వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 02వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


కాలజ్ఞాన తత్వాలు

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళ పత్ర గ్రంధాలలో రచించి భద్రపరచారు. వీటినే కాలజ్ఞాన తత్వాలు అంటారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనడం వినడం మనకు పరిపాటే. ఇలా చెప్పినవారు ప్రపంచమంతా లేకపోలేదు పఠిష్టమైన కుటుంబ వ్యవస్థ ప్రాచీన నాగరికత సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాలలో అనేక పేర్లు వెలుగులో ఉన్నా ప్రపంచమంతా పరిచయమున్న పేరు మాత్రం నోస్ట్రడామస్. ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లు అంతర్జాతీయంగా ప్రజల విశ్వాసం. ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారిలానే మర్మంగా ఉంటాయి. అవి కూడా జరుగుతున్న వాటితో సమన్వయ పరచుకుంటారు.

బ్రహ్మంగారు ఆంధ్రుల ఇంట జన్మించిన కారణంగా ఆయన సరస్వతీ నదీ తీరప్రాంతంలో జన్మించారనిన చెప్పిన కాలజ్ఞానంలో ఆంధ్రదేశంలో పలు ప్రదేశాలు చోటు చేసుకున్నాయి. అనేక దేవతలు కూడా చోటు చేసుకున్నారు. గాంధి మహాత్ముని జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచింపబడింది. ఆంగ్లేయ మరియు మహమ్మదీయ పాలన విజయనగర పతనం లాంటి చారిత్రక మరియు రాజకీయ పరిణామాలు సూచింప బడ్డాయి. ప్రకృతి ప్రకోపాలు వింతలూ చోద్యాలు బాబాల రాక అనేక విధాలుగా ప్రజలు వంచనకు గురికావడం లాంటి సామాజిక విషయాలు వీటిలో చోటు చేసుకున్నాయి. ఆయన కలియుగాంతాన తిరిగి వస్తానని పదేపదే పునరుద్ఘాటించాడు. ఆయన వచ్చే ముందు కలిగే ఉత్పాదనలు సూచింప బడ్డాయి. ఒక సందర్భంలో ఆయన పూర్వజన్మల వాటి కాలం ఆయన వివరించిన తీరు నమ్మడం సామాన్యులకు కష్టమే. వీర బ్రహ్మేంద్ర స్వామి కాల జ్ఞానాన్ని వివిధ శైలులను ఉపయోగించి కూర్చారు, అందులో శ్లోకాలు,పద్యాలు, వచనం మొదలైనవి.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి