వాడుకరి:Tejaswini

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాసరచన పోటీ కొరకు వ్యాసం

వికీపీడియా అంటే ఏమిటి. విద్యార్థులకు వికీపీడియా ఎలా ఉపయోగపడుతుంది.[మార్చు]

వికీపీడియా గురించి[మార్చు]

వికీపీడియా అనేక భాషలలో ఉన్న స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము. దీన్ని వికీమీడియా ఫౌండేషన్ నడిపిస్తుంది.

వికీపీడియా చిహ్నం

వికీపీడియా అంటే?[మార్చు]

వికీ అనగా మంది సభ్యులు సవరించు- భధ్రపరచు అనే బటన్స్ ద్వారా ఒక వెబ్ సైట్ రుపొందించే పద్ధతి. వికీకి hawaii భాషలో త్వరగా అనే అర్ధం వస్తుంది.పిడియా అనే పదం encylopedia అనే పదం నుంచి వస్తుంది.encylopedia అనేది G.K.బుక్ లాంటి విజ్ఞాన సర్వస్వము.ఈ రెండు పదాల నుంచి వికీపీడియా తయారైంది.‌

మొదలు[మార్చు]

2001లో జిమ్మీ వేల్స్, లారీ సాంగర్ కలిసి ఈ వెబ్ సైట్ ను రూపొందించారు. ఇంటర్ నెట్ లో ఎక్కువమంది చుసే వెబ్ సైట్ల లో అలెక్సా ప్రకారం వికీపీడియాది 5వ/6వ స్థానం. మొదట నిపుణుల ద్వార న్యూపిడియాగా మొదలయ్యింది.తరువాత ఎవరైనా రాసే విధంగా మార్చి వికీపీడియా అనే పేరుతో 15 జనవరి 2001లో ప్రారంభించారు.మొత్తంగా 3కోట్లు వ్యాసాలున్నాయి. ఇవి 287 భాషలలో ఉన్నాయి.ఇంగ్లిష్లో 44 లక్షలకంటే ఎక్కువ వ్యాసాలు ఉన్నాయి.

విద్యలో వికీపీడియా[మార్చు]

2009-2012లో New South Wales, board of studies , ఆస్ట్రేలియా వాళ్ళు wikipedia ని బోధన అంశంగా చేర్చారు. దాని వల్ల విద్యార్దులు మరింత చక్కగా విషయాలని అవలోకనం చేసుకోగలిగారని Don Carter అన్నారు.

లాభాలు[మార్చు]

వికీడీయా ఉచితంగా అందుబాటులో ఉంది.ఇది పుస్తకం కాదుకాబట్టి చిరిగిపోదు. అందరి దగ్గర Internet ఉంటూంది. పుస్తకం అయితే చిరిగిపోతుంది. పుస్తకంలో విషయం కోసం అన్ని పేజీలు చదవాలి. వికీపీదియాలో వెతికి సరి అయిన విషయానికి చాలా సులభంగా చేరుకోవచ్చు.బొమ్మలు కూడ వ్యాసంలోనే ఉంటాయి. మూలాలలో ఏదయినా వ్యాసం గురించి మరింత తెలుసుకోవాలంటె ఏమేమి చదవలో ఉంటాయి.

వికీపీడియా విద్యార్దులకు ఎలా ఉపయోగపడుతుంది?[మార్చు]

వికీపీడియా ఒక స్వేచ్చా విజ్ఞాన సర్వస్వము. అందువల్ల విద్యార్దులకు కావలసిన ఏ విషమైన వికీపీడియాలో దొరుకుదుంది. ఒక అంశాన్ని సంబంధించిన బొమ్మలు సంభంధిత వ్యాసాలు మరింత తెలుసుకునేందుకు వనరులు కూడ ఇవ్వబడతాయి. వికీపీడియాలో సమాచారం ఎప్పటికప్పుడు తాజా చేయబడుతుంది. అందువల్ల ఇది ఒక నమ్మదగిన విజ్ఞాన సర్వస్వము. వ్యాస చర్చ పేజీలు చదవటం ద్వారా వ్యాసానికి సంభందించిన వివిధ దృక్కోణాలపై విద్యార్దులకు అవగాహన వస్తుంది. Internet సదుపాయం ఉన్న విద్యలయాలలో వికీపీడియా ఒక మంచి వనరు. Internetలో వెబ్ సైట్ల మద్య విహరించడం విద్యార్దులు వికీపీడియా ద్వారా తెలుసుకోగలరు. స్వేచ్చా ఇంటర్నెట్ స్వేచ్చాహక్కులు Public domain గురించి విద్యార్దులకు మంచి అవగాహన వస్తుంది. వికీపీదియా ద్వార విద్యార్దులకు సమాజంలో సంభాషణలలో పాల్గొనే అవగాహన వస్తుంది. విద్యార్దులు వాళ్ల రచనలను పరిశోధన చేసి, అన్నింటిని ఒక చోట చేర్చి, ప్రచురించి ఇతరుల ద్వారా సమీక్షి చేసే విధంగా అందుబాటులో తెచ్చి అవకాశాన్ని కలిగిస్తుంది.విద్యార్దులు వేసిన బొమ్మలు, తీసిన ఫోటోలు వికీపీడియాలో పెట్టడం ద్వారా ఎలాంటి బొమ్మలో అవసరమైనవో, ఎలాంటి బొమ్మలు అవసరమైన బొమ్మలో తెలుసుకుంటారు. వికీపీడియాలో వ్యాసాలను సవరించడం ద్వారా లేదా మార్పు చేయడం ద్వారా విద్యార్దులు వ్వాకరణపరంగా సరైన భాషగా నేర్చుకుంటారు. అక్షర దోషాలు లేని భాషను రాయగలుగుతారు. వికీపీడియాలో రాయడం ద్వారా విద్యార్దులలో సృజనాత్మకత పెరుగుతుంది.ఏదైనా అంశం గురించి ఎలా రాయాలో తెలుస్తుంది. విద్యార్దులు వారి రోజువారీ చదువు కోసం వికీపీడియాను వాడుకోవడమే కాకుండా ప్రాజెక్టులు, ప్రదర్శనలు, అసైన్మెంట్లు రాసుకునేందుకు వాడుకోవచ్చు. మాతృభాషలో Internetలో రాసేందుకు వికీపీదియా ఒక చక్కని వేదిక మాతృభాషలో రాయడమే కాక మాతృభాషకి సంబంధించిన విషయాలు తెలుసుకోవటంలో ఎంతో దోహదపడుతుంది.సాంకేతిక యుగంలో భాషాసాంకేతికాలు నేర్చుకోవడం చాలా అవసరం.ఇవి మాతృభాషలో నేర్చుకోవడం మరింత అవసరం. వికీపీడియా ద్వారా భాషా సాంకేతికాలు సులువుగా నేర్చుకోవచ్చు. బయట ఎక్కడా ఉచితంగా ఒకే చోట ఇలాంటి సాంకేతికాలు అందుబాటులో ఉండవు. ఈనాడు Internet ద్వారా సమాచారం తీసుకోవటం పరిపాటి అయిపోయింది. పుస్తకాలలో సమాచారం వెతకడం కన్నా Internetలో వెతకడం చాలా సులభం. Internetలో ఏదైనా విషయం గురించి వెతుకుతున్నా మొదటి ఫలితం వికీపీడియాయే అవుతుంది. సమాచారం గమ్యం కూడా వికీపీడియానే తెలుగు వికీపీడియాను నెలకు దాదాపు 23లక్షలమంది చూస్తున్నారు. అంటే దాదాపుగా Internet వాడే తెలుగువారందరూ వికీపీడియానే ఎక్కువగా వాడుతున్నారు. ఆ విధంగా విద్యార్దులకు కూడా సరైన, సమగ్రమైన,తాజాకరమైన, నిర్దుస్టమైన, నిర్దిస్టమైన సమాచారం కోసం ఇంకా భాషా నైపుణ్యం కోసం వికీపీదియాను ఉపయోగించవచ్చు. విద్యార్దులు ప్రపంచపౌరులు అవటానికి వికీపీడియా ఒక పెద్ద సోపానం.