Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 47వ వారం

వికీపీడియా నుండి
పడమటి సంధ్యారాగం

పడమటి సంధ్యారాగం జంధ్యాల పూర్తిగా అమెరికా నేపథ్యంలో తీసిన సినిమా. విజయశాంతి, గుమ్మలూరి శాస్త్రి, థామస్ జేన్, శివమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 1987లో విడుదలై విజయం సాధించింది. ఈ చిత్రాన్ని గుమ్మలూరి శాస్త్రి, మీర్ అబ్దుల్లా కలిసి ప్రవాసాంధ్ర చిత్ర పతాకంపై నిర్మించాడు. చిత్ర దర్శకుడు జంధ్యాల, గాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఒకసారి అమెరికా పర్యటనకు వెళ్ళినపుడు నిర్మాతలకు వీరికి మధ్య జరిగిన సంభాషణ ఈ చిత్రానికి బీజం వేసింది. ఈ చిత్రంలో నటులంతా దాదాపు అమెరికాలో స్థిరపడ్డ ప్రవాసాంధ్రులే. చిత్రీకరణ సుమారు తొంభై శాతం అమెరికాలోనే జరిగింది. అమెరికన్ కథానాయకుడిగా నటించిన మొట్టమొదటి భారతీయ భాషా చిత్రం కూడా ఇదే. ఈ చిత్రానికి ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం సంగీత దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ తెలుగు చిత్రంగానూ, ఉత్తమ కథా రచయితగా జంధ్యాలకు నంది పురస్కారం లభించాయి.
(ఇంకా…)