వాడుకరి చర్చ:Chaduvari/ఇంటర్నెట్లో తెలుగు వ్యాప్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రచారపత్రము

[మార్చు]

చదువరి గారూ,

నమస్కారములు. ఈవ్యాసములోని కొన్ని విషయాలనూ, మరికొన్నిటిని కలిపి - తెలుగు వికీలో పాలు పంచుకోమని ఆహ్వానిస్తూ ఒక ప్రచార లేఖ (Campaign Letter mail) తయారు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయము. ముఖ్యముగా విద్యార్ధి లోకాన్ని ఈ ప్రయత్నములో భాగస్వాములు చేయడానికి ఇది ఉపయోగపడుతుందనుకొంటాను. మీ సలహా ఏమిటి? ఒకవేళ ఇదివరకే ఇటువంటి ప్రయత్నము ఏదైనా జరిగి ఉంటే తెలియజేయ గలరు. కాసుబాబు 19:51, 11 ఆగష్టు 2006 (UTC)

అసలీ వ్యాసం ఉద్దేశ్యం కూడా అదేనండి. నెట్లో తెలుగు, వికీ, బ్లాగులు మొదలైన వాటి గురించి తెలుగువారికి తెలియజేసే ఆలోచనతోటే ఈ వ్యాసానికి శ్రీకారం చుట్టాం. అయితే వ్యాసం తయారయింది గానీ, దానికి తుది మెరుగులు దిద్ది, మీరన్నట్లుగా ప్రజల్లోకి పంపడమే మిగిలిఉంది. ప్రజల్లోకి దీన్ని ఎలా తీసుకెళ్ళాలనే విషయమై ఇదివరలో ఇలా అనుకున్నాం.. పత్రికల్లో ఈ వ్యాసాన్ని ప్రచురించేలా చెయ్యడం, నెట్లూ తెలుగువారు చేరే సైట్లలో పెట్టడం ఇలాంటివి. సుధాకర్ గారూ! మీరన్న ఈ ప్రచారం వెంటనే మొదలు కావాలండి. మనమంతా దీనికి పూనుకోవాలి. ఎలా వ్యాప్తి చెయ్యాలనే విషయమై మీ సూచనలను రాయండి. మీరు తెలుగుబ్లాగు గుంపులో సభ్యులయే ఉంటారు కదా! అక్కడ మీ సూచనలను రాయండి. ఈ పని వీలయినంత త్వరగా మొదలెట్టాలి. __చదువరి (చర్చ, రచనలు) 15:56, 12 ఆగష్టు 2006 (UTC)