Jump to content

వాడుకరి:Pavan santhosh.s/చిత్తు పేజీ

వికీపీడియా నుండి

వికీపీడియా వార్షిక సమావేశం 2020 డిసెంబరు 13

[మార్చు]

గత సంవత్సరంలో వివిధ వాడుకరులు వికీపీడియాలో చేసిన పనులు

[మార్చు]

అంగజాల రాజశేఖర్

[మార్చు]

500 కాపీహక్కులు లేని పుస్తకాలను వికీసోర్సులో చేర్చాను. తెలుగు రచయితలు, వ్యక్తుల పనిని ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ ఉన్నవి లింక్ చేయడం, వరల్డ్ క్యాట్ ఐటమ్స్ కలపడం, ఫోటోలు చేర్చడం వగైరా పనులన్నిటినీ చేస్తున్నాను.

చదువరి గారి సూచన, ప్రాజెక్టు పద్ధతిలో చేస్తే బావుంటుంది. దీని వల్ల ఒక వ్యక్తికి మీరు చేసే పని మీద ఆసక్తి ఉంటే మీ పనికి ఊతం ఇస్తుంది.

ప్రణయ్ రాజ్-

[మార్చు]

మొలక వ్యాసాల అభివృద్ధి చేయాలన్నది ఒక ప్రాజెక్టు. మొలక, సినిమా వ్యాసాలు తొలగించి కొత్తగా రాయాలన్నది ఐడియా. చాలా సినిమా వ్యాసాల ఇన్ఫోబాక్సులో సంగీతం చక్రవర్తి అనే ఉండేది. క్రితం ఏడాది కార్యక్రమంలో తీసేద్దామంటే తీయడం దేనికి పెంచవచ్చు కదా అన్నారు. 250 వ్యాసాలను ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేశాను. చాలా బావుంది.

అనువాద వ్యాసాల ఉపకరణం ద్వారా ఆగస్టు నాటికి కేవలం 2 వ్యాసాలు రాయగా, కొత్తగా అనువాద వ్యాసాల ఉపకరణంపై అవగాహన పెంచుకొని డిసెంబరు 15 నాటికి 150 దాకా వ్యాసాలు రాశాను.

ఐఐఐటీ-తెలంగాణప్రభుత్వంతో కలిసి ఒక బుక్ స్టాల్లో స్టాల్ పెట్టాం. వికీ ఛాలెంజ్ లో 1556 రోజులు పూర్తిచేశాను. తెవికి జన్మదినం సందర్భంగా ఒకే రోజున 10 కొత్త వ్యాసాలు రాశాను.

కశ్యప్-

[మార్చు]

ఈ ఏడాది వికీపీడియా ద్వారా ఉపాధి కూడా ఉంది. కరోనా వల్ల లక్ష్యానికి చాలా దూరంగా ఉండిపోయాం. కనీసం 250 మంది వరకూ వికీపీడియాలో ఎలా రాయాలో చెప్పాం. కానీ అందరూ విని ఊరుకున్నారు. ఈసారి ట్రైనింగ్ ఇచ్చినవారు పనిచేసేలాగా ఏం చేయాలో ప్రయత్నించాలని ఆశిస్తున్నాను. వీక్షకుల సంఖ్య పెరిగింది వికీపీడియాలో. కానీ, రాసేవాళ్ళు అలానే ఉన్నారు. తెలుగు రాసేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది.

ప్రణయ్ రాజ్ - స్టాల్లో ఫోన్ నెంబర్లు ఇచ్చినవారితో మాట్లాడామా?

కశ్యప్ - స్టాల్లో నెంబర్ ఇచ్చినవారితో ఫోన్ చేసి మాట్లాడాం. అందులో కొందరు వినడానికి మళ్ళీ వచ్చారు కూడా.

చదువరి-

[మార్చు]
  1. పది సంవత్సరాలకు పైబడి వికీపీడియాలో ఉన్న యాంత్రికానువాదాలను, నాలుగైదేళ్ళ పాటు చర్చించాం. ఈ ఏడాదిలో తొలగించాం. అందరూ చేశాం. నేను ఒక పాత్ర పోషించాను.
  2. ఏప్రిల్లో విస్తరణ ప్రాజెక్టు పెట్టారు. నేను ఈ మాత్రం పరిమాణంలో దిద్దుబాట్లు, విస్తరణ చేస్తానని బహిరంగంగా ప్రకటించి చేశాను. ఆ నెలలో ప్రకటించింది 6 లక్షల బైట్లు కాగా 31 లక్షల బైట్లు చేశాను.
  3. ఫిబ్రవరిలో అనువాద పరికరంలో 30 శాతం పరిమితి పెట్టాలని, డెవలపర్ తో చర్చించి, ఆ చర్చలో ఆయన సూచనల బట్టి రెండు పనులు చేశాను - 1. కనీసం మానవిక అనువాదం 30 శాతం ఉండాలని చర్చ పెట్టాను. 2. నిర్ణయాన్ని బట్టి అమలు చేయించాను. 3. మరియు అని ఉంటే వడపోత అడ్డుపడాలని చేర్చాను. అది వికీకి చాల ఉపయోగపడిందని నమ్ముతున్నాను. నిజమైంది.
  4. జూన్, జూలై, ఆగస్టులో - మొలకల విస్తరణ ఋతువు చేశాం. 6500 మొలకల జాబితా తయారుచేశాం. ప్రాజెక్టు నిర్వహించాం. తెలుగు వికీపీడియాలో అంతకన్నా విజయవంతమైన ప్రాజెక్టు మరొకటి లేదు.
  5. వెంటనే - 30 శాతం మానవిక అనువాదాన్ని తొలగించాలని ప్రతిపాదన వచ్చింది. దానివల్ల తెలుగు వికీపీడియాకు దెబ్బ అని నమ్మి గట్టిగా వ్యతిరేకించాను. ప్రతిపాదన వీగిపోవడం అన్నది నాకు చాలా మనస్ఫూర్తిగా సంతోషించాను. చర్చలు బాగా జరగాలని నేను నమ్ముతాను. అప్పుడే తెలుగు వికీపీడియాకు సరైన దిశ అవుతుంది. తెలుగు వికీపీడియాలో చర్చల్లో పాల్గొనని వారు ఆ మేరకు నష్టం చేసినట్టే. ఇటువంటి చర్చల్లో పాల్గొనని వారు ఇకనైనా పాల్గొంటారని ఆశిస్తున్నాను.
  6. అనువాద పరికరం ద్వారా నేను చేతున్న అనువాద వేగం బాగా పెరిగింది. నెలనెలా కనీసం 30 అయినా చెయ్యాలని తలపెట్టాను.
  7. జిల్లాకు, ముఖ్యపట్టణానికి వేర్వేరు పేజీలు ఉండాలని భావించి ఒక ప్రాజెక్టు చేపట్టాను. ఉన్న కొద్దిమందితోనూ బాగా జరుగుతున్నట్టే లెక్క. ఎంత వేగంగా చేసినా ఏడాది పని పడుతుందని భావిస్తున్నాను.
  8. వాడుకరులకు సూచనలు అని పేజీ పెట్టి, వికీపీడియాకు రచనలు చేయడంలో కిటుకులను, సాంకేతిక విశేషాలను అందించడం ఒక లక్ష్యంగా పెట్టుకుని ఒక పేజీ పెట్టాను. ఎప్పటికప్పుడు తెలిసిన విషయాలను అందులో పెడుతున్నాను. అందులో అందరూ రాయాలన్నది నా ఉద్దేశం.
  9. ఎప్పుడూ చేసే పని ఒకటుంది. భాషా దోషాలను తొలగించడం. ఆటో వికీ బ్రౌజర్ ద్వారా ఈ పనిచేస్తున్నాను. అందరూ ఆటో వికీ బ్రౌజర్ వాడాలని, ఆ దోషాలను తొలగిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను.
  10. విధానాలు మార్గదర్శకాలకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలను ముందుకు తెచ్చాను. కొన్ని ఆమోదం పొందాయి, కొన్ని వీగిపోయాయి.

శ్వేత-

[మార్చు]

వికీపీడియా గురించి నాకు చాలా పాజిటివ్ అభిప్రాయమే కలిగింది. ప్రాజెక్టు ఉన్నన్నాళ్ళే కాకుండా తర్వాత కూడా పనిచేద్దామని అనుకుంటున్నాను. ప్రతీ ఏడాది అనాథ శరణాలయాలకు విరాళాలు కలెక్ట్ చేసి సేవ చేస్తూ ఉంటాను. నాకు యూజీసీ తరఫున వచ్చిన ఫెలోషిప్ నుంచి 25 వేల వరకూ డొనేట్ చేశాను.

ప్రభాకర్ గౌడ్ నోముల-

[మార్చు]

ప్రణయ్ గారు చేసినట్టు ఏదైనా రికార్డు సృష్టించాలన్న ఆలోచనలో ఉన్నాను. ఆ విషయంలో కొంత గోప్యత పాటిస్తున్నాను. మొలకల్లో 25 మాత్రమే చేశాను. ఇంకా పనిచేసి ఉంటే బావుంటుందని అనిపిస్తుంది. కోవిడ్ సమయంలోనే ఎక్కువ పనిచేయగలిగాను. నేను రాజకీయంగానూ, వ్యాపారపరంగానూ బిజీగా ఉండేవాడిని, పనిచేయలేకపోయేవాడిని. ఇప్పుడు పూర్తిస్థాయిలో వికీపీడియాలో పనిచేస్తున్నాను. వెంకటరమణగారు నన్ను ఈమధ్య నిర్వాహకునిగా ప్రతిపాదించారు.

సుజిని -

[మార్చు]

వాయిస్ ఆఫ్ గర్ల్స్ అన్న సంస్థలో విద్యార్థినులకు ట్రైనింగ్

పవన్ సంతోష్

[మార్చు]
  1. అనువాద పరికరాన్ని మరింతగా వాడేందుకు ఒక నెల రోజుల ప్రాజెక్టును నిర్వహించాను
  2. విధాన నిర్ణయాలు చెయ్యడంలో భాగం చర్చల్లో పాల్గొని నా అభిప్రాయలను చెప్పాను.
  3. అనువాద పరికరంలో మానవిక అనువాద శాత పరిమితిని తొలగించే ప్రతిపాదనను వ్యతిరేకించి నా అభిప్రాయాన్ని చెప్పాను


విస్తారమైన హెల్ప్ సిస్టమ్ ఉండాలి. దీన్ని నవీకరించాలి. మనకున్న హెల్ప్ దాదాపుగా సున్నా. రాజశేఖర్ గారు చెప్పినట్టుగా ముందు కొత్తవాళ్ళకి ఉపయోగపడేలా చేయడం అన్నది నా ప్రయారిటీ. రాజశేఖర్ గారు మనం అందరం కలిసి చేద్దామంటున్నారు. చదువరి గారి ఉద్దేశం హెల్ప్ స్కీం పెట్టుకోవాలి. ఒక్కో ఐటమ్ రెండు మూడు స్థాయిల్లో కూడా చేసుకుంటూ పోవాలి. కొత్తగా వచ్చినవారికి సైతం 40, మొత్తంగా 200 వీడియోలు చేయాల్సి ఉంటుంది. మనం రాయడం అంటే రాయవచ్చు, కానీ మనకు బాధ్యత, కంపల్షన్ ఉంటుంది. ప్రస్తుతం మనకు జరుగుతున్న వేగం చూస్తే ఎవరి పనులు వారికి ఉండడం వల్ల ఇదంతా మనం చేయగలం అని అనుకోవట్లేదు. స్వచ్ఛందంగా చేయలేం అన్నది నా ఉద్దేశం. చేయాలి అంటే ఖచ్చితంగా ఒక టీం ఉండాలి. డెడికేటెడ్‌గా ఆ పనిమీదే ఉండాలి. ఇదే పనిచేస్తూ ఉండాలి.