వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 27వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దస్త్రం:Mountfujijapan.jpg

జపాన్ అనేది తూర్పు ఆసియా ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం. ఇది చైనా, కొరియా, రష్యా దేశాలకు తూర్పు దిశగా ఉంది. జపాన్ దేశపు ఉత్తరాన ఉన్న సముద్ర భాగాన్ని ఓఖోట్‌స్క్ సముద్రం అని, దక్షిణాన్న ఉన్న సముద్ర భాగాన్ని తూర్పు చైనా సముద్రం అనీ అంటారు. జపాన్ భాషలో ఆ దేశం పేరు (నిప్పన్)ను వ్రాసే అక్షరాలు "సూర్యుని పుట్టుక"ను సూచిస్తాయి. కనుక జపాన్‌ను "సూర్యుడు ఉదయించే దేశం" అని అంటుంటారు.


జపాన్ దేశంలో షుమారు 3,000 పైగా దీవులు ఉన్నందున ఇది నిజానికి ఒక ద్వీపకల్పం. ఈ దీవులలో పెద్దవైన నాలుగు దీవులు హోన్షూ, హొక్కయిడో, క్యూషూ మరియు షికోకూ కలిపి మొత్తం దేశం భూభాగంలో 97% వైశాల్యం కలిగి ఉన్నాయి. ఎక్కువ దీవులు పర్వత మయాలు లేదా అగ్ని పర్వత భాగాలు. జపాన్‌లోని అత్యంత ఎత్తైన ఫ్యూజీ పర్వతం కూడా ఒక అగ్నిపర్వతమే.

128 మిలియన్ల జనాభా కలిగిన జపాన్ ప్రపంచంలో జనాభా ప్రకారం పదవ స్థానంలో ఉన్నది. టోక్యో, మరియు దాని పరిసర ప్రాంతాలు కలిపితే 30 మిలియన్ల జనాభాతో ప్రపంచంలో అతిపెద్ద మెట్రొపాలిటన్ స్థలం అవుతుంది.(ఇంకా…)