వికీపీడియా:ఇటీవలి వార్తలలో/అక్టోబరు 27
స్వరూపం
- ప్రపంచంలోనే తొలిసారిగా కదలికలు ఆగిపోయి, నిర్జీవమైపోయిన గుండెను విజయవంతంగా మార్పిడి చేసిన ఆస్ట్రేలియా వైద్యులు.
- పామర్తి శంకర్ కార్టూన్ల రంగంలో నోబెల్ బహుమతిగా పేరుపొందిన గ్రాండ్ ప్రి బహుమతి-2014 సాక్షి సంపాదక పేజీలో ప్రచురితమైన దక్షిణాఫ్రికా జాతిపిత నెల్సన్ మండేలా క్యారికేచర్ కు లభించింది. ఈ ఎంపికైన తొలి ఆసియావాసిగా ఆయన చరిత్ర సృష్టించారు.
- కెనడియన్ పార్లమెంటు వద్ద జరిగిన కాల్పులు ఘటనలో 2 మరణించారు.
- హుధుద్ తుఫాను ప్రభావం వల్ల భారత్, నేపాల్ లలో కనీసం 84కు పైగా మరణించారు.
- హుధుద్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్, సమాచార వ్యవస్థను దాదాపుగా పునరిద్ధరించారు.
- అన్నపూర్ణ, ధౌలగిరి శిఖరాల పరిసరాల్లో నేపాల్లోకెల్లా అత్యంత తీవ్రమైన మంచుతుపాను తాకిడి వల్ల కనీసం 41 మంది మరణించారు.
జరుగుతున్న పరిణామాలు: ఎబోలా వ్యాధి వ్యాప్తి - ఐఎస్‌ఐఎస్ - 2014 హాంగ్‌కాంగ్ నిరసనలు - హుధుద్ తుఫాను పునరావాస చర్యలు