Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 48వ వారం

వికీపీడియా నుండి
రాష్ట్రకూటులు

రాష్ట్రకూటులు సా.శ. 6 -10 వ శతాబ్దాల మధ్య భారత ఉపఖండంలోని పెద్ద భాగాలను పాలించిన రాజవంశం. పురాతన రాష్ట్రకూట శాసనమైన 7 వ శతాబ్దపు రాగి పలక, మధ్య లేదా పశ్చిమ భారతదేశంలోని మనపురా అనే నగరం నుండి వారు చేసిన పాలనను వివరిస్తుంది. అదే సమయంలో అచలాపూర్, కన్నౌజ్ వంటి ఇతర ప్రాంతాలను పాలించిన రాజులు కూడా రాష్ట్రకూటులే. ఈ తొలి రాష్ట్రకూటుల మూలం గురించి, వారి మాతృభూమి, భాషల గురించీ అనేక వివాదాలు ఉన్నాయి.

ఎలిచ్‌పూర్ తెగ బాదామి చాళుక్యులకు పాలెగాళ్ళుగా ఉండేవారు. దంతిదుర్గుడు చాళుక్య రెండవ కీర్తివర్మను అధికారం నుండి కూలదోసి, ఆధునిక కర్ణాటక లోని గుల్బర్గా ప్రాంతం కేంద్రంగా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు.సా.శ. 753 లో దక్షిణ భారతదేశంలో అధికారంలోకి వచ్చిన ఈ వంశం మాన్యఖేటకు చెందిన రాష్ట్రకూటులుగా పేరుబడింది. అదే సమయంలో బెంగాల్ పాల వంశం, మాళ్వాకు చెందిన ప్రతీహార రాజవంశాలు తూర్పు, వాయవ్య భారతదేశంలో బలపడుతున్నాయి. అరబిక్ గ్రంథం, సిల్సిలాత్ అల్-తవారిఖ్ (851), రాష్ట్రకూటులను ప్రపంచంలోని నాలుగు ప్రధాన సామ్రాజ్యాలలో ఒకటిగా పేర్కొంది.
(ఇంకా…)