Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2016 51వ వారం

వికీపీడియా నుండి

ముహమ్మద్ రఫీ

మహమ్మద్ రఫీ (డిసెంబర్ 24, 1924 - జూలై 31, 1980) ప్రముఖ ఉత్తర భారత నేపథ్యగాయకుడు. హిందీ సినీ వినీలాకాశంలో అతిపెద్ద తారగా విలసిల్లినవాడు. సంగీతాభిమానులందరికీ చిరపరిచితుడు అయిన రఫీ హిందీ, ఉర్దూ, మరాఠీ మరియు తెలుగు భాషలలో పాటలు పాడాడు. 17 భాషలలో తన గానంతో అందరినీ అబ్బురపరచాడు. హిందీ సినిమా (బాలీవుడ్) జగతులో గుర్తింపబడ్డాడు. భారత ఉపఖండంలో ప్రఖ్యాతిగాంచిన గాయకుడు. హిందీ సినిమా గాన జగతులో 1950 నుండి 1970 కాలం మహమ్మద్ రఫీ యుగం అంటే అతిశయోక్తి గాదు. రఫీ మరియు లతా మంగేష్కర్ ల గాయక జోడీ, హిందీ నేపథ్యగాన చరిత్రలో కొత్త ఒరవడిని, రికార్డును సృష్టించింది. కేవలం రఫీ పాటలతో వందల కొద్దీ చిత్రాలు విజయం పొందాయి. రాజేంద్రకుమార్ మరియు షమ్మీ కపూర్ రఫీ పాటలతోనే హిట్టయ్యారు. రాజేంద్రకుమార్ కేవలం రఫీ పాటలతోనే సిల్వర్ జూబిలీ హీరో అయ్యాడు. రఫీ, ముకేష్, మన్నాడే, కిషోర్ కుమార్ మరియు మహేంద్ర కపూర్ ల కాలం సువర్ణాక్షరాలతో లిఖింపదగ్గది. పంజాబ్ లోని కోట్లా సుల్తాన్ పూర్ లో జన్మించాడు. తండ్రి హాజి అలి మహమ్మద్. రఫీ హిందుస్థానీ క్లాసికల్ సంగీతం ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్, ఉస్తాద్ అబ్దుల్ వహీద్ ఖాన్, పండిత్ జీవన్ లాల్ మట్టూ మరియు ఫిరోజ్ నిజామి ల వద్ద నేర్చుకున్నాడు. ఒక రోజు తన మామ హమీద్ తోడు ప్రఖ్యాత గాయకుడు కె.ఎల్. సెహ్ గల్ గానకచ్చేరి చూడడానికి వెళ్ళాడు. విద్యుత్ అంతరాయం వలన సెహ్ గల్ పాడడానికి నిరాకరించాడు.


(ఇంకా…)