వాడుకరి చర్చ:Vu3ktb/పాతచర్చలు 6
అమరావతి కథల గురించి
[మార్చు]వ్యాసం లక్ష్యం కథల జాబితా ఇవ్వటంలో ఉద్దేశ్యం, ప్రతి కథ గురించి కొద్ది కొద్ది గా వ్రాద్దామని. --SIVA 18:07, 30 అక్టోబర్ 2008 (UTC)
ఆభినందనలు
- శివా! ఈ వ్యాసం మొదలు పెట్టినందుకు అభినందనలు. చాలా రోజులుగా ఈ వ్యాసం వ్రాయాలని నేను అనుకొంటున్నాను కాని చేయలేకపోయాను. నేను ఇంటర్మీడియెట్‌లో ఉన్నపుడు ఆంధ్ర జ్యోతిలో ఈ కధలు వచ్చేవి. అప్పుడు చదివాను. తరువాత పుస్తకం కొన్నాను. మొన్నీ మధ్య మళ్ళీ కొన్నాను కేవలం వికీలో వ్యాసం వ్రాయడం కోసం. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:25, 30 అక్టోబర్ 2008 (UTC)
- కాసుబాబుగారు! చాలా రోజుల తరువాత ఒక వ్యాసం వ్రాయాలనిపించింది. మీకు లాగానె నేను కూడ కాలేజీలో చదువుకునే రోజులలో ఈ కథలు చదివాను. ఈ కథల రచయిత శంకరమంచి సత్యంగారి అబ్బాయి, మా క్లాసులోనే చదివాడు. వికీలో వ్యాసం వ్రాద్దామని కాక పోయినా, విజయవాడ వెళ్ళీనప్పుడల్లా, విశాలాంధ్ర, అరుణా లేదా నవొదయా పుబ్లిషర్స్ దుకాణాలకు వెళ్ళి పుస్తకాలు కొనటం అలవాటు. ఇప్పుడు వ్యాసం వ్రాయటానికి చక్కగా ఉపయోగపడింది. ఈ వ్యాసాన్ని విస్తరించటానికి, ఇంకా ఇతర వివరాలు పొందుపరిస్తే బాగుంటుందో తెలియచేయగలరు. నేను 2-3 రోజులలో హైదరాబాదు వెల్తున్నాను. వీలయితే వివరాలు సంపాయించటానికి ప్రయత్నిస్తాను. --SIVA 19:12, 30 అక్టోబర్ 2008 (UTC)
- శివ గారు, అమరావతి కథలు గురించి చక్కని వ్యాసం వ్రాస్తున్నందుకు అభినందనలు. నా కాలేజీ రోజులలో వచ్చిన ఈ కథలు నా మనోఫలకముపై చెరగని ముద్ర వేశాయి. తదుపరి నవోదయా వారి పుస్తకము కొనుక్కొన్నాను. తీరిక దొరికినప్పుడల్లా ఎదో ఒక కథ చదువుతుంటాను. ఎన్నిసార్లు చదివినా ఒక కొత్త అనుభూతే. అమరావతి వెళ్ళి వీధులన్ని కలియతిరిగాను. కృష్ణాతీరం, అర్ఛకుల వీధి, రాజమార్గం, స్తూపం, మ్యూజియం వగైరా ప్రదేశాలు చూసి కథలు నెమరువేసుకున్నాను. అదొక చెప్పలేని ఉల్లాసం, అనుభూతి. అమరావతి కథలు వ్రాసిన సత్యం గారి జన్మ ధన్యం. చదివిన వారి బ్రతుకులు కూడ ధన్యం. హృదయాన్ని స్పృశించి, మానవుని లోని సున్నితమైన భావాలను స్పందింప చేసే ఇలాంటి సాహిత్యానికే నోబెల్ బహుమతులివ్వాలి.Kumarrao 07:53, 2 నవంబర్ 2008 (UTC)
- వ్యాసం బాగానే వస్తున్నది. తోడుగా నేను కూడా నాకు వీలయినంత వ్రాస్తాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:34, 30 అక్టోబర్ 2008 (UTC)
చేయవలసిన పనులు
- చేర్చవలసినవి, టీవీ సీరియల్ వివరాలు, ప్రముఖుల అభిప్రాయాలు, ఇతర రచయితల పై ఈ పుస్తకం ప్రభావం, ఈ పుస్తకంపై ఇతర రచయితల ప్రభావం. Chavakiran 03:58, 31 అక్టోబర్ 2008 (UTC)
- నాఉద్దేశ్యంలో ఎక్కడైనా పాత ఆంధ్ర జ్యోతి వార పత్రికలు (ఈ కథలు ప్రచురించబడినప్పటివి) దొరికితే, అప్పటి చదువరుల అభిప్రాయాలు, సమీక్షలు ఇతరుల అభిప్రాయాలు దొరుకుతాయి. హైదరాబాదులో నివాసం ఉండే సభ్యులు ఎవరైనా చిక్కడపల్లిలో ఉన్న సెంట్రల్ గ్రంధాలయానికి వెళ్ళి ప్రయత్నిస్తే తప్పక దొరుకుతాయి. కాబట్టి, హైదరాబదులోని సభ్యులు చొరవ తీసుకొని ఈ ప్రయత్నం చెయ్యగలరని కు నా విన్నపం.--SIVA 01:14, 1 నవంబర్ 2008 (UTC)
కథలకు ప్రత్యేక పుట
- శివా! వ్యాసం పెద్దదవుతున్నది. మీరు ఇంకొంత వ్రాయాలనుకొంటే ఈ వ్యాసాన్ని విభజించడం మంచిదనుకొంటాను. ప్రధాన వ్యాసంలో కథల పట్టిక మాత్రం ఉంచవచ్చును. అమరావతి కథలు - టూకీగా అనే మరోవ్యాసం మొదలుపెట్టి అందులో కథల వివరాలు వ్రాయవచ్చును. మీ అభిప్రాయం చెప్పండి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:19, 3 నవంబర్ 2008 (UTC)
- కాసుబాబు గారూ! అమరావతి కథలన్నీ కూడా టూకీగా వ్రాద్దామని ఉన్నది. కొంత సమయం పట్టవచ్చును. మనం గుడిపాటి వెంకటచలం గురించి వ్యాం వ్రాస్తున్నప్పుడు, కొంతమంది నటులగురించి వ్రాస్తున్నప్పుడు వారివారి చిత్రాల జాబితాలు ప్రత్యేకంగ ఉంచటం గురించి కొంత చర్చ జరిగింది. ఆ చర్చననుసరించి, కథలను టూకీగా వ్యాసంలోనే వ్రాస్తున్నాను. కాదు, ప్రత్యేక వ్యాసంగా పెడదామంటే, అలాగే. ఒక మంచి పేరు సూచించండి. ఏది ఏమయినా, అమరావతి కథలగురించి, ఆ కథలను చదవని వారికి సంపూర్ణ సమాచారం ఇవ్వటమే నా ఉద్దేశ్యం. ప్రస్తుతం నేను హైదరాబాదులో, బంధువుల ఇంటినుండి ఈ వాఖ్య వ్రాస్తున్నాను. 3-4 రోజులలో ముంబాయికి తిరిగి వెళ్ళి మిగిలిన కథలగురించి వ్రాస్తాను. దయచేసి మీ నిర్ణయం తెలియచేయగలరు.--SIVA 09:21, 4 నవంబర్ 2008 (UTC)
- కాసుబాబుగారూ! మొదటినుండీ నా అభిప్రాయం ఒక రచయిత కథల గురించి గాని, ఒక నటుడి పాత్రల గురించి గాని, ప్రత్యేక పుట ఉంచటమే సరయిన పద్ధతి అని. కాని ఇంతకు ముందు (ఎస్వీ రంగారావు వ్యాసం గురించి అనుకుంటాను)జరిగిన వాదోపవాదాలలో, అదే పుటలో ఉంచటం భావ్యమని, వేరొక పుటలో కాదని, నొక్కి వక్కాణించటం జరిగింది. సరే! నలుగురితోబాటు అని, అదే వ్యాసంలో కథల గురించి వ్రాస్తుంటే, పత్యేక పుట అని సూచించారు. ఏది ఏమయినా, ఇటువంటి వ్యాసాలు వ్రాసేటప్పుడు, ఏదో ఒక పంధాను అనుసరించి, ఆ పంధాను ఒక నియమంగా చేసుకుంటే బాగుంటుందనుకుంటున్నాను. అలాగయితే, ఒక కోవకు చెందిన వ్యాసాలన్నీ ఒక పద్ధతిలో వస్తాయి.--SIVA 00:50, 7 నవంబర్ 2008 (UTC)
- కథలను అమరావతి కథా సంగ్రహం అన్న కొత్త పుట ఏర్పరిచి అక్కడకు మార్చాను. ఇక్కడ, కథల జాబితా మాత్రం ఉంచాను. కథల జాబితా కూడా, ఒక టేబుల్ ఫార్మాట్ లో నాలుగు వరుసలుగా (4 columns, 25 rows)గా మారిస్తే చూడటానికి, రెఫరెన్సుకు బాగుంటుందని నా అభిప్రాయం. టేబుల్ ఫార్మాట్ నాకు సరిగా చేతగాదు, ఎవరయినా సహాయం చేయగలరు.--SIVA 01:00, 7 నవంబర్ 2008 (UTC)
కథలెన్ని?? కొన్ని చోట్ల 100 అని మరి కొన్ని చోట్ల 101 అని ఉంటోంది. కథా సంపుటిలో చూస్తే 100 కథలున్నాయి (జాగ్రత్తగా 2-3 సార్లు లెక్కపెట్టాను, చివరకు కథలకు వరుసక్రమంగా సంఖ్యలను వేస్తూ వెళ్ళాను). నూటొక్క కథలు నిజమైతే, సంపుటిలో లేని ఆ కథ ఏమిటి, అది ఎందుకు సంపుటిలో లేదు, ఇప్పుడు ఎక్కడన్నా దొరుకుతుందా ఇత్యాది విషయాలు, "నూటొక్క కథలు" అని వ్రాసిన సభ్యులు తెలియ చేయగలరు. లేదా, నూరు కథలే అయితే, వ్యాసంలో 101 అని వ్రాసిన చోటల్లా 100 గా మార్చటం సబబు.--SIVA 00:50, 7 నవంబర్ 2008 (UTC)
- మీ వ్యాఖ్య ఆలస్యంగా చూశాను. నోబెల్ బహుమతికి నామినేషన్ విశ్వవిద్యాలయములలో పనిచేస్తున్న సాహిత్యము లేక భాషా విజ్ఞానము శాఖలలోని ఆచార్యులు చేయవచ్చు. నామినేషన్ చేయు పద్ధతి చూడండి (http://nobelprize.org/nomination/literature/nominators.html). నా అభిప్రాయములో ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారు చేస్తే బాగుంటుంది. వారిని తెలిసినవారు ఈ పనికి పూనుకోవాలి. సాధనమున పనులు సమకూరు ధరలోన.Kumarrao 11:46, 22 నవంబర్ 2008 (UTC)
- మీరు ముంబాయిలో ఉంటారనుకుంటాను. హైదరాబాదులో మీకు తెలిసిన భాషాభిమానులను సంప్రదించి కృష్ణమూర్తి గారిని కలవమనండి.Kumarrao 06:50, 29 నవంబర్ 2008 (UTC)
- కృష్ణమూర్తి గారికి ఈ-మెయిల్ పంపుతాను. హైదరాబాదు వెళ్ళినపుడు కలిసి మాటలాడతాను. మీ సలహా ఆచరిస్తాను.Kumarrao 09:58, 1 డిసెంబర్ 2008 (UTC)
- కృష్ణమూర్తి గారి ఈ-మెయిల్ ఐడి: bhk@hd1.vsnl.net.in కృష్ణమూర్తి గారి గురించి ఈవ్యాసములలో చూడగలరు: (http://www.engr.mun.ca/~adluri/telugu/language/linguistics/krishnamurti.html), (http://en.wikipedia.org/wiki/Bhadriraju_Krishnamurti)Kumarrao 07:03, 4 డిసెంబర్ 2008 (UTC)
- కృష్ణమూర్తి గారికి ఈ-మెయిల్ పంపుతాను. హైదరాబాదు వెళ్ళినపుడు కలిసి మాటలాడతాను. మీ సలహా ఆచరిస్తాను.Kumarrao 09:58, 1 డిసెంబర్ 2008 (UTC)
- మీరు ముంబాయిలో ఉంటారనుకుంటాను. హైదరాబాదులో మీకు తెలిసిన భాషాభిమానులను సంప్రదించి కృష్ణమూర్తి గారిని కలవమనండి.Kumarrao 06:50, 29 నవంబర్ 2008 (UTC)
- మీ వ్యాఖ్య ఆలస్యంగా చూశాను. నోబెల్ బహుమతికి నామినేషన్ విశ్వవిద్యాలయములలో పనిచేస్తున్న సాహిత్యము లేక భాషా విజ్ఞానము శాఖలలోని ఆచార్యులు చేయవచ్చు. నామినేషన్ చేయు పద్ధతి చూడండి (http://nobelprize.org/nomination/literature/nominators.html). నా అభిప్రాయములో ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారు చేస్తే బాగుంటుంది. వారిని తెలిసినవారు ఈ పనికి పూనుకోవాలి. సాధనమున పనులు సమకూరు ధరలోన.Kumarrao 11:46, 22 నవంబర్ 2008 (UTC)
న్యాయశాస్త్ర సంబంధిత వ్యాసాలు
[మార్చు]తెవికీలో మీ కృషికి ధన్యవాదాలు. తెలుగులోని భాషా సంబంధిత వ్యాసాలు చాలా బాగున్నాయి. బొంబాయిలోని లైబ్రరీలో పాత తెలుగు పత్రికలు దొరికితే వాటి గురించి వ్యాసాలు రాయవచ్చును. జ్ఞాపకం ఉన్నవాటితో రాస్తే తప్పులు దొర్లే ప్రమాదం ఉన్నది. నాదొక అభ్యర్ధన. తెవికీలో న్యాయ సంబంధమైన వ్యాసాలు అసలు లేవని చెప్పవచ్చును. మీరు న్యాయశాస్త్రంలో పట్టభద్రులు కాబట్టి తెలుగుమీద మంచి పట్టు కలిగి ఉన్నారు. సామాన్య భారతీయులకు అవసరమైన న్యాయ సంభంధిత వ్యాసాలు రచిస్తే బాగుంటుందని నా అభ్యర్ధన.Rajasekhar1961 14:27, 18 డిసెంబర్ 2008 (UTC)
- అవును సుమీ! బ్యాంకింగు, న్యాయశాస్త్రం గురించి మీరు కాస్త పూనుకోవాల్సిందే. రాజశేఖర్ గారు నాకు చెప్పక పోయినా పై వ్యాఖ్య నాకు చిన్న చురకగా అనిపించింది! ఎందుకంటే నేను ఇంతవరకూ "ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్" గురించి ఒక్క వ్యాసం కూడా వ్రాయలేదు. ప్రధానంగా పదజాలం గురించిన సమస్య వల్ల. నా సెలవులు ఫూర్తయ్యాక, మార్చి నుండి, విద్యుత్తుకు సంబంధించిన కొన్ని వ్యాసాలు వ్రాయడానికి ప్రయత్నిస్తాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:54, 18 డిసెంబర్ 2008 (UTC)
- మీ సూచనకు ధన్యవాదాలు రాజశేఖర్ గారూ! దయ చేసి వికీపీడియాలో వ్రాయదగ్గ న్యాయ శాస్త్ర విషయాలను సూచించండి. "సాక్ష్యము", "ఒప్పందము" ఇలా రాసుకుంటూ పోతే చాలా అవుతాయి. మౌలికమయిన విషయాల మీద వ్రాద్దామా లేక కొన్ని కొని న్యాయ సంబంధమయిన మాటలు (legal vocabulary)గురించి వ్రాద్దామా?? అలోచించి ఒకసారి సూచిచండి, ఇతర సభ్యుల అభిప్రాయం కూడ తీసుకుంటే బాగుంటుంది. తపకుండా వ్రాయటానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను. తరువాత, నేను "శీర్షికలు" వర్గం చర్చ పుటలో విషయాలు చూసినట్టున్నారు. ఇక్కడ నేను బొంబాయిలో గ్రంధాలయానికి వెళ్ళి తెలుగు పత్రికలు వెతికి (అందులో పాతవి 1960లు 70లవి-ఇక్కడ దొరుకుతాయా?)అప్పుడు వ్యాసం వ్ర్రాయటం జరిగే పనేనంటారా? చిన్న చిన్న ఊళ్ళల్లో ఉన్నవారికి అక్కడ ఉన్న గ్రంధాలయాలు చక్కటి అవకాశం. అందుకనే నా అబ్యర్ధన ఏమిటంటే, మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్న సభ్యులు కొంత సమయాన్ని వెచ్చించి కొంత రిసెర్చ్ చేసి అప్పటి శీర్షికలగురించి వ్యాసాలను వ్రాయమని. ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ గారికి ఈ మైల్ ద్వారా ఒక ఆభ్యర్ధన పంపాను, "ఊమెన్" కార్టూన్ల గురించి వ్యాసాన్ని వ్రాయమని(ఒక్క అరగంట క్రితమే). ఈ విధంగా, కొంతమంది ప్రముఖులను కూడ మనం వికిఇలో సభ్యులుగా చేర్చగలిగితే, వారి కంట్రిబ్యూషన్ కూడ ఉంటుందని నా అభిప్రాయం.--SIVA 15:02, 18 డిసెంబర్ 2008 (UTC)
కొన్ని అక్షరాలు టైపు చెయ్యటం ఎలా
[మార్చు]వికీలో సభ్యుడైన తరువాత మొదటిసారి ఈ పుటలోకి వచ్చి చూశాను. ఇన్నాళ్ళూ కీ బోర్డు తో కుస్తీ పట్టి నేర్చుకున్నవన్నీ ఇక్కడ ఉన్నాయి!! ఉదాహరణలో ఇచ్చిన ఈ కింది మాటలు టైపు చేసేటప్పుడు ఈ గుర్తు ^ ఎలా తెప్పించాలో తెలియ చెయ్యగలరు. నా కీబోర్డ్^లో కనబడలేదు(ఇక్కడ జస్ట్ కాపీ చేశాను) . ఏవో రెండు కీలను ఒత్తితే వస్తుందనుకుంటాను. దయచేసి చెప్పగలరు.--SIVA 01:58, 23 డిసెంబర్ 2008 (UTC) ఫైర్‌ఫాక్స్ fair^faaks
- 5 పైన % ఉన్నట్టు 6 పైన ^ ఉంటుంది. shift పట్టుకొని 6 నొక్కితే చాలు --వైజాసత్య 02:39, 23 డిసెంబర్ 2008 (UTC)
బండి ఱ
[మార్చు]~ra వ్రాస్తే ఱ , ~rra వ్రాస్తే ఱ్ర వస్తాయి --వైజాసత్య 04:24, 25 డిసెంబర్ 2008 (UTC) ధన్యవాదాలు సత్యాగారు. కాని నేను ఆడిగింది ఱ కింద ఱ వత్తు. ఱ కంద ర వత్తు కాదు. ఈ ప్రయోగం చేసినతరువాతనే సహాయం కోసం వ్యాఖ్య వ్రాశాను. దయచేసి చూసి చెప్పగలరు--SIVA 04:32, 25 డిసెంబర్ 2008 (UTC)
- ~r~ra ఱ్ఱ --వైజాసత్య 04:53, 25 డిసెంబర్ 2008 (UTC)
ఏమి జరిగింది
[మార్చు]ఇటీవలి మార్పులు చూసినప్పుడు ఈ కింది ఎంట్రీ ఉన్నది- (తేడాలు) (చరితం) . . చి చర్చ:నాస్తికులు; 20:56 . . (-1,092) . . C.Chandra Kanth Rao (చర్చ | రచనలు) (121.245.40.164 (చర్చ) చేసిన మార్పులను, Vu3ktb వరకు తీసుకువెళ్ళారు)
నాదాకా తేవటం ఏమిటి?? నాస్తికులు చర్చా పేజీలో నాకు తొచిన విషయాలు వ్రాసాను. చంద్ర కాంత రావు గారు ఈ విషయం గురించి నాకేమీ సందేశం ఇవ్వలేదు. అసలు ఏమి జరిగింది తెలుపగలరు.--SIVA 16:43, 27 డిసెంబర్ 2008 (UTC)
- దీనర్ధం నాస్తికులు చర్చా పేజీలో మీ తర్వాత 121.245.40.164 ఐ.పీ అడ్రసుతో అజ్ఞాత వ్యక్తి ఏవో అప్రస్తుత వ్యాఖ్యలు చేసినట్టున్నారు. అవి చంద్రకాంతరావు గారు తొలగించి ఆ పేజీని చివరిసారిగా మీరు మార్పులు చేసిన స్థితికి తీసుకెళ్ళారు. సరళంగా చెప్పాలంటే ఆ పేజీలో మీ తర్వాత 121.245.40.164 చేసిన మార్పులు తొలగించారు. ఇలాంటివి సర్వసాధారణంగా చేస్తుంటారు. అందుకే మీకు ప్రత్యేకంగా చెప్పలేదు. అయినా తొలగించినవి మీరు చేర్చిన మార్పులు కాదు. --వైజాసత్య 16:59, 27 డిసెంబర్ 2008 (UTC)
- అంటే 121.245.40.164 ఐ.పి. నుండి చేసిన మార్పులు రద్దు చేసి, విషయాన్ని అంతకు ముందు పొజిషన్‌కు revert చేశారన్నమాట. దుశ్చర్యలను, పొరపాటులను సరిదిద్దే విధానంలో ఇలా చేస్తారు. అంతకు ముందు last acceptable edit మీది గనుక "మీదాకా" వచ్చింది. చూశారా! సామాన్య భాష పదజాలాన్ని పారిభాషిక సందర్భంలో వాడడంలో ఉన్న ఇబ్బంది? అప్రస్తుతమే అయినా నాకు తోచిన ఒక విషయం చెబుతాను. తెలుగు అకాడమీ వారి సంస్కృత భూయిష్ట పదజాలాన్ని చాలామంది విమర్శిస్తారు. ముఖ్యంగా popular science వ్రాసేవాళ్ళు. దీనికంటే ఆంగ్లపదాలే తేలికగా ఉన్నాయంటారు. కాని ఒక శాస్త్రాన్ని తెలుగు భాషలో చదవడానికి సరిపడ పదజాలం చేయాలన్న ఒక ప్రాజెక్టును ఊహించండి. ఆ పనికి చాలా constraints ఉంటాయి. మరింత లోతుగా వెళ్ళిన కొద్దీ పెరిగే derivative పదజాలానికి అవుసరమైనంత vocabulary space రిజర్వు చేయడం. ఇతర భారతీయ భాషలనుండి వ్యత్యాసాన్ని వీలయినంత నివారించడం. వాడుక భాష పదాలను వాడడం వలన రాగలిగే అస్పష్టతను తొలగించడం. మనం ఇంటర్మీడియట్ చదివిన కాలంలో తెలుగు అకాడమీవారు చాలా ప్రశంసనీయమైన కృషి చేశారు. అది విజయవంతంగానే జరుగుతున్నట్లనిపించింది. కాని ఎక్కడో మధ్యలో బొక్కబోర్లా పడింది! --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:07, 27 డిసెంబర్ 2008 (UTC)