వికీపీడియా:ఇన్‌కమింగు లింకులున్న అయోమయ నివృత్తి పేజీలు
అయోమయ నివృత్తి పేజీలకు ఇచ్చే లింకులపై నిఘా పెట్టే ప్రాజెక్టే ఇన్‌కమింగు లింకులున్న అయోమయ నివృత్తి పేజీలు ప్రాజెక్టు. ఇది వికీపీడియా:అయోమయ నివృత్తి ప్రాజెక్టులో భాగం. రెండు లేదా అంతకంటే ఎక్కువ సారూప్యమైన పేర్లున్న వ్యాసాలు ఉన్న సందర్భాల్లో గందరగోళాన్ని తొలగించేందుకు అయోమయ నివృత్తి పేజీలను సృష్టిస్తాం. ఉదాహరణకు, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రముఖ వ్యక్తులు ఒకే పేరు కలిగి ఉంటే అయోమయ నివృత్తి పేజీని సృష్టిస్తాం. పనిగట్టుకుని ఈ అయోమయ నివృత్తి పేజీలకు లింకు లివ్వకూడదు, ఒక పదం యొక్క అస్పష్టత గురించి చర్చించేటపుడు తప్ప (ఒక పదానికి ఒకటి కంటే ఎక్కువ పేజీలు ఉన్నాయని పేర్కొనే సందర్భంలో). వ్యాసానికి ఇవ్వదలచిన లింకులు నేరుగా సంబంధిత వ్యాసానికే ఇవ్వాలి. ఒక వ్యాసం నుండి ఉద్దేశపూర్వకంగా అయోమయ నివృత్తి పేజీకి లింకు ఇచ్చే చోట, ఆ లింకు "ఉద్దేశపూర్వకంగా ఉందని స్పష్టం చేయడానికి" ఫలానా వ్యాసం (అయోమయ నివృత్తి) అనే పేజీకి లింకు ఇవ్వాలి.
ఎలా తోడ్పడవచ్చు
[మార్చు]- మొదటగా వికీపీడియా: అయోమయ నివృత్తి గురించి తెలుసుకోండి. ఇది ఏయే సందర్భాల్లో అయోమయాన్ని నివృత్తి చెయ్యాలో వివరిస్తుంది.
- తరువాత, పరిష్కరించడానికి ఏదో ఒక అయోమయ పేజీని ఎంచుకోవాలి. అయోమయ నివృత్తి పేజీలు వర్గం:అయోమయ_నివృత్తి వర్గంలో ఉంటాయి. ఈ వర్గం లోంచి ఓ పేజీని ఎంచుకోండి. మీరు ఎంచుకున్న పేజీకి వెళ్ళి, అక్కడికి ఏయే పేజీల నుండి లింకులు ఉన్నాయో (ఇన్‌కమింగు లింకులన్నమాట) గమనించండి.
- అందుకు గాను, ఎడమ వైపున ఉన్న "పరికరాల పెట్టె" లోని ఇక్కడికి లింకున్న పేజీలు లింకుపై నొక్కండి.
- ఆ పేజీకి లింకున్న పేజీల జాబితా కనిపిస్తుంది. ఆ జాబితాలో ఇచ్చిన ప్రతీ పేజీని చూడండి. ప్రధాన, మూస పేరుబరుల్లోని పేజీలకు ఉన్న లింకులను పరిష్కరించాలి. వాడుకరి,వికీపీడియా పేరుబరుల్లోని పేజీలను పరిష్కరించాల్సినంత అవసరం లేదు. చర్చ పేజీల లింకులను అంటుకోవద్దు. ఎందుకంటే చర్చ పేజీ మార్గదర్శకాల ప్రకారం అలా చేయడం సరికాదు. దారిమార్పులు అయోమయ పేజీకి లింకైనా ఫర్వాలేదు గానీ, ఈ దారిమార్పులకు లింకు ఇచ్చే వ్యాసాలను సరిదిద్దాలి.
- "ఇక్కడికి లింకున్న పేజీలు" జాబితాలో ఇచ్చిన ఒక్కో వ్యాసానికి వెళ్ళి, సదరు లింకును నేరుగా సంబంధిత వ్యాసం పేజీకి మార్చండి. ఈ జాబితాలో ఉన్న వ్యాసాల లింకులు అన్నీ అయోమయ నివృత్తి పేజీలో ఉండకపోవచ్చు. లేని లింకులను అయోమయ నిఉవృత్తి పేజీలో చేర్చండి.
- మార్పులు చేసాక, పేజీని ప్రచురించేటపుడు, దిద్దుబాటు సారాంశంలో కింది విధంగా రాయండి. అలా చేస్తే ఇతరులకు ఈ పని గురించి తెలుస్తుంది: అయోమయ నివృత్తి పేజీలకు ఉన్న లింకులను సరి చేసాను
- [[వికీపీడియా:ఇన్‌కమింగు లింకులున్న అయోమయ నివృత్తి పేజీలు|మీరూ సాయపడండి]]
- మీరు ఇస్తున్న లింకు ఖచ్చితమైనదేనని నిర్ధారించుకుని చెయ్యండి.
- అవసరమైన సందర్భాల్లో లింకులను తొలగించవచ్చు. సాధారణంగా, ఒక పదానికి ఒకే వ్యాసం లేదా విభాగంలో ఒకటి కంటే ఎక్కువసార్లు లింకు ఇవ్వకూడదు. ఒకవేళ ఏదైనా పదానికి ఇచ్చిన లింకు సరైనది కాదని అనిపిస్తే మీరు భావించిన సరైన పేజీకి లింకును మార్చండి.
- ప్రధాన, మూస పేరుబరుల్లోని పేజీల్లో ఉన్న లింకులన్నిటినీ సవరిస్తే పని పూర్తైనట్లే.
{{Wikipedia:Disambiguation pages with links/Userbox}}
ఈ వాడుకరి పెట్టెను మీ సభ్యుని పేజీలో పెట్టుకోవచ్చు.{{మూస:DPL topicon}}
ను కూడా ఉపయోగించవచ్చు, ఇది మీ వాడుకరి పేజీ శీర్షిక పట్టీలో # అయోమయ నివృత్తి చిహ్నాన్ని ప్రదర్శిస్తుంది.- అయోమయనివత్తి పేజీల్లో ఉన్న బయటి లింకులు క్వారీ ద్వారా సేకరించిన 4400 పేజీల సమాచారం ఈ లింకులో పరిశీలించి వచ్చును.