వాడుకరి చర్చ:C.Chandra Kanth Rao/పాత చర్చ 3

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Archive ఇది ఇంతకు ముందు జరిగిన చర్చలను భద్రపరిచిన పేజి. ఈ పేజిని మార్చ వద్దు. మీరు గనక కొత్త చర్చ మెదలు పెట్టాలనుకుంటే, లేదా పాత చర్చ కొనసాగించాలనుకుంటే, ప్రస్తుత చర్చా పేజిలో వ్రాయండి.

చంద్రకాంత్ గారు! కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం చాలా బాగా తయారు చేస్తున్నారు. ఇంకా ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఏమేమీ చేర్చగలమో అన్నీ చేర్చి ఈ వ్యాసాన్ని మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల వ్యాసాలకు ఒక రెఫెరెన్స్‌గా తయారుచేయండి. నేను ఈ రాజకీయాల్లో చాలా వీక్. మంచి మంచి విషయాలు తెలియజేస్తున్నారు. ఈ వ్యాసంలో ఉన్న కొన్ని ఎరుపు రంగు లింకులు ఉదాహరణకు శాసనసభ సభ్యులు, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు, 2004 మరియు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ పార్టీలు వంటి వ్యాసాలను కూడా మీరు ప్రారంభిస్తారని అనుకుంటున్నాను. పేర్లు బాగోకపోతే మార్చండి. ఎలక్షన్లకు చాలా ముందరే ఈ వ్యాసాలన్నీ తయారయ్యేటట్టుగా అనిపిస్తుంది. మిగతా సభ్యులు కూడా చాలా ఉత్సాహంగా కృషి చేస్తున్నారు. δευ దేవా 18:45, 9 జూలై 2008 (UTC)

చంద్రబాబునాయుడూ గారు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా చేయాలని ప్రయత్నించారు. మనం ఈ నియోజకవర్గపు వ్యాసాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గపు వ్యాసంగా తీర్చడానికి ప్రయత్నిద్దాం. ఈ వ్యాసాన్ని చూసి మిగితా నియోజకవర్గపు వ్యాసాలలో ఏయే విభాగాలు చేర్చాలి, ఎలాంటి విషయాలు పొందుపర్చాలి అని నిర్థారించవచ్చు. నా ఐడియా ప్రకారము ఇంకనూ చాలా విభాగాలు చేర్చాల్సి ఉంది కాని సమాచారం లభ్యం కావడం లేదు. ఉదాహరణకు నియోజకవర్గపు సమస్యలు, నియోజకవర్గంలో రాజకీయంగా ప్రభావితం చేసే అంశాలు, స్థానిక నాయకుల వివరాలు, ఓట్లర్ల గణాంకాలు, పోలింగ్ స్టేషన్ల సంఖ్య, నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన ముఖ్యమైన రాజకీయ పరిణామాలు మొగలగునవి. అన్నట్టు మీరు కూడా నియోజకవర్గాల వ్యాసాలకు సాంకేతికంగా చాలా దోహదపడుతునారు. మీరన్నట్లు నియోజకవర్గాల వ్యాసాలలోని ఎర్రలింకులకు పేజీలు సృష్టించడానికి ప్రయత్నిస్తాను.-- C.Chandra Kanth Rao(చర్చ) 18:58, 9 జూలై 2008 (UTC)

శాసనసభ, అసెంబ్లీ

చంద్రకాంత్! మీరు "శాసనసభ" పేరునుండి "అసెంబ్లీ" పేరుకు తరలిస్తున్నారు. ఆహమ్మద్ నిస్సార్ గారు రివర్సులో తరలిస్తున్నారు. చర్చించి, ఏదో ఒకటి పద్ధతి అనుసరించండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:01, 29 జూలై 2008 (UTC)

కాసుబాబు గారు, నేను ఇది వరకే పలు మార్లు ఈ విషయంపై చర్చా పేజీల్లో నా అభిప్రాయం తెలియజేశాను. తెలుగు, ఆంగ్ల పదాలు అని కాకుండా వాడుక పేర్లనే వ్యాసపు టైటిల్ పేజీగా ఉండాలి. దారిమార్పు పేర్లు అవసరమైతే పెట్టుకోవచ్చు. కాని ఇటీవల నేను సృష్టించిన అనేక పేజీల వ్యాసాలను కొందరు సభ్యులు అనవసరంగా కొత్తపేర్లకు తరలించి గత కొన్ని రోజులుగా నన్ను నిరుత్సాహపరుస్తున్నారు. అందుకే ఇటీవల రోజుల్లో నేను తెవికీలో చురుగ్గా ఉండలేకపోతున్నాను. అంతేకాకుండా మరింత సరైన పేరు అని క్యాప్సన్ ఇవ్వడం ఎంతవరకు సముచితం. నేను పెట్టినది సరైన పేరు కాదా? అసెంబ్లీ అనేది తెలుగులో వాడరాని నిషిద్ధ పదమా? మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ లాంటి జిల్లాల పరిస్థితి నాకు పూర్తిగా తెలుగు. దాని ప్రకారమే ఈ జిల్లాల నియోజకవర్గాలకు అసెంబ్లీ అని పేరు ఇచ్చాను. తెలుగులో అన్నీ అచ్చ తెలుగులో పదాలుంటే కొన్ని పదాలు ఎవరికీ అర్థం కాకపోవచ్చు. కాని ఈ సమస్యను అర్థం చేసుకొనేవారెవరు! అంతేకాకుండా ప్రస్తుతం తెవికీలో సరైన పేర్లకు తరలించడానికి అనేక వ్యాసాలున్నాయి, కాని పనికట్టుకొని నేను సృష్టించిన వ్యాసాలకే పేర్లు తరలించడం ఎందుకో? కొద్ది రోజుల క్రితం వదోదర వ్యాసాన్ని వడోదరకు తరలించడం జరిగింది. కాని ఈ పట్టణపు వాడుక పేరు కూడా వదోదర అనే ఉంటుంది. తెలుగు వార్తాపత్రికలో కూడా (ఈ రోజు ఈనాడు పత్రిక కూడా చూడండి) ఇలాగే వ్యవహరిస్తారు. ఈ పట్టణం గురించి నాకు పూర్తిగా తెలుసు. కనీసం నా అభిప్రాయం కూడా తీసుకోకుండా చర్చ ప్రారంభమైన ఒక్క రోజులోనే పేరు తరలించబడింది. వ్యాసం సృష్టించి ఏడు మాసాలైననూ ఇంతకు క్రితం ఎవరూ అభ్యంతరపర్చలేదు! -- C.Chandra Kanth Rao(చర్చ) 20:36, 29 జూలై 2008 (UTC)
చంద్రకాంత్ గారూ! నేనేమైనా నొప్పించి ఉంటే క్షమించండి. మీరిలా బాధపడవద్దు. నేను నా అభిప్రాయం మాత్రమే తెలిపాను. ఉన్న కొద్దిమందిలో ఇలా అభిప్రాయ భేదాలు కలుగుతున్నాయనే నేను ఇంతకుముందు కొన్ని రోజులు పని చేయలేదు. ఊరి పేర్లు వాడుక పేర్ల కంటే సరైన పేర్లు ఉంటేనే బాగుంటుందని నాకనిపించింది. ఉదాహరణకు బెంగలూరు ఇంకా బెంగుళూరు అని, ముంబయ్ బొంబాయి అని వాడుకలో ఉండవచ్చు. కానీ ఊరి పేర్లలో సరైన నామం ఉంటే బాగుంటుంది కదా అని చర్చా పేజీలో రాసాను. కానీ తరలించలేదు. అసెంబ్లీ మరియు శాసనసభలో అసెంబ్లీకే నా ఓటు. ఎవరైనా అనుభవజ్ఞులైన సభ్యులు కలగజేసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని అభ్యర్దిస్తున్నాను. δευ దేవా 08:08, 30 జూలై 2008 (UTC)
దేవా గారు! నా సమస్య మీ గురించి కానేకాదు. క్షమాపణలు కోరడం మరీ వద్దు. వదోదర వ్యాసం పేరు మార్పుకై చర్చ తీసినందుకు నేనలా భావించారని మీరు అనుకున్నారేమో. తప్పులను చర్చా పేజీలలో వ్రాయడం నేను మెచ్చుకుంటాను. నేను రచించిన వ్యాసాలను మరెవరూ దిద్దరాదని, తరలించరాదని నేను అనుకోవడం లేదు. నేను చెప్పేదల్లా అది ఏకపక్షంగా కాకుడదనేదే. మీరు నియోజకవర్గాల మూసలు తయారుచేస్తే అందులో అసెంబ్లీ నియోజకవర్గం అనే పేర్లతోనే నేను వ్యాసాలు సృష్టించి శాసనసభ నియోజకవర్గంకు దారి మార్పులు ఇచ్చాను. కాని అంతకు క్రితం నేను సృష్టించిన వ్యాసాలు మాత్రం అసెంబ్లీ నియోజకవర్గం పేర్లతో ఉన్నాయి. దానికి శాసనసభ నియోజకవర్గం పేర్లకు దారిమార్పు ఇచ్చేస్తే సరిపోయేది కాని పేజీలనే తరలించడం నాకు నచ్చలేదు. 3,4 జిల్లాల వ్యాసాలకే నేనలా అసెంబ్లీ పేర్లతో వ్యాసాలు సృష్టించాను. అంతేకాకుండా కాసుబాబు గారు అనుకుంటున్నట్లు ఇతర సభ్యుల దారిమార్పులపై నేను దాడి చేయడంలేదు. రంగారెడ్డి జిల్లాకు చెందిన కేవలం రెండేరెండు (తాండూర్ మరియు వికారాబాదు) వ్యాసాల పేర్లను రివర్సు చేశాను. -- C.Chandra Kanth Rao(చర్చ) 20:33, 30 జూలై 2008 (UTC)
చంద్రకాంత్ గారూ! మీరు మామూలుగా వికీలో మార్పులు చేయండి. ఇదంతా అనుకోకుండా జరిగి ఉంటుందని నేననుకుంటున్నాను. కాసుబాబు గారన్నట్లు చర్చ ప్రారంభించి నియోజకవర్గాల పేర్ల విషయంలో నిర్ణయం తీసుకుందాం. కాసుబాబు గారు సభ్యులిరువురి చర్చా పేజీల్లో ఈ విషయం రాసి ఉండాల్సిందేమో! (నాకనిపించింది రాసాను, దయచేసి ఎవరూ అపార్థం చేసుకోవద్దు). ఇలాంటి విషయాల్లోనే కదా నిర్వాహకుల జోక్యం అవసరమయ్యేది (సభ్యులకు సర్దిచెప్పడానికి!). ఉన్న నిర్వాహకుల్లో చాలా మంది ఇనాక్టివ్‌గా ఉన్నారు. నిర్వాహకుడి బాధ్యతలు తీసుకుందామనుకున్న సాయికి చుక్కెదురైంది. δευ దేవా 22:29, 30 జూలై 2008 (UTC)
షుమారుగా రెండు సమమైన అభిప్రాయాలున్నపుడు ఇలాంటి సమస్యలు తప్పవు. నేను గమనించిన విషయం గనుక వ్రాశాను. దీనిని అంత సీరియస్‌గా తీసుకోవద్దు. త్వరలో చర్చకు పెట్టి ఒక నిర్ణయానికి వద్దాము. "సరైన పేరు" అంటే వారి అభిప్రాయంలో మెరుగైన విధానం అనే అనుకోండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 11:51, 30 జూలై 2008 (UTC)
మిత్రులారా, కంగారుపడకండి, అసెంబ్లీ అన్నా శాసనసభ అన్న ఫర్వాలేదు కానీ ఏదో ఒక పద్ధతిని పాటించండి చాలు. భవిష్యత్తులో అలా కాదు రెండవ విధం అంటే ఒక చిన్న బాటు స్క్రిప్టుతో దారిమార్పులు కానీ, పూర్తి మార్పులు కానీ సులభంగా చేయవచ్చు. చంద్రకాంతరావు గారూ, వికీపద్ధతులు మీకు తెలియనివి కావు. ఇక అసెంబ్లీ, శాసనసభల్లో ఈ మధ్య వాడుకలో అసెంబ్లీ అని ప్రచారమాధ్యమాలలో కూడా ఉన్నా, శాసనసభ అన్నపదమే విజ్ఞానసర్వస్వమైన వికీలో బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇవాల తెలుగు వాడుక భాషలో తెలుగే కొరతబడింది. నాకు గుర్తున్నంతవరకు దూరదర్శన్ వార్తల్లో రెండు పదాలు విరివిగానే ఉపయోగించేవారు. అందుకనే వ్యక్తిగతంగా శాసనసభ వైపు నేను మొగ్గుచూపినా అది నా వ్యక్తిగత అభిప్రాయమేనని మళ్ళీ మనవి చేసుకుంటున్నాను. సభ్యులు ఎటు నిర్ణయించినా ఒకటే. --వైజాసత్య 03:26, 31 జూలై 2008 (UTC)
ఈ సందర్భంగా వికీ చరిత్రనుండి ఒక ఘట్టం చెప్పాలి :-) ఊర్ల పేర్లను, మండలాల పేర్లను అనువదించటం ప్రారంభించినప్పుడు ఒకే పేరుతో రెండు, మూడు గ్రామాలు కానీ మండలాలు కానీ తటస్థపడితే ఏంచెయ్యాలో అర్ధం కాలేదు. అచ్చులో అలాంటి వాటి గురించి ఏదైన చేసిన తార్కాణాలు లేవు. చదువరి గారు కొండాపురం (నెల్లూరు) శైలిలో వాటిని వ్రాయటం ప్రారంభించారు. నేను అమెరికా పద్ధతి పరిచయమున్నవాడిగా కొండాపురం, కడప శైలిలో వ్రాయటం ప్రారంభించా..అలా ఎవరి శైలిలో వారము చాలా వ్యాసాలు సృష్టించాకా కొందరు కొత్త సభ్యులు కూడా చదువరి గారి పద్ధతి అనుసరించటం చూసి ఆ తరువాత నేను ఆ పద్ధతికే మారిపోకతప్పలేదు. ఆ తరువాత కాలంలో కొండాపురం, కడప శైలిలో ఉన్న వ్యాసాలన్నింటినీ తరలించాననుకోండి. అక్కడక్కడా ఇప్పటికీ ఆ శైలిలో ఏదైనా గ్రామం పేరు తటస్థపడితే (కైకలూరు, కృష్ణా) అది నా చలవే ;-) అందరం కలిసి తెలుగులో ఒక గొప్ప విజ్ఞానసర్వస్వము తయారుచేసే మహోన్నత కార్యక్రమంలో మనవంతు కృషి చేస్తున్నామని మరవవద్దు.--వైజాసత్య 03:54, 31 జూలై 2008 (UTC)

చంద్రకాంతరావు గారూ నమస్తే, మీ చర్చాపేజీ (ఈ పేజీ) ఇప్పుడే చూసాను. చాలా కంగారుపడుతూ వ్రాస్తున్నాను. చిత్తూరు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల గురించి వ్రాసేటపుడు నేను అసెంబ్లీ నియోజకవర్గం అని వ్రాయడం మొదలు పెట్టాను. తరువాత సభ్యులు 'శాసనసభ' అంటూ వ్రాస్తున్నపుడు, నేను కూడా శాసనసభ అంటూ వ్రాస్తూ పోతున్నాను. మీరు ఈ విషయం గురించి బాధపడుతూవుంటే, నేను చాలా మధనపడుతూ వ్రాస్తున్నాను. సత్యమేమంటే, తెవికీలో వ్యాసాల తరలింపులు వగైరాల గూర్చి నాకు అవగాహన తక్కువ. బహుశా దీనివలనే ఈ స్థితి వచ్చిందనుకుంటాను. మీరు నిస్సందేహంగా, నాచర్చా పేజీలో నాకు గైడ్ లైన్స్ వ్రాయండి, నేను దాన్ని అర్థం చేసుకుంటూ వ్రాస్తూ పోతాను. మీకు నొప్పించాలని నాకు ఆలోచనలో సైతం భావన లేదు. నేను అమితంగా అభిమానించే మరియు గౌరవించేవారిలో మీరూ ఒకరు. మీరు ఇలా మధనపడుతూవుంటే నేను చాలా బాధపడుతున్నాను. నేను గ్రహించినది ఏమంటే మీరు ఒక 'వికీ ఋషి' మరియు 'వికీ తపస్వి', మీరు ఏకొంచెం ఢీలా పడినా తెవికీ కి, తీరని నష్టం కలుగుతుంది. దీనిని నేనేకాదు, ఎవరూ కోరుకోరు. మీరు అర్థం చేసుకోగలరని భావిస్తున్నాను.

  • ఈ గందరగోళానికి తెరదించాలంటే ఒకే ఒక నివారణోపాయం: రాజకీయశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, క్రీడలు (మరియు మీకిష్టమైనవి) మొదలగు విషయాలకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ గా మీరే వ్యవహరించండి. వీటిపై పర్యవేక్షణ మరియు సూత్రీకరణ బాధ్యతలు మీరే చేపట్టండి, అవి ఇతరులకు మార్గదర్శకాలుగా ప్రామాణికతను కలిగివుంటాయి. ఆతురతతో మిత్రుడు. నిసార్ అహ్మద్ 13:09, 30 జూలై 2008 (UTC)
నిసార్ గారు, మీ అభిమానానికి కృతజ్ఞతలు. మీకు తెలియక పేజీలు తరలించినారని చెబుతున్నారు కాని ఒకటి కాదు రెండు కాదు పెద్ద సంఖ్యలో పేజీలను ఎలాంటి కారణం లేకుండా తరలించారు. కనీసం చర్చా పేజీలో వ్రాయవలసింది. నాలుగు మాసాల క్రితమే ఇదే విషయంపై చర్చ జరిగింది. ముగ్గురు మూడు రకాలు అభిప్రాయాలు వెలిబుచ్చడంతో ఎటూ నిర్ణయం కాలేదు కాబట్టి నేను అసెంబ్లీ అనే వాడటం కొనసాగించాను. ఇది కూడా కొన్ని జిల్లాలకే పరిమితం చేశాను. ఇతర జిల్లాకు చెందిన నియోజకవర్గాలకు శాసనసభ అనే టైటిల్ పెట్టి అసెంబ్లీ దారిమార్పులు ఇచ్చాను. మీరు పేజీలను తరలించడం కాకుండా దారిమార్పు ఇచ్చేస్తే సరిపోయేది. మీరు సృష్టించిన ఆంధ్రప్రదేశ్‌లోని లోకసభ నియోజకవర్గాలు వ్యాసంపై చర్చ సంగతి మీకు గుర్తుండే ఉంటుంది, వ్యాసం పేరుపై సందేహం వచ్చిననూ దాన్ని ఏకపక్షంగా ఎవరూ తరలించలేరు, అంతేకాకుండా చర్చలో మీ అభిప్రాయం వెలిబుచ్చిన పిదపే దాన్ని నేను కొత్త పేరుకు తరలించాను. ఎవరో కొత్త సభ్యులు సృష్టించిన పనికి రాని వ్యాసాలు తొలిగించినా ఎవరూ అభ్యంతరపర్చరు పైగా అది నిర్వహణలో భాగం. ఉన్న కొద్ది చురుకైన సభ్యుల వ్యాసాలలో ఉన్న వాటికి భిన్నంగా పెద్ద మార్పులు, చేర్పులు చేయాల్సినప్పుడు, పేర్లు తరలించేటప్పుడు మాత్రం కొద్దిగా ఆలోచించాలి, వారి అభిప్రాయం కూడా తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆషామాషీగా పేర్లు పెట్టడం, వ్యాసాలు వ్రాయడం మనం చేయం. అలా అనిపించిననూ దానికీ కారణముంటుంది. కొన్ని మాసాల క్రితం నిర్వహణలో భాగంగా వ్యాసాలలోని ఆంగ్ల భాగాలు తొలిగించేటప్పుడు మీకు ముందే తెలియజేశాను. మీరు వాటిని అనువదించి పూర్తిచేశారు. అంతేకాని నేను ఏకపక్షంగా మీకు చెప్పాపెట్టకుండా ఆ భాగాలను తుడిచివేయలేను. మీరు వ్రాసిన కొన్ని వ్యాసాలలో తప్పులుంటే నేను చర్చా పేజీలలోనే తెలియజేశాను కాని వ్యాసం జోలికి పోలేను. అలా వ్యాసంలో దూరి నేను కనుక మార్పులు చేయడం ప్రారంభిస్తే వ్యాసం స్వరూపమే మారిపోతుంది. అప్పుడు మీకూ భాధకల్గవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఇక మీరు మీ పని కానిచ్చేయండి, తెవికీ వృద్ధికి తోడ్పడండి. మీ లాగే నాది కూడా తెలుగు మాతృభాష కాదు. అయినా తెలుగు భాషపై ఉన్న మమకారంతో, అభిమానంతో, తెలుగు ప్రజలకు నా వంతు తోడ్పడాలనే ఉత్సుకతలో ఇక్కడ పనిచేస్తున్నాను. -- C.Chandra Kanth Rao(చర్చ) 21:34, 31 జూలై 2008 (UTC)

మాతృభాష

చంద్రకాంతరావు గారూ, మీ భావనలు సమంజసమైనవి, అర్థం చేసుకున్నాను. మీ సుదీర్ఘ జవాబుతో నా మనస్సు కొంచెం కుదుటపడింది. నా మాతృభాష 'ఉర్దూ', మీ మాతృభాష తెలుసుకోవచ్చా?. (నాకు మీ మాతృభాష 'మరాఠీ' అని తోచుచున్నది) నిసార్ అహ్మద్ 18:43, 1 ఆగష్టు 2008 (UTC)

ఏమీ అనుకోకండి, నా వ్యక్తిగత విషయాలు చెప్పదలుకోలేను. సమయం వచ్చినప్పుడు నేనే వెల్లడిస్తా. -- C.Chandra Kanth Rao(చర్చ) 18:21, 2 ఆగష్టు 2008 (UTC)

గ్రామాల వ్యాసాలలో జనాభా వివరాలు

చంద్రకాంతరావుగారూ మీరు గ్రామాల వ్యాసాలలో జనాభా వివరాలు చేర్చుతున్నట్టు చూశాను. ఈ పనిని బాటుద్వారా సులభంగా చేయవచ్చును. అలా చెయ్యలన్న ఆలోచనకూడా ఉన్నది. కనుక మీరు ఈ పనిపై సమయం వృధా చేసుకోవద్దని మనవి. అయితే ఇలా పెద్ద ఎత్తున గణాంకాల వివరాలు/సమాచారపెట్టె మరియు గణాంకాలను వివరిస్తూ ఒక చిన్న పేరా చేర్చేముందు అన్ని గ్రామాల పేర్లు సరిగా ఉన్నయో లేదో, అన్ని గ్రామాలకు గ్రామల మూస ఉన్నవో లేదో మరియు గ్రామాల పేజీలకు మరియు ఆయా మండలాల పేజీలలోని గ్రామాల జాబితాను క్రాస్్‌చెక్ మొదలైన కొన్ని మనమే చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. అవి అయిన వెంటనే పైన నేను చెప్పిన వివరాలన్నీ చేర్చవచ్చు --వైజాసత్య 19:30, 24 ఆగష్టు 2008 (UTC)

సరే అలాగే చేయండి పని సులభమౌతుంది. ఇక గ్రామాల పేర్ల విషయానికి వస్తే చిన్న చిన్న తప్పులు ఉన్నాయి. నాకు రంగారెడ్డి మరియు మహబూబ్ నగర్ జిల్లా గ్రామాల పేర్లు దాదాపు అన్నీ తెలుసు. ఈ విషయంలో నేను సహకరిస్తాను. మూసలు కూడా కొన్ని గ్రామాలకు కలువలేవు, మరికొన్ని గ్రామాలకు రెండు కంటే అధికంగా వచ్చిచేరాయి. ఇంతకు క్రితమే మీరు గ్రామ వ్యాసాలలో మూసలు చేర్చిన తరువాత నేను కొన్ని సరిదిద్దాను. మిగిలిన వాటిని కూడా సరిచేయాల్సి ఉంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 19:55, 24 ఆగష్టు 2008 (UTC)

కుంటాల

రాజశేఖర్ గారూ! కుంటాల జలపాతం సరైన పేరని దారిమార్పు చేసాను. కానీ మీరు ఇంతకు ముందు కుంటాలను, కుంతలకు తరలించడం చూసుకోలేదు. నాకు గుర్తుకు ఉన్నంతవరకు కుంటాల పేరే సరైనది. ఒకవేళ కుంతల సరైనదని మీకు తెలిస్తే నేను చేసిన మార్పు రద్దు చేయండి. δευ దేవా 10:30, 31 ఆగష్టు 2008 (UTC)

నేను ఈ వ్యాసం ప్రారంభించేటప్పుడు కుంతల పేరే ఇచ్చాను. రికార్డుల ప్రకారము కుంటాల, కుంతల రెండూ వాడుతున్ననూ స్థానికులు మాత్రం కుంతలగానే వ్యవహరిస్తారు. ఎందుకంటే శకుంతల పేరు మీదుగా ఈ పేరు వచ్చినదని ఇక్కడి వారి విశ్వాసం. -- C.Chandra Kanth Rao(చర్చ) 10:56, 31 ఆగష్టు 2008 (UTC)
ధన్యవాదాలు చంద్రకాంత్ గారూ! నా మార్పును రద్దు చేయండి. δευ దేవా 11:06, 31 ఆగష్టు 2008 (UTC)
దేవా గారు! రెండూ సరైనవే కాబట్టి మార్పు అవసరం లేదనుకుంటా, అలాగే ఉండనీయండి. నా అభిప్రాయం మాత్రమే తెలియజేశాను. కుంతల పేరుతో నేను వ్యాసం ప్రారంభించిన రోజే (9 నవంబర్, 2007) వైజాసత్య గారు కుంటాలకు తరలించారు. ఇటీవల (17 ఏప్రిల్, 2008) రాజశేఖర్ గారు మళ్ళీ కుంతలకు తరలించారు. తాజాగా ఈ రోజు మీరు కుంటాలకు తరలించారు. పేర్ల విషయంలో అస్పష్టత కారణంగానే ఇలాంటి సమస్య తలెత్తుతుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న పేరునే కొనసాగిద్దాం. -- C.Chandra Kanth Rao(చర్చ) 11:21, 31 ఆగష్టు 2008 (UTC)
అవునండి. వదిలేద్దాం. ఇకనుండి చరితం, చర్చా పేజీలు చూసాకే ఏదైనా తరలింపు చేస్తాను. δευ దేవా 11:34, 31 ఆగష్టు 2008 (UTC)

ధన్యవాదాలు

చంద్రకాంత్ గారూ! మీ అభిమానానికి ధన్యవాదాలు. రాజకీయాల వేదికను ప్రారంభించవచ్చు, మంచి ఉపాయం. కొన్ని రోజులాగి ప్రారంభిద్దాం. ఇంక మొదటి పేజీలో వేదికల లింకులైతే మీరే ఆలోచించాలి. నేను ఆ పేజీ మర్చలేను. నిర్వాహకులు మాత్రమే మార్చగలరనుకుంటాను. వేదిక లింకులు మీరన్నట్టు అమర్చుతాను. δευ దేవా 18:10, 15 సెప్టెంబర్ 2008 (UTC)

వేదిక లింకులు అమర్చండి. మొదటి పేజీలో వేదిక లింకులకు ఎక్కడ (పై భాగంలోనా, క్రిందివైపునా లేదా ఎడమ భాగాన) అమర్చాలి అనే విషయంలో ఇతర సభ్యుల సలహాలను కూడా తీసుకుందాం. ---- C.Chandra Kanth Rao(చర్చ) 18:22, 15 సెప్టెంబర్ 2008 (UTC)
సరే అలాగే చేస్తాను. ఒక సహాయం చేయగలరా? Image:Test drawing.svg చూసి అందులో మీకు తెలుగు అక్షరాలు కనబడుతున్నాయో లేదో చెప్పగలరా? δευ దేవా 22:01, 15 సెప్టెంబర్ 2008 (UTC)
Image:Test drawing.svgలో నాకైతే తెలుగు అక్షరాలేమీ కనిపించడం లేదు. ఒక నల్లటి బాక్సు దానిపైన Charset=utf-8 అనే ఆంగ్ల అక్షరాలు మాత్రమే కనిపిస్తున్నాయి. -- C.Chandra Kanth Rao(చర్చ) 22:11, 15 సెప్టెంబర్ 2008 (UTC)
Image:Test drawing.svg ఇప్పుడు చూడండి. δευ దేవా 22:30, 15 సెప్టెంబర్ 2008 (UTC)
దీనికి సంభందించే అప్పుడెప్పుడో ఒక బగ్గు ఫైలు చేశాం వేరే అన్ని భాషలకు వికీమీడియాలో SVG-PNG conversionకి ఫాంటులను ఏర్పాటు చేసారు. తెలుగుకు ఇంకా చేయలేదు! ఆ బగ్గు వివరాలున్న లింకు: https://bugzilla.wikimedia.org/show_bug.cgi?id=8898 . అలాగే ఇదే విషయానికి సంభందించి ఇంతకుముందు జరిగిన ఒక సంభాషణఉ చూడండి: వికీపీడియా:రచ్చబండ_(సాంకేతికము)#SVG ఫైళ్లలలో తెలుగు టెక్స్ట్ . ప్రస్తుతానికి SVG ఫైల్లలో తెలుగు ఫాంటు ఉపయోగించి రాస్తున్న అక్షరాలను "ఆబ్జెక్ట్లు"గా మార్చుకుని ఎక్కిస్తే ఎటువంటి సమస్యా ఉండదు. ఉదాహరణకు: దేవా ఎక్కించిన ఈ బొమ్మలో రెండు తెలుగు వాక్యాలు ఉంటే ఒకటే కనపడుతుంది, రెండోది అసలు కనపడటంలేదు, అలా కనపడకపోవడం వికీమీడియా సాఫ్టువేరులో SVG-PNG conversion అప్పుడు సరైన ఫాంటు దొరకకపోవడమే కారణం. __మాకినేని ప్రదీపు (+/-మా) 03:04, 16 సెప్టెంబర్ 2008 (UTC)