వికీపీడియా:తెలుగు వికీపీడియన్ల విజయనామ ఉగాది సమావేశం 2013

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సామల రమేష్ బాబు వికీ చైతన్యవేదికలో తెలుగు భాషపునరుద్ధరణకు చేపట్టుతున్న చర్యలను వివరించుతూ

తెలుగు వికీపీడియన్ల విజయనామ ఉగాది ఉత్సవాల ఏర్పాటు సంకల్పం మల్లాది గారిది. ఆయన సంకల్పం కార్యరూపందాల్చడానికి రాశేఖగారి స్పందన సహకారం తోడ్పాటు అందించింది. భాస్కరనాయుడు గారు, జె.వి.కె.ఆర్ ప్రసాద్ వంటి సభ్యులు ఆసక్తితో కామేశ్వరరావుగారితో వారి కార్యాలయానికి వెళ్ళి సంప్రదించడం మరింత ఉత్సాహం ఇచ్చింది. మెల్లగా ఒక్కరొక్కరుగా సభ్యులు ఈ సమావేశాలకు ఆసక్తితో మద్దతు పలకడంతో సమావేశం జరపాలన్న నిర్ణయం ఖరారైంది. సి.ఐ.ఎస్ ఏ2కె ప్రణాళిక డైరెక్టర్ విష్ణువర్ధన్ గారి హైదరాబాద్ రాక వారందించిన సహకారంతో సమావేశం జీవం పోసుకుంది. విష్ణువర్ధన్ గారి మిత్రులు "థియేటర్ ఔట్రీచ్ యూనిట్‌" ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పెద్ది రామారావు గారు గోల్డెన్ త్రెషోల్డ్ లో ఉన్న వారి కార్యాలయంలో ఈ సమావేశాలకు అవసరమైన కార్యవర్గ సమావేశాలకు సహకారం అందించడం ఈ సమావేశానికి ఎంతో తోడ్పడింది. ఇక్కడ కామేశ్వరరావు గారు, రాజశేఖర్ గారు ప్రతివారం సమావేశాలకు హాజరు కావడం హైదరాబాద్ సభ్యులైన సి.బి రావు, భాస్కరరెడ్డి, వీవెన్, రహ్మానుద్దీన్, జె.వి.ఆర్.కె ప్రసాద్ గార్లు తమ సహకారం అందించడం గుర్తించతగిన విశేషం. నాటకరంగ పరిశోధన చేస్తున్న విద్యార్ధి ప్రణయ్ రాజ్ చివరి సమావేశం వరకు అలుపెరగని సహకారం అందించారు. తెలుగు వికీపీడియా అధికారి అర్జునరావుగారు ఈ సమావేశాల రూపకల్పనకు తనకే ప్రత్యేకమైన శైలిలో అంతర్జాల సమావేశాల వంటివి నిర్వహించి ఈ సమావేశాలకు చక్కటి రూపకల్పన చేసారు. ఇలా క్రమంగా 10,11 తేదీలలో సమావేశం రూపకల్పన జరిగింది. ఈ సమావేశానికి అవసరమైన బాడ్జులను విశ్వనాధ్ గారు తయారు చేయించి తనవంతు సహకారం అందించారు.

సమావేశాల ఆరంభం[మార్చు]

గోల్డెన్ త్రెషోల్డ్,(కవికోకిల సరోజినీదేవి హైదరాబాద్ నివాసం) మహోత్సవానికి వేదిక

వికీపీడియన్లకు ఏర్పాటు చేసిన సాయి ప్రకాష్ హోటల్ నుండి 9.30 గంటలకు చెన్నై వికీపీడియన్ రాజాచంద్రతో కలిసి గోల్డెన్ త్రిషోల్డ్ చేరుకున్నాము. గేటు వెలుపల అప్పుడే వచ్చిన వై.వి.ఎస్ రెడ్డిని కలిసి ఆయనతో మాట్లాడి ఆయనను హోటల్‌కు వెళ్ళి ఫ్రెష్ అప్ అయిరమ్మని పంపి లోపలకు చేరుకున్నాం. అప్పటికే కామేశ్వరరావు, రాజశేఖర్ , అర్జునరావు గారూ, కార్యక్రమ నిర్వాహకులైన అభిజిత్, పెద్ది రామారావు గార్లు మొదలైన వారు సమావేశ స్థలానికి చేరుకున్నారు. ఒక్కొక్కరుగా అందరినీ పరిచయం చేసుకుని మాకు ఏర్పాటు చేసిన కార్యాలయంలో అందరం ఆశీనులమయ్యాం. సభ్యులందరిలో మొదటిసారిగా ఒకరిని ఒకరు కలుసుకోవడం అందరికీ ఆనందగా ఉంది. ప్రసాదుగారు అందరికీ బాడ్జీలు, ఆహ్వానపత్రిక ప్రతి, చిన్న నోటుబుక్, పెన్ను అందించారు. ఇంతలో ప్రసార మాధ్యమాల (మీడియా) సదస్సు కొరకు ఏర్పాటు చేసిన హాలు సిద్ధం అయిందని చెప్పడంతో అందరం అక్కడకు చేరుకున్నాం.

ప్రసార మాధ్యమాల (మీడియా) సదస్సు[మార్చు]

బండారు శ్రీనివాసరావు గారితో వికీపీడియన్లు
మిత్రుడు మల్లాది కామేశ్వరావుతో బండారు శ్రీనివాసరావు
పాత్రిరుకేయులు బండారు శ్రీనివాస రావు, ఆంధ్రజ్యోతి అంతర్జల ఏడిటర్ జగన్, కార్య నిర్వహకులు అభిజిత్

ప్రసారమాధ్యమాల సదస్సులో పాల్గొనడానికి పాత్రికేయులు విమర్శకులు అయిన బండారు శ్రీనివాసరావు, హైదరాబాద్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ రామకృష్ణ రామస్వామి, ఆంద్ర్హజ్యోతి ఇంటర్నెట్ ఎడిటర్ జగన్ గార్లు ఈ సమావేశానికి ఆహ్వానం మీద విజయంచేసారు. హెచ్.ఎం టివి, 10 టి.వి ప్రతినిధులు కూడా సమావేశానికి హాజరయ్యారు. తరువాత అర్జునరావుగారు ప్రొజెక్టర్ సాయంతో వెన్న నాగార్జునరావు గారి సందేశం ప్రసారంచేసారు. తెలుగు వికీపీడియాను ప్రారంభించిన వెన్ననాగార్జునగారి వీడియో సందేశం లభించడం ఈ సమావేశంలో ఒక ప్రధానాంశం. తరువాత ఆహ్వానితులు ఒక్కొక్కరుగా వారి ప్రసంగాలను సాగించారు. తరువాత వికీపీడియన్లు ఒక్కొక్కరుగా వికీపీడియా అనుభవాలను అవసరాన్ని చెప్తూ ప్రసంగించారు. తెలుగు వికీపీడియా అధికారి అర్జునరావు గారూ వికీపీడియాను గురించి ప్రంజంటేషన్ అందిస్తూ ప్రసంగించారు. విష్ణువర్ధన్ గారు ఏ2కె గురించి వారి భవిష్యత్తు ప్రణాళిక గురించి వివరించారు. రహ్మనుద్దీన్ సాంకేతిక వివరాలను వివరించారు. కామేశ్వరరావు గారి కోరిక మీదట బండారు శ్రీనివాసరావుగారు మరియు జగన్ గార్లు వారి పత్రికా రంగ అనుభవంతో వికీపీడియాలో వ్రాయవలసిన శైలి గురించి వివరించారు. అలాగే ఇప్పుడు వ్రాస్తున్న శైలిలో లోపాలు వాటిని ఎలా సవరించాలి అన్నది వివరించారు. ఇది తెలుగు వికీపీడియన్లకు ఉపకరించే విషయం. ఇలా మధ్యాహ్నం భోజన సమయం వరకు సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సమావేశానికి మల్లది కామేశ్వరరావుగారి భార్య , కుమారుడు హాజరుకావడం వారి కుమారుడు ప్రసంగించడం విశేషం.అందరూ భోజనం చేయడానికి కిందికి వెళ్ళాం.

భోజన వేళలో[మార్చు]

భోజనవేళలో ప్రత్యేకత ఏముంది ? నిజమే వికీపీడియన్ల భోజన వేళలు ఉత్సాహభరితంగా గడిచాయి. భోజన సమయంలో కూడా వికీపీడియా చర్చలు పరిచయాలతో ఆసక్తి కరంగా సాగాయి. మద్యాహ్న భోజనాలు, ఉదయం, సాయంకాలం తెలుగువికీ సంస్థ ఏర్పాటు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరిగాయి. మొదటిరోజు రాత్రి భోజన సమయంలో హోటల్ వారి సహాయంతో చిన్న సైజు కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకుని భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చలు సాగించడం వికీపీడియన్ల ఆసక్తికి తార్కాణం. మరుసటి రోజు భోజన సమయానికి మల్లాది కామేశ్వరరావు గారి సతీమణి, కుమారునితో పలకరింపులతో ఆసక్తి కరంగా సాగింది. ఇలా పూర్తి రెండు రోజులు వికీ సంస్థ ఏర్పాట్లలో వికీపీడియన్లు అందరితో కలిసి ఆహారం తీసుకోవడం కూడా ఆహ్లాదం కలిగించింది.

హెచ్.ఎం టి.వి సందర్శనం[మార్చు]

మొదటి రోజు భోజనం తరువాత ముందే నిర్ణయించుకున్నట్లు క్షేత్రదర్శనం చేయడానికి బయలు దేరాము. క్షేత్రదర్శనానికి అవసరమైన మినీ బస్ ఏర్పాట్లు రాజశేఖర్ గారు చేశారు. అందరం మినీ బస్‌లో వెళ్ళే సమయంలో సభ్యుల వికీ రచనల గురించి ఇష్టాగోష్టి తరహాలో మాట్లాడుకున్నాం. సభ్యులందరూ ఒకరితో ఒకరు అరమరికలు లేకుండా మాట్లాడుకున్నారు. చూడడానికి నిజమైన వికీ కుటుంబం అనిపించింది. ఇలా ప్రయాణించి హె.ఎం టి.వి ప్రాంగణంలో ప్రవేశించాం. లోపలకు వెళ్ళే సమయంలో వారి సూచన అనుసరించి సెల్ ఫోన్లు మాత్రమే ఆఫ్ చేసాం. కెమేరాలు మాత్రం మాతో తీసుకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. టి.వి సిబ్బంది సహకారంతో టి.వి కార్యాలయం అంతా తిరిగి చూపించారు. అంతా చూసిన తరువాత మేనేజింగ్ డైరక్టర్ గారి పరిచయం ముచ్చట్లు అరగంటకు పైగా జరిగింది. నా వంటి వికీపీడియన్లకు ఇలాంటివి మహత్తర అవకాశం. ఇందుకు అవకాశం కలిగించిన కామేశ్వరావుగారికి ప్రత్యేక కృతజ్నతలు. మా సమయం దాదాపు అక్కడే సరిపోయింది కనుక ముందు అనుకున్నట్లు విశాలాంధ్ర కార్యాలయం చూడడానికి సమయం చాలదని తిరిగి వెళ్ళాం. అందరం కలిసి రాత్రి వేళ భోజనం చేయడానికి హోటల్‌కు చేరుకుని భవిష్య ప్రణాళికల గురించి చర్చిస్తూ భోజనాలు చేసాం. అందరిలో పొడచూపిన అలసట మరిచి తిరిగి గోల్డెన్ త్రిషోల్డ్ చేరుకున్నాం.

మరునాటి కార్యాక్రమాల చర్చ[మార్చు]

మరునాటి కార్యక్రమాల గురించి చర్చ
ఇష్టాగోష్టిలో వికీపీడియన్లు

రాత్రి భోజనం తరువాత మరునాటి సమావేశం గురించి ముచ్చటించుకున్నాం. చర్చలు సరదా వాతావరణంలో కొనసాగాయి. వికీపీడియాలో వ్రాయడం మరి కొన్ని సమస్యల గురించి చర్చ మొదలైనా వాటిని మరునాటికి వాయిదా వేసుకున్నాం. మరునాడు వికీపీడియన్ల పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిర్ణయం జరిగింది. అర్జునరావుగారు మరునాడు " భారత ప్రగతి ద్వారం నిర్వహణ అనుభవాలు. ఇండియా డెవలప్‌మెంట్ గేట్‌వే" నుండి విజయలక్ష్మి వస్తారని వారి అనుభవాలు మాతో పంచుకుంటారని ప్రకటించారు. అలాగే సమావేశానికి హాజరు కాలేక పోయిన వైజాసత్యగారు అంతర్జాలం ద్వారా వికీపీడియన్లతో ముచ్చటిస్తారని చెప్పారు. రేపటి చైతన్య వేదికలో మాట్లాడ వలసిన విషయాలు చర్చించుకున్నాం. అన్నింటి గురించి నిర్ణయానికి వచ్చిన తరువాత విశ్రాంతి కొరకు మా విడిదికి చేరుకున్నాం.

వికీపీడియా సర్వసభ్య సమావేశం[మార్చు]

ఉగాది రోజు అల్పాహారం అయిన తరువాత సమావేశానికి హాజరు అయ్యాము. హైదరాబాదు నివాసి రాజాచంద్రగారి మిత్రులు సభ్యులందరికీ ఉగాది పచ్చడి తీసుకువచ్చి వినియోగం చేసారు. ముందుగా వికీపీడియా అధికారి మార్గదర్శి అయిన వైజాసత్య గారితో అంతర్జాలం ద్వారా సభ్యులందరం పరస్పర పరిచయాలు వంటివి చేసుకుని ముచ్చటించాం. తరువాత వారి సలహాలు తీసుకున్నాం. తరువాత ఆర్కివ్ ఉద్యోగి బెంగుళూరు వాసి అర్జునరావుగారి మిత్రుడైన చిట్టిపోతు ఆనంద్ గారు స్కైప్ ద్వారా ప్రసంగించారు. చివరిగా విజయలక్ష్మి గారు ఇండియా డెవలప్‌మెంట్ గేట్‌వే నిర్వహణ అనుభవాల గురించి ఆంగ్లంలో ప్రసంగించారు. తరువాత టీ బ్రేక్ తీసుకున్నాం.

టీ బ్రేక్ తరువాత సభ్యులందరూ పరిచయాలు చేసుకున్నారు. ఈ సమావేశానికి మల్లది కామేశ్వరరావుగారు సమన్వయ కర్తగా వ్యవహరించారు. తరువాత అర్జునరావుగారు వికీపీడియా అకాడమీలు, సమావేశాలు మరికొన్ని విషయాలు వివరణాత్మకంగా వివరించారు. విష్ణువర్ధన్‌గారూ ఏ2కె కార్యక్రమాలు భవిష్యత్తు ప్రణాళికలు భారతీయ వికీల అభివృద్ధి ఇతర విషయాలు వివరణాత్మకంగా వివరించారు. సభ్యులు వికీమీడియా సభ్యత్వం ఫారం పూర్తి చేసి సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వ గడువు సాధ్యాసాధ్యాలు గురించి చర్చలు కొనసాగినా ఒక నిర్ణయానికి రాలేక పోయారు. చివరిగా భారతీయ వికీపీడియాల గురించి సౌమ్యన్ గారు ప్రసంగించారు. మద్యాహ్న భోజన సమయం వరకు సమావేశం కొనసాగింది.

వికీపీడియన్ల ఇష్టాగోష్టి[మార్చు]

ఇష్టాగోష్టి సమయంలో ముఖ్య అతిథుల రాక


కామేశ్వరావుగారి సలహాను అనుసరించి వీకీపీడియన్లు సమస్యా పరిష్కారం మరియు భవిష్యత్తు ప్రణాళికలు మరియు వికీపీడియా అభివృద్ధి గురించి చర్చించాలని అనుకున్నాం. అలాగే చిన్న తరహా వికీపీడియా అకాడమీ జరపాలని నిశ్చయించుకున్నాము. ఆసక్తి కలిగిన కొత్త సభ్యులకు అకాడమీ నిర్వహించే బాధ్యత రాధాకృష్ణగారు తీసుకున్నారు. వారికి సహాయంగా రాజాచంద్ర వెళ్ళారు. మిగిలిన సభ్యులందరూ ఇష్టాగోష్టిలో పాల్గొనడానికి వేరొక చోట చేరాం. సమన్వయకర్తగా రహ్మానుద్దీన్ ఉన్నారు. ముందుగా సమస్యల గురించి, సందేహాల గురించి చర్చ జరిగింది. సభ్యులు తమ సమస్యలు, సందేహాలు గురించి ప్రస్తావించారు. సమయాభావం కారణంగా పరిష్కారాల గురించిన విస్తృత చర్చ జరగలేదు. రచ్చబండలో విస్తృత చర్చలు జరిగిన తరువాత పరిష్కారం గురించి ఆలోచించాలని నిశ్చయించారు. తరువాత సభ్యులు వికీపీడియా అభివృద్ధికి, భవిష్య ప్రణాళికలకు మరియు కొత్త సభ్యులను చేర్చడం వారికి అవసరమైన సహాయం అందించడం వంటి ఉపయుక్తమైన సూచనలు చేసారు. చైతన్య వేదికకు సమయం దగ్గర పడుతున్న కారణంగా చర్చలకు ముగింపు పలికి టీ బ్రేక్ కొరకు వెళ్ళాం. ఈ కార్యక్రమ నిర్వహణకు రహ్మానుద్దీన్ కనబరచిన చాకచక్యం, విష్ణువర్ధన్ గారి సహకారం ప్రశంశనీయం. చర్చలో అనాధ పేజీల సంస్కరణ, గ్రామాల పేజీల అభివృద్ధి మరియు తెలుగు ప్రముఖుల వ్యాసాల అభివృద్ధి గురించి కొంత వరకు నిర్ణయానికి వచ్చారు. సమావేశం తరువాత ఆ దిశలో జరుగుతున్న మార్పులు అందుకు నిదర్శనం.

చైతన్య వేదిక[మార్చు]

కోదండరామయ్యగారి ప్రసంగం
ఆదిత్య ప్రసాదుగారికి వికీపీడియా స్మృతిచిహ్నం బహూకరణ

టీ బ్రేక్ తరువాత మీటింగ్ హాలుకు వచ్చేసమయానికి ఆల్‌ ఇండియా రేడియో డైరెక్టర్ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారు, తెలుగు భాషోద్యమ సమాఖ్య నుండి సామల రమేష్ బాబు, కోదండ రామయ్య గార్లు సమావేశంలో పాల్గొనడానికి విచ్చేసారు. కామేశ్వరరావు గారు వారితో వికీపీడియన్లకు పరస్పర పరిచయాలు చేసారు. తరువాత సమావేశం హాలు సిద్ధం అయిందని తెలియగానే అందరం సమావేశం జరిగే ప్రదేశానికి చేరుకున్నాము. సమావేశానికి సమంవయ కర్తగా కామేశ్వరరావు గారు పనిచేసారు. ముందుగా అతిధులకు అర్జునరావుగారు తదితరులు వికీపీడియా టీ షర్ట్లు, మెమొంటోలు సమర్పించారు. తరువాత ముఖ్య అతిథులచేత వికీపీడియన్లకు కొందరికి మెమొంటోలు, ప్రశంశా పత్రాలు ఇప్పించారు. తరువాత మంళగిరి ఆదిత్య ప్రసాదు గారు అంతరించిపోతున్న తెలుగు గురించి ప్రసంగించారు. ప్రసంగంలో వారు ఆలపించిన శ్రావ్యమైన పద్యాలు వికీపీడియన్లకు ఒక అపురూప కానుక అని చెప్పాలి. తరువాత సామల రమేష్ బాబుగారు తెలుగు భాషాభివృద్ధికి వారు రాష్ట్ర సరిహద్దులు దాటి వారు చేస్తున్న కృషి, దేశమంతటా విస్తరించి ఉన్న తెలుగు వారి గురించి ప్రసంగించారు. వారి వద్ద తెలుగు నేర్చుకున్న వేలూరుకు చెందిన రీశర్చ్ విద్యార్ధి సమావేశంలో పాల్గొని ప్రసంగించడం వారి కృషికి తాత్కాణం. తెలుగు భాషోద్యమ సమాఖ్య నుండి విచ్చేసిన కోదండరామయ్య గారు తెలుగుమాట లోని అందాలు మరియు భారతీయ భాషల్లో తెలుగు భాష ప్రత్యేకతకున్న ప్రత్యేకత గురించి ఆసక్తికరమైన ప్రసంగం చేసారు. నిజం చెప్పాలంటే వారి ప్రసంగాలు గంటల తరబడి వినతగినవి. అయినప్పటికీ సమయాభావం వలన కొనసాగించడానికి వీలు లేక పోవడం విచారకరం. వారి ప్రసంగాల తరువాత మిగిలిన వికీపీడియన్లకు మెమొంటోలు, ప్రశంశా పత్రాలు ముఖ్య అతిథుల చేతుల మీదుగా వికీపీడియన్లకు ఇవ్వబడ్డాయి. తరువాత వికీపీడియన్లు అందరూ సంక్షిప్తంగా ఉపన్యసించారు. చివరగా రాజశేఖర్ గారి వందన సమర్పణతో సమావేశం ముగిసింది. ఇలా రెండు రోజుల కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. చైతన్య వేదికకు విష్ణువర్ధన్ గారి చెల్లెలు, అమ్మగారు, తమ్ముడు రావడం ప్రత్యేకత.

ఈ సమావేశం మరికొన్ని విశేషాలు[మార్చు]

సమావేశం విజయవంతం కావడానికి సహకరించిన ముఖ్యులు.

  • ఈ సమావేశం వికీపీడియన్లను ఒక వేదిక మీదకు తీసుకు వచ్చింది. ఒకరితో ఒకరు నేరుగా మాట్లాడడం ముచ్చటించుకోవడం వంటివి సభ్యులలో నూతనోత్సాహం కలిగించింది.
  • ఈ సమావేశం జరిగిన రెండు రోజులలో ప్రతి నిమిషం చక్కగా ఉపయోగించబడింది. ఇక్కడ జరిగిన చర్చలు తెలుగు వికీపీడియా అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఇందుకు మాల్లాది గారికి ప్రత్యేక

ప్రశంశలు చెప్పక తప్పదు.

  • ఈ సమావేశం సందర్భంలో ఆక్సెస్ టు నాలెడ్జ్ సి.ఐ.ఎస్ ఏ2కె వారు భారతీయ వికీఅభివృద్ధి కొరకు చేస్తున్న కృషి గురించి తెలుగువికీ పీడియన్లకు అవగాహన కలిగింది. ఇందుకు విష్ణువర్ధన్ గారిని ప్రశంసించాలి.
  • సమావేశం సంకల్పించిన రోజు నుండి హైదరాబాదు కార్యవర్గ సభ్యులు కృషి ప్రశంశ నీయం. ఇందుకు మల్లదిగారిని, రాజశేఖర్ గారిని ప్రత్యేకంగా ప్రశంసించాలి. వారికి అవిశ్రాంతంగా సహకరించిన రహ్మానుద్దీన్ మరియు ప్రణయరాజ్ ప్రత్యేక ప్రశంశలకు అర్హులే.
  • సి.బి రావుగారు, వేవెన్ , గుళ్ళపల్లి నాగేశరరాబు, జె.వి.ఆర్.కె ప్రసాద్, భాస్కర నాయుడు, శర్మ తదితరులు ముందస్థు సమావేశాలలో పాల్గొని సమావేశానికి తమవంతు తోడ్పాటు అందించినందుకు వీరికి ధన్యవాదాలు.
  • అనేక పనుల వత్తిడి మధ్యలో తెలుగు వికీపీడియా అధికారి సమావేశానికి మరింత బలం చేకూర్చింది. వారి రాక సమావేశానికి అత్యవసరం.
  • సమావేశానికి కావలసిన ప్రదేశం ఇతర సౌకర్యాలు కల్పించడమే కాక సమావేశాలలో పాల్గొని ఉత్సాహం అందించిన పెద్ది రామారావుగారికి మనఃపూర్వకమైన కృతజ్నతలు చెప్పాలి.
  • విదేశాలలో ఉన్న కారణంగా సమావేశానికి హాజరు కాలేని వైజాసత్యగారు, వెన్న నాగార్జునగారు అన్నది ఒక లోటు అనక తప్పదు. అంతర్జాలం ద్వారా సంభాషించి అధికారి అయిన రవి వైజాసత్యగారు, వీడియో సందేశం పంపి వెన్ననాగార్జునగారూ ఆ లోటు భర్తీ చేసారు.
  • ఈ సమావేశం వ్యక్తిగత కారణాల వలన వికీపీడియాకు దూరమైన వికీపీడియన్లను తిరిగి వికీపీడియాకు చేరువ చేసింది. సభ్యులలో నూతన ఉత్సాహం నింపి మరింత అధికంగా ప్రణాళికా బద్ధంగా పనిచేసేలా చేసింది.

వెలుపలి లింకులు[మార్చు]