Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2007 47వ వారం

వికీపీడియా నుండి
ఈ వారపు బొమ్మ/2007 47వ వారం
క్షీరసాగర మథనం

పైన చూపబడిన ఫొటోలో ఏలూరు వద్ద శనివారపు పేట గ్రామంలో చెన్న కేశవ స్వామి ఆలయం గోపురం పై చెక్కిన క్షీరసాగర మధన సన్నివేశాన్ని చూడవచ్చు. దేవతలు అమృతం పొందడానికి క్షీరసాగర మథనం జరుపుతారు. క్షీరసాగర మథనం ముఖ్యంగా భాగవతం లో ప్రస్తావించబడుతుంది. ఇదే గాథ రామాయణంలోని బాలకాండలోను మహాభారతంలోని ఆది పర్వములోను కూడా స్పృశించబడుతుంది. ఇదే ఇతిహాసము పురాణాలు లలో కూడా చెప్పబడింది. చాక్షుషువు మనువుగా ఉన్న సమయంలో క్షీరసాగర మథనం జరిగింది.

ఫోటో సౌజన్యం: కాసుబాబు