వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2016 22వ వారం
సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను
సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను ప్రధాన నగరాలతో అనుసంధానించ బడిన ఒక రైల్వే స్టేషను మరియు హైదరాబాదు అర్బన్ ఏరియాలో ఒక కమ్యూటర్ రైల్ హబ్. ఇది హైదరాబాదు నగరంలో ఉన్నది. ఇది భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధి కింద వస్తుంది. 1874 సం.లో హైదరాబాదు రాష్ట్రం యొక్క నిజాం, బ్రిటిష్ కాలంలో నిర్మించిన, ఈ స్టేషన్ 1916 లో కాచిగూడ రైల్వే స్టేషను ప్రారంభమయ్యే వరకు., నిజాం రైల్వే యొక్క ప్రధాన రైల్వే స్టేషనుగా ఉంది. తరువాత దాని ఆపరేషన్ నిజాం రైల్వే జాతీయం చేసినప్పుడు, 1951 సం.లో భారతీయ రైల్వేలు చేపట్టాయి. ప్రధాన మంటపం మరియు సముదాయం (సమూహం) అసఫ్ జహిల తరహా నిర్మాణాన్ని ప్రభావితం చెస్తుంది. స్టేషను భవనం ఒక కోటను పోలి ఉండి మరియు హైదరాబాదు, సికింద్రాబాద్ జంట నగరాల్లో పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా భాసిల్లుతోంది. ఈ స్టేషను భారతదేశం యొక్క అన్ని భూ భాగాలకు రైలు ద్వారా అనుసంధానించబడింది. 190 పైగా రైలు బండ్లు (ట్రైన్లు) దేశవ్యాప్తంగా తమ గమ్యస్థానాలకు రోజువారీ లక్ష మందికి పైగా ప్రయాణీకులను చేరవేస్తూ, స్టేషను వద్దకు, లేదా స్టేషను నుండి బయలుదేరుతాయి. ఇటీవలి సంవత్సరాలలో, రైల్వే సముదాయంలో నిలువు విస్తరణ పై దృష్టి తో, ఒక ప్రపంచ స్థాయి స్టేషను లోకి అప్‌గ్రేడ్‌నకు ప్రతిపాదించింది.
(ఇంకా…)