Jump to content

వాడుకరి చర్చ:C.Chandra Kanth Rao/జిల్లా వ్యాసాలు - పరిశీలన

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

సి. చంద్ర కాంత రావు గారు, నమస్కారము. తప్పకుండా విశ్లేషణ మంచిదే. ఈ సందర్భముగా, పరిశీలన కోణాలు ఏవిధంగా ఉంటాయో కాస్త చూచాయగా వివిధ విషయాలు తెలియజేస్తే వ్యాసములు అభివృద్ధి చేసేవారికి, వ్రాసేవారికి కొంతవరకు దారిచూపి సహకరించినట్లు అవుతుంది. తప్పక సలహాలు ఇవ్వగలరని ఆశిస్తున్నాను. JVRKPRASAD (చర్చ) 01:04, 27 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఇందులో ప్రత్యక్షంగా సలహాలు, సూచనలు ఏమీ ఉండవండి. కేవలం పరిశీలన నివేదిక మాత్రమే ఇవ్వదలుచుకున్నాను. ఇది పరిశీలిస్తే ఇక ముందు వ్యాసాలను రచించడంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో నిర్ణయించుకోవచ్చు. కొన్నేళ్ళ క్రితం వరకు ఇచ్చిన సూచనలన్నీ బుట్టదాఖలు చేయడం బట్టి సూచనలు ఇవ్వడం మానివేశాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:42, 27 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
సి. చంద్ర కాంత రావు గారు, నమస్కారము. కనీసం లింకులు అయినా వీలయితే ఇవ్వగలరా ! గుర్తుకు తెచ్చుకుంటాను. ఒక విధముగా లింకులు ఇవ్వడము ప్రస్తుతము పాతవి ఇవ్వడము కష్టమే మరి !! కొద్దిగా ప్రయత్నించగలరని ఆశిస్తాను. ఈ మధ్య కాలంలో మెచ్చుకోవడాలు మానేసి నొచ్చుకోవాడాలు పెరిగినాయి. ఈ సందర్భముగా కొన్ని వ్యాసములలో మార్పులు చేస్తే నాకు వాడుకరుల నుండి కొన్ని అయినా గండపెండేర బహుమతులు, మెచ్చుకోళ్ళు వస్తాయని ఆశిస్తున్నాను. JVRKPRASAD (చర్చ) 01:46, 28 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
సి. చంద్ర కాంత రావు గారు, ఈ పరిశీలనలోని అంశాలు నేనూ గమనించాను. ఈ జిల్లాల వ్యాసాలన్ని first-pass translation (తొలి విడత అనువాదం) స్థాయిలో ఉన్నాయి. వీటి అనువాదం మెరుగుపరచి, శుద్ధి చేయవలసి ఉన్నది. ఇదే విషయపై కాస్త పరిస్థితులు కుదుటపడితే సభ్యులముందుంచుదామనుకున్నాను. ఎంత చక్కగా అనువదించినా మరో వ్యక్తి పరిశీలించినప్పుడు మరికొంత మెరుగౌతుంది. అందుకే సహచర సమీక్షలు చాలా అవసరం. నేను బాగా అనువదించాను అనుకున్న వ్యాసాన్ని కూడా చదువరి గారు సమీక్షించినప్పుడు బోల్డన్ని దిద్దుబాట్లు జరిగేవి. ఆయన సమీక్షించిన తర్వాత వ్యాసం మరింత మెరుగ్గా తయారయ్యేది. ఇటీవలి నేనూ అలాంటి ప్రయత్నమే చేస్తున్నాను. --వైజాసత్య (చర్చ) 02:47, 28 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
నేను ఈ వ్యాసాలను గమనించి సంవత్సరంపైగా అయింది. తర్వాత అయినా పొరపాట్లు సరిదిద్దుతారనుకున్నాను. ఒక ప్రాజెక్టు పూర్తికానిదే మరో ప్రాజెక్టు, అది పూర్తికానిదే ఇంకోటి, ఇలా చేయడానికి అవరసమేమిటో తెలియదు కాని చేపట్టిన పనులు ప్రయోజనకరంగా తీర్చిదిద్దడం మర్చిపోతున్నారు. పోనీ ఇతర సభ్యులైనా చేస్తారంటే సమిష్టి తత్వానికి ప్రాజెక్టు ప్రారంభంలో గండికొడతారు. అన్ని వ్యాసాలలో ఒక మూస పెట్టి వ్యాసాల ప్రారంభకులుగా ఉంటూ ఇతర సభ్యులను ఆ ప్రాజెక్టు జోలికి రాకుండా ప్రాజెక్టు ఆరంభంలోనే అడ్డుపడతారు. అయినా సరే తెవికీ నాణ్యతను పెంచే కృషిలో భాగంగా సరిచేద్దామనుకున్ననూ ఎవరో చేస్తారులే అని మరింతగా జోరుగా ముందుకెళుతూ నాణ్యతను అస్సలు పట్టించుకులేకపోవడం గత అనుభవమే. చివరకు చూసీ చూసీ ఇక ఈ జిల్లా వ్యాసాలను ఎవరూ పట్టించుకోరు అనే దశలో నివేదిక ఇవ్వదలుచుకున్నాను. మీరు చెప్పినట్లు ఏ వ్యాసం ఒక్క దశలోనే నాణ్యతగా తయారుకాదనే విషయాన్ని ఒప్పుకుంటాను కాని ఈ వ్యాసాల సంగతి మాత్రం మరో రకంగా ఉంది. ఇక్కడ నాణ్యత, అక్షరదోషాలు, వాక్య నిర్మాణాల గురించి కాకుండా ఒక్కో వ్యాసంలో కుప్పలుగా తప్పులున్నాయి (కేవలం 6 వాక్యాల చిన్న వ్యాసంలో 10 తప్పులు చూసిన వ్యాసం కూడా ఉంది). వీటిని సరిదిద్దటం అందరికీ కుదిరేపని కాదు (అనువాదం సమయంలో చేయాల్సి ఉంటుంది). జిల్లాలపై అవగాహన ఉన్న వారు మాత్రమే ఇలాంటి వ్యాసాలపై పనిచేస్తే బాగుంటుంది. భౌగోళిక, చారిత్రక, రాజకీయ, ఆర్థిక తదితర రంగాలలో పట్టు లేనివారు ఇలాంటి వ్యాసాలపై పనిచేస్తే మనమందరం నవ్వులపాలవుతాం. సాంకేతిక పదాలను అర్థం చేసుకోక వ్యాసాలలో ఎలా అనువదించారో కొన్ని ఉదాహరణలు నివేదికలో పొందుపరుస్తాను. రెడ్ కారిడార్‌కు రెడ్‌కార్పెట్‌గా అనువదించడం బోలెడు వ్యాసాలలో ఉంది. ఒక జిల్లాకు చెందిన గణాంకాలను మరో జిల్లాలో వాడారు (ఉదా:కు మధ్యప్రదేశ్ రాష్ట్ర 51 జిల్లాలలో ముంబై పరిసరం జిల్లా ఒకటి అని వ్యాసం ప్రారంభమౌతుంది. ముంబై పరిసరం జిల్లా). ఒక రాష్ట్రంలో ఎన్ని జిల్లాలున్నాయో తెలుపడానికి ఒక్కో జిల్లాలో ఒక్కో సంఖ్య ఇవ్వబడింది. అనువాదం కష్టమైనచోట్ల చాలా భాగం మింగేయబడింది. చాలా జిల్లాలలో అనవసర సమాచారం ఉంది. జిల్లా వ్యాసాలలో గ్రామాల పేర్లు కూడా అవసరమా? ఎవరో ఆ జిల్లావారు అక్కడి అవరసరాల దృష్ట్యా రచిస్తే మనం తెలుగు వారి దృష్టికోణం నుంచి రాయాల్సింది పోయి మక్కికి మక్కి అనువాదం చేయడం వల్ల ప్రయోజనం ఉండదు (అది కూడా గూగుల్ అనువాదమే). బాగా పరిశీలిస్తే చాలా జిల్లాల వైశాల్యాలు ఆ రాష్ట్రాల వైశాల్యాలకు మించియున్నాయి! కొన్ని జిల్లాలైతే దేశంలో మూడో వంతును మించిపోయాయి! 90° ఉత్తర అక్షాంశాలకు పైగా మన జిల్లాలున్నాయి! పశ్చిమ రేఖాంశంలో కూడా అంటే పశ్చిమార్థగోళంలోకి కూడా మన జిల్లాలు వెళ్ళాయి! అసలు ఏ మాత్రం అనువదించని వ్యాసాలు అలాగే ఉంచాలా? పాక్షిక అనువాదాల సంగతేంటి? ఇలాంటి మరిన్ని విషయాలు నివేదికలో ఆధారాలతో సహా వివరిస్తాను. చివరగా, అన్ని జిల్లాలలో ఖచ్చితంగా తప్పు ఉన్న సమాచారం కూడా ఒకటుంది, అదేమిటో ఎవరైనా గమనించారా? సి. చంద్ర కాంత రావు- చర్చ 14:19, 28 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
సి. చంద్ర కాంత రావు గారు, భారత దేశము పటము. అందులో జమ్ము మరియు కాశ్మీర్ పూర్తిగా లేదు. JVRKPRASAD (చర్చ) 14:44, 28 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
నేను ఈ విషయంపై కొన్ని సంవత్సరాల క్రితమే చర్చలలో తెలిపాను కాని ఎవరూ పట్టించుకోలేరు. కొందరు కొత్త సభ్య్యులు కూడా అప్పౌడప్పుడు దేశ భౌగోళిక పటంలో తప్పులున్నాయనే సంగతిని తెలుపుతున్నారు. ఇప్పుడైనా మనం ఈ విషయంపై దృష్టిసారించాలి. భారతప్రభుత్వ ఆమోదిత పటాలను మనం వాడేలా జాగ్రత్తపడాలి. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:50, 28 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]