వాడుకరి చర్చ:Janardhan

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Janardhan గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!
  • వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. సభ్యుల పట్టికకు మీ పేరు జత చేయండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.
  • మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న లింకులను అనుసరించండి, అవికూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి గూగుల్ గుంపులలో ఈ వ్యాసాన్ని చదవండి.
  • నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.

కాసుబాబు 12:51, 30 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కొన్ని ఉపయోగకరమైన లింకులు
వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాలు
తరచూ అడిగే ప్రశ్నలు
సహాయము లేదా శైలి మాన్యువల్
ప్రయోగశాల
సహాయ కేంద్రం
రచ్చబండ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు

సాహితీ చర్చ గురించి

[మార్చు]

కె.ఎస్.బాబు గారూ నా పేరు జనార్ధన్ నేను మీకు పంపించిన ఇ.మైల్ కు రిప్లై ఇచ్చినందుకు చాలా సంతోషం.

నా సభ్యనామము : జనార్ధన్ నా విన్నపము ఏమిటంటే సాహిత్య పరమైనటువంటి పద్యములకు భాషార్ధములు మరియు భావములు తెలియజేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అదే విదంగా సాహిత్య పరమైనటువంటి ప్రశ్నలు అడగటానికి వాటికి మీరు జవాబులు ఇవ్వటానికి ఒక పేజీని సృష్టిస్తే భాషా ప్రతిభను మెరుగు పరచటానికి అందరికీ వీలుంటుందని ఆశిస్తున్నాను

దన్యవాదాలు.

ఇట్లు, జనార్ధన్


జనార్దన్ గారూ! మీ సాహిత్యాభిమానానికి అభినందనలు - వికీలో పనిచేసే వారిలో చాలా మందికి ఉత్సాహం ఎక్కువా, పాండిత్యం తక్కువాను. నాలాంటి వారికి అసలు సాహిత్యం గురించి తెలియదు (నేను ఎలక్ట్రికల్ ఇంజినీరును). కాని మీరు లేవనెత్తిన "భాషా ప్రతిభను మెరుగు పరచటం" అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇందుకు నేను ప్రస్తుతం కొన్ని సూచనలు చేస్తున్నాను.
  • ఏవైనా ప్రశ్నలు నిరభ్యంతరంగా ఇక్కడ అడుగ వచ్చును. తెలిసిన వారెవరైనా సమాధానాలు ఇస్తారు.
  • ఏవైనా విషయాలు, వ్యక్తులపై వ్యాసాలు ఉన్న చోట ఆయా వ్యాసాల చర్చా పేజీలలో కూడా ప్రశ్నలు, అభిప్రాయాలు, సూచనలు వ్రాస్తే చాలా బాగుంటుంది.
  • పద్యాలకు అర్ధాలూ, భావాలూ గురించి - నిజంగానే నాలాంటి వాళ్ళకు పద్యాలు అర్ధం కావు. కనుక అర్ధాలు, భావాలు దొరికే వనరులను అభివృద్ధి చేయడం చాలా మంచి ఆలోచన. కొన్ని విషయాలు "వికీసోర్స్" లోకి వెళ్ళాలి. దీనిని గురించి తరువాత మళ్ళీ చర్చిద్దాము.
  • మీ వూరు పుల్లాయపల్లె అనుకొంటాను. మీ వూరి గురించి ఇంకాస్త వ్రాయండి. ఏమి వ్రాయొచ్చు అనే విషయమై ఇక్కడ చూడండి. మీ మిత్రులను కూడా వికీలో తమ సహకారాన్ని అందించమని ప్రోత్సహించండి.
  • సామెతల గురించి మీరు కొంత వ్రాసారు. కొనసాగించండి.
  • నేను గమనించిన మరో విషయం - నేరుగా వికీ వ్యాసాలు మార్చడానికి మీరు వెనుకాడుతున్నట్లున్నారు. అందుకని విషయాన్ని చర్చా పేజీలో వ్రాస్తున్నారు. ఏమీ మొగమాటం అక్కరలేదు. మీరు చొరవగా ప్రధాన వ్యాసాలు మార్చ వచ్చు. క్రొత్తవి చేయ వచ్చును. ఏమైనా సందేహాలుంటే నా చర్చా పేజీలో User talk:Kajasudhakarababu అడగండి.

--కాసుబాబు 06:18, 9 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]