Jump to content

వాడుకరి చర్చ:PAJJURU RAVI TEJA/ప్రయోగశాల

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

అభినందనలు

[మార్చు]

మంచి మూలాన్ని అడిగి తీసుకుని, చదివి చక్కటి వ్యాసాన్ని రాస్తున్నందుకు అభినందనలు. వ్యాసాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు కొన్ని సూచనలు చూడండి:

  1. వాక్యం/పేరా ప్రారంభంలో ఖాళీలు: పత్రికలు, పుస్తకాలు చదివినవారికి సాధారణంగా పేరా మొదలుపెట్టేప్పుడు కనీసం నాలుగైదు స్పేసులు వదిలే అలవాటు ఉంటుంది. అది మీరు రాసిన వ్యాసంలో కనిపిస్తూంది. ఐతే వికీపీడియాలో మాత్రం వ్యాసంలో ఎక్కడా అలా కొన్ని స్పేసులు వదలడం సంప్రదాయం కాదు. వేరే పేరా ప్రారంభించాలంటే వాక్యంలో ఖాళీలు వదలకుండా ముందు వాక్యం తర్వాత రెండు ఎంటర్లు కొట్టినా, లేక <br /> అని పెట్టినా సరిపోతుంది. పైన ఉన్నత అన్న విభాగంలో భాగంగా "ఎంటర్" అన్న బటన్ కనిపిస్తుంది, దాన్నైనా వాడుకోవచ్చు. (ఎందుకంటే మనం మార్కప్ కోడ్ తో అలా రాస్తే బయటికి కొత్త పేరా ప్రారంభించినట్టు కనిపిస్తుంది)
  2. వికీ మార్కప్ కోడ్: కింద మూలాలు అని రాశారు. అలా కాకుండా మార్కప్ కోడ్ వాడి == మూలాలు == అని రాసి చూడండి.
  3. అక్షరదోషాలు: అక్షరదోషాలు రావడానికి బహుశా మీకు కీబోర్డులో ఏది కొడితే ఏ అక్షరం వస్తుందో ఇంకా పూర్తిగా తెలియకపోవడం కారణం అయివుండొచ్చు. ఇది తెలియాలంటే ఈ వ్యాసం చూడండి.

ఇక వ్యాసంలో మీరిచ్చిన వివరాలు. వందల పేజీల పుస్తకాన్ని చదివి, సారాంశాన్ని కొద్ది వాక్యాల వ్యాసంగా రాసిన తీరు గమనించాకా మీరు చక్కని వికీపీడియన్ అవుతారని తెలిసివచ్చింది. అభినందనలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 08:34, 1 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]