును బాగా ఇష్టపడతారు.

సమీప గ్రామాలు

[మార్చు]

గోగన్నమఠం, కాట్రేనిపాడు, పొన్నమండ, కరవాక

సమీప మండలాలు

[మార్చు]

రాజోలు, నగరం, మల్కిపురం

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]
ఈ గ్రామము ఒక్క వరుస రహదారి (3.5 మీటర్లు లేదా 12 అడుగులు) రోడ్డు సదుపాయము మాత్రమే కలిగి ఉన్నది. ఇక్కడ నుండి జిల్లా రాజధాని కాకినాడ 87 కిలోమీటర్లు, రాజమండ్రి 79 కిలోమీటర్లు మరియు రాష్ట్ర రాజధాని విజయవాడ 180 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.ఇక్కడి నుండి సమీపంలో ఉన్న అన్ని యాత్రా ప్రదేశంలకు బస్సు సౌకర్యం మరియు ఆటోల వసతి కలదు. రైలు ప్రయాణం కొరకు దగ్గరలో ఉన్న పాలకొల్లు (33 కిలోమీటర్లు) లేదా నరసాపురం రైల్వే స్టేషన్ కు వెళ్ళవలసి ఉంటుంది. అలాగే విమాన ప్రయాణమునకు దగ్గరగా ఉన్న మధురపూడి (రాజముండ్రి) విమానాశ్రయంకు వెళ్ళవలసి ఉంటుంది.

గ్రామములో మౌలిక వసతులు

[మార్చు]
ఈ గ్రామంకు విద్యుత్ సరఫరా రాజోలు సబ్ స్టేషన్ నుండి సరఫరా చేయబడును. ఇక్కడ ఒక చిన్న ట్రాన్స్ పార్మర్ కలదు. ఇక్కడ 2 ఎకరాములలో ఒక మంచినీటి చెరువు కలదు. అలాగే నీటిని ఫిల్టర్ చేసే రెండు గ్రౌండ్ స్టోరేజి ట్యాంకులు మరియు ఒక ఎలివేటెడ్ స్టోరేజి ట్యాంకు కలవు. దీని ద్వారానే గ్రామములో ఉన్న గృహములకు త్రాగు నీటిని సరఫరా చేయుదురు. అంతే కాకుండా ఇక్కడ ప్రతి 100 మీటర్లకు ఒక కామన్ సముదాయ నీళ్ళ టాప్ కలదు. ఇక్కడ 5 వ తరగతి వరకు చదువుకొనుటకు ఒక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల తెలుగు మరియు ఇంగీషు లలో బోధనా సౌకర్యంతో కలదు. వరదలు,తుఫానుల సమయంలో ప్రజలకు పునరావాసం కొరకు ఒక పునరావాస భవణము కలదు. ప్రాథమిక ఆరోగ్య సౌకర్యం కొరకు ఇక్కడ ప్రజలు రాజోలులో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రముకు లేదా జగ్గన్నపేటలో ఉన్న ప్రయివేటు ఆరోగ్యకేంద్రాలకు వెళ్ళవలసి ఉంటుంది. వినోదం కొరకు ప్రజలు సినిమాలు చూడటానికి జగ్గన్నపేటకు వెళుతుంటారు. ఇక్కడ 6 సినిమా దియేటర్లు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ మంది యువకులు పవన్ కళ్యాణ్ కు అభిమానులు.ఈ గ్రామంలో డ్రైనేజీ సౌకర్యం లేదు. ఇక్కడ చాలా కుటుంభాలులో ఇప్పటికి కూడా మరుగు దొడ్ల సౌకర్యాలు లేవు

గ్రామము యొక్క ఆర్దిక స్థితి మరియు గ్రామములో రాజకీయములు

[మార్చు]
ఈ గ్రామంలో ఎక్కువ మంది మధ్య తరగతి ప్రజలు ఉన్నారు. వారిలో ఎక్కువగా రోజువారీ కూలీలు మరియు సన్నకారు రైతులు ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా కాపు, బలిజ, మాల, మాదిగ కులములకు చెందిన వారు ఉన్నారు. వీరిలో అత్యధికులు కాపు కులస్థులు. వీళ్ళకు ఆధాయము ముక్యంగా రొయ్యల చెరువులు, చేపల చెరువులు, కొబ్బరి తోటలు, మరియు వరి నుండి లభించును. ఇక్కడ సంవత్సరానికి 3 పంటలు పండిస్తారు. రెండు సార్లు వరి మరియు వేసవికాలంలో పెసర,మినప పంటలు పండిస్తారు. ఇక్కడ గోదావరి డెల్టా వల్ల ఏర్పడిన నల్లరేగడి నేలలు కొబ్బరి, వరి, అరటి, కాయగూరలు, పండ్లతోటలు, ఉద్యానవనములకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ కాలువలు అన్నీ గోదావరి నదికి అనుసంధానం చేయడం వల్ల వ్యవసాయంకు అవసరమైన నీరు పుష్కలంగా లభించును.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు మరియు పండుగలు

[మార్చు]
ఇంత చిన్న గ్రామములో 2 కనకదుర్గా అమ్మవారి దేవాలయములు, 2 రామాలయములు, ఒక ఛర్చు కలదు. ఇక్కడ ముఖ్యముగా సంక్రాంతి, ఉగాది, దీపావలి, దసరా, శ్రీ రామనవమి పండుగలను ఘణంగా జరుపుకొందురు.పండుగల సమయములలో ప్రజలు అందరూ కోడి పంధాలతో, పేకాటలతో, ఎడ్లబండ్ల పరుగు పంధాలతో, రికార్డింగ్ డాన్సులతో ఉత్సాహంగా గడుపుతారు. సంక్రాంతి నెలలో ఎంతో సందడిగా వాకిట్లలో ముగ్గులతో, భజనలతో, గంగిరెద్దుల వాళ్ళ సందడులతో, ఊరంతా ఉత్సాహంగా ఉంటుంది.

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)

[మార్చు]