వాడుకరి చర్చ:వైజాసత్య/పాత చర్చ 11/సామెతల జాబితా
స్వరూపం
వైజా సత్యా!
- ముందుగా నువ్వు చేస్తున్న ప్రయోగం బాగానే అనిపించింది. కాని మరో అభిప్రాయం కూడా గమనించవలెను....
- నా అంచనా ఏమంటే సామెతల జాబితా చాలా పేద్దగా పెరిగే ఆస్కారం ఉంది. వేలల్లో. కనుక నువ్వు చేస్తున్న ప్రయోగం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చును (నాకు సరిగ్గా అర్ధమయితే). ఎందుకంటే వివరణ దాచినా గాని పేజీ సైజు బాగా ఎక్కువే అవుతుంది..
- విక్షనరీకి తరలించే విషయం - ఇవి వికీలోనూ, విక్షనరీలోనూ కూడా ఉండవచ్చును. (వికీలో "సంవత్సరం వారీగా తెలుగు సినిమాల జాబితా" మరియు "అక్షర క్రమంలో తెలుగు సినిమాల జాబితా" ఉన్నట్లు.) అర్ధం తెలుసుకోవాలని చూసేవారు విక్షనరీ చూడవచ్చును. ఏమేమి సామెతలున్నాయో చూడదలచినవారు వికీ చూడవచ్చును. ఇందులో ఇంకా చాలా క్రొత్త పేజీలకు అవకాశం ఉందనిపిస్తున్నది. ఉదాహరణకు రహమతుల్లా గారు సాయిబులు వ్యాసంలో "సాయిబుల మీద సామెతలు" వ్రాశారు. ఒకసారి నవీన్ "వ్యవసాయ సామెతలు" గురించి ప్రస్తావించాడు. ఇల్లాలి గురించిన సామెతలు ఒక విభాగం అనుకోవచ్చును. ఇవన్నీ ఒక విశిష్టమైన compilation అవుతుందనుకొంటున్నాను.
- కనుక నేను ముందు ప్రతిపాదించిన విధమే (అక్షరానికో పేజీ వివరణలతో సహా + సబ్జెక్టుకో పేజీ) బెటర్ అనిపిస్తున్నది.
- ఏమయినా త్వరగా ఒక నిర్ణయం తీసుకొంటే మంచిది. ఎందుకంటే మొలకల తగ్గింపులో భాగంగా సామెతల పేజీలు తీసేయాలని నేను భావిస్తున్నాను.
--కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:51, 17 డిసెంబర్ 2008 (UTC)
- నేను ఈ ప్రయోగం మొదలుపెట్టిన తర్వాత దీని సాధ్యాసాధ్యాలపై కొంత నాక్కూడా అనుమానం కలిగింది వివరణలను సామెతలు/అడగందే అమ్మైనా పెట్టడు మొదలైన ఉపపేజీల్లో పెడదామనుకున్నాను. కానీ ఉపపేజీలను కూడా వికీ పేజీలు, మెలకలలాగానే పరిగణిస్తుంది. కాబట్టి మీరు చెప్పిన పద్ధతి ప్రకారమే వెళదాం. ఒక అక్షరానికి చెందిన సామెతలు (వివరణలతో సహా) ఒక పేజీలో చేర్చటం బాటుతో చేయించగలను. ఇక విషయం ప్రకారం అయితే మనమే చెయ్యాలి. సామెతల పేజీలన్నీ విక్షనరీలో చేర్చటం కూడా బాటు చెయ్యగలదు --వైజాసత్య 20:36, 17 డిసెంబర్ 2008 (UTC)
- రెండు రోజులు ఆగు. పునఃపరిశీలించి చెబుతాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 05:56, 18 డిసెంబర్ 2008 (UTC)
వాడుకరి:వైజాసత్య/పాత చర్చ 11/సామెతల జాబితా గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. వాడుకరి:వైజాసత్య/పాత చర్చ 11/సామెతల జాబితా పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.