వాడుకరి చర్చ:Rravour

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Rravour గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. Smile icon.png వైఙాసత్య 21:09, 18 డిసెంబర్ 2006 (UTC)


చిమిర్యాలను గురించిన వ్యాసం బాగుంది[మార్చు]

Rravour గారు. నమస్కారం. చిమిర్యాల కు సంబంధించిన మీవ్యాసాన్ని పరిశీలిస్తున్నాను. నాకు తోచిన కొన్ని అభిప్రాయాలు చెప్తున్నాను.

 • ఒక చిన్న గ్రామం గురించి ఏమి వ్రాయవచ్చనేది నాకు, చాలామందికి కలిగే సందేహం. మీరు పొందు పరచిన విషయాలు అందుకు చక్కని మార్గదర్శకాలు.
 • మీరు దయచేసి ఈ వ్యాసాన్ని మరికాస్త పొడిగించి, ఒక సంపూరహనమైన షేపుకు తీసుకరమ్మని కోరుతున్నాను. గ్రామాలగురించి ఎలా వ్రాయాలో అనేదానికి దీనిని ఒక ఉదాహరణ వ్యాసంలాగా మనం తీసుకోవచ్చును.
 • ఏవైనా ఒకటి రెండు ఫొటోలు జోడించడానికి వీలవుతుందేమో పరిశీలించండి.
 • ఇంకా చేర్చదగ్గ కొన్ని విషయాలు
  • ముఖ్యమైన ఫోను నంబరులు (పంచాయతీ ఆఫీసు, డాక్టరు, పోలీసు స్టేషను, స్కూలు, పోస్టాఫీసు వంటివి)
  • ఆరంభాలు: బస్సు సౌకర్యం ఎప్పుడు మొదలైంది? స్కూలు ఎప్పుడు మొదలైంది? వంటివి.
  • ప్రమాదాలు: ఏవైనా ఉత్పాతాలు (అగ్ని ప్రమాదం, వరదలు వంటివి) ఎప్పుడైనా సంభవించాయా?
  • గ్రామంలో ముఖ్యమైన సమస్యలు

మీరు కష్టపడుతుంటే మరింతగా పనిపెడుతున్నానని కోపగింపవలదు.

కాసుబాబు 20:24, 20 డిసెంబర్ 2006 (UTC)


Thanks for your compliment. i will try to improve this page as per ur suggestions.[మార్చు]

చిమిర్యాల గ్రామం గురించి[మార్చు]

చిమిర్యాల గ్రామంపై మీరు రాస్తున్న వ్యాసం చాలా బాగుంది. ఒక గ్రామం గురించి అంత పెద్ద వ్యాసం రాయటం తెలుగు వికీపీడియాలో ఇదే ప్రధమం. వ్యాసం చాలా వివరణాత్మకంగా ఉంది. కానీ వికీపీడియాలో మీ సొంత సందేశాలను పొందుపరచటం నిషిద్దం. ఇది ఒక విజ్ఞాన సార్వస్వం. కాబట్టి వ్యాసాలు దానికి తగినట్లుగా వ్యాసాలు ఉండాలి. సుభాకాంక్షలు లాంటివి చర్చాపేజీలలో రాయవచు కానీ వ్యాసంలో రాయటాన్ని అంగీకరించరు. అక్కడ మీరు చేర్చిన సందేశాన్ని తొలగించినందుకు అన్యదాభావించకండి. నేను తెలుగు వికీపీడియాను అందంగా ఉంటే చూడాలని కోరుకుంటున్నాను అంతే. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 12:18, 29 డిసెంబర్ 2006 (UTC)

మండపాక వ్యాసం కూడా చూడండి[మార్చు]

Rravour గారు,

 • మీ పరిచయం కొంచెమైనా మీ సభ్యునిపేజీలో వ్రాస్తే బాగుంటుంది.
 • చిమిర్యాల గురించి మీరు చక్కని వ్యాసం అందించిన సమయంలోనే మండపాక గురించి మరొక ఆసక్తికరమైన వ్యాసం తయారవుతున్నది. అది కూడా పరిశీలించగోరుతున్నాను. మీకు మరిన్ని ఐడియాలు రావచ్చును.

కాసుబాబు 19:58, 5 జనవరి 2007 (UTC)