వాడుకరి చర్చ:జొన్న రవిశంకర్
స్వాగతం
[మార్చు]రవిశంకర్ గారూ, వికీపీడియాకు స్వాగతం. చిన్న చిన్న దిద్దుబాట్లతో వికీలో పని మొదలుపెట్టమనే సూచనను పాటించడం మొదలుపెట్టారు. అభినందనలు. హిందూ సంస్కృతి, రీచ్‌స్టాగ్ దహనం - ఈ రెండు పేజీల్లో మీరు ఇచ్చిన లింకుల వలన ఆయా వ్యాసాలు చదివే పాఠకులకు మరింత ప్రయోజనం చేకూరనుంది (లింకులు ఇవ్వడంలో కొన్ని చిన్నపాటి నియమాలున్నాయి. అవి మీకు వీలువెంబడి తెలుస్తాయి లెండి). ఆ పేజీల "చరిత్ర" లింకులో మీరు చేసిన దిద్దుబాట్లు నమోదయ్యాయి, మీరు గమనించారా? మనం చేసే ప్రతీ పనీ ఆయా పేజీల్లో అలా రికార్డౌతుంది. అంతే కాదు, మీరు చేసిన మార్పుచేర్పులన్నీ ఒకేచోట "నా మార్పులు" అనే పేజీలో రికార్డౌతాయి. దీని లింకు పేజీలో పైన కుడి మూలన ఉన్న మీ వ్యక్తిగత లింకుల్లో ఉంటుంది, చూడండి. మరో సంగతి - మనందరం చేసే మార్పుచేర్పులన్నీ "ఇటీవలి మార్పులు" అనే పేజీలో నమోదౌతాయి. నేవిగేషను పట్టీ లోని పరస్పరక్రియ అనే శీర్షిక కింద దీని లింకు ఉంటుంది, చూడండి. తెవికీకి (అంటే తెలుగు వికీపీడియాకి) మీరు కొత్త అని భావించి ఈ సంగతులు రాసాను.
మీకు ఏమైనా సందేహాలుంటే, ఏదైనా సహాయం కావాలంటే మీ గురువుగారిని అడగొచ్చు. లేదా నన్ను అడగదలిస్తే నా చర్చ పేజీలో రాయండి. ఈ వ్యాఖ్య చివర నా సంతకం ఉంటుంది, దానిలో నా చర్చ పేజీ లింకు ఉంటుంది, చూడండి. ~~~~ ఇలా నాలుగు టిల్డె లను వరసగా రాస్తే మన సంతకాన్ని ముద్రిస్తుంది. అన్నట్టు సంతకం చర్చాపేజీల్లోనే పెట్టాలి.
సాధారణంగా కొత్త వాడుకరులు తెవికీలో రాయడం మొదలుపెట్టి ఓ పాతిక ముప్ఫై దిద్దుబాట్ల తరువాత ఎంత అనుభవం సంపాదిస్తారో అంత అనుభవం మీమొదటి దిద్దుబాట్ల లోనే కనబడింది. అభినందనలు__ చదువరి (చర్చ • రచనలు) 10:14, 31 డిసెంబరు 2024 (UTC)