వికీపీడియా:కొత్తవారికి సహాయం/అవసరమైన వనరులు/తటస్థ దృక్కోణం/విశ్లేషణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మాయాబజార్ వ్యాస విశ్లేషణ[మార్చు]

  • మాయాబజార్ తెలుగు చలనచిత్ర రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఒక సినిమా.
    • అత్యంత ప్రజాదరణ పొందిన సినిమా అన్నది అభిప్రాయం. ప్రజాదరణ అన్నదానికి కొలమానమూ లేదు.
  • ఈ చిత్రం ఆంధ్ర దేశమంతటా 1957, మార్చి 27 వ తేదీన విడుదలై అద్భుత విజయం సాధించింది.
    • ఆంధ్రదేశమంతటా అంటే ఎన్ని కేంద్రాలు? అద్భుతం, అపురూపం వంటి పదాలు కేవలం ప్రశంసలు, వీటిని పీకాక్ టర్మ్స్ అంటారు. వీటిని వాడకూడదు.
  • 2017 మార్చి నాటికి 60 ఏండ్లు పూర్తిచేసుకొన్న ఈ సినిమాపై వివిధ టెలివిజన్ ప్రసార వాహినులు (ఛానళ్ళు), వార్తా పత్రికలు ప్రముఖంగా ప్రత్యేక వ్యాసాలు అందించాయి.
  • షావుకారు, పాతాళభైరవి, మిస్సమ్మ, జగదేకవీరుని కథ, గుండమ్మ కథ లాంటి జనరంజక చిత్రాలను నిర్మించిన విజయా సంస్థ తెలుగు సినీ అభిమానులకందించిన మరొక అపురూప కళాఖండం ఇది.
    • కళాఖండం వంటి పదాలు కూడా నేరుగా వికీపీడియా వ్యాసమే చెప్పకూడదు. ఎవరైనా విశ్లేషకుడు కళాఖండం అన్నట్టు మూలాలు, ఆధారాలతో చెప్పవచ్చు కానీ నేరుగా వికీపీడియానే చెప్పడం సరికాదు.
  • భక్త పోతన, యోగి వేమన, గుణసుందరి కథ, పాతాళ భైరవి, దొంగరాముడు మొదలగు చిత్రములను రూపొందించిన కె వి రెడ్డి ఈ చిత్రానికి కూడా దర్శకుడు.