వికీపీడియా:తెలుగు వికీపీడియా కరదీపిక/వికిమీడియా ఫౌండేషన్ పరిచయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీమీడియా ఫౌండేషన్

[మార్చు]
వికీమీడియా ఫౌండేషను

వికీమీడియా ఫౌండేషన్ 2003 జూన్‌లో అమెరికాలో స్థాపించబడిన లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థ. ప్రపంచం నలుమూలల నుండి సేకరించే విరాళాల ద్వారా ఈ సంస్థ పనిచేస్తుంది. విశ్వం లోని విజ్ఞానాన్ని ప్రపంచం లోని ప్రజలందరికీ స్వేచ్ఛగా, ఉచితంగా అందుబాటులోకి తేవడం దాని ప్రధాన లక్ష్యం. ఇందుకోసం పలు విజ్ఞాన సర్వస్వ ప్రాజెక్టులను నెలకొల్పింది. ఈ ప్రాజెక్టులను నడీపేందుకు మీడియావికీ అనే నాలెడ్జి మేనేజిమెంటు సాఫ్టువేరును అభివృద్ధి చేసి, దాన్ని ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. ఫౌండేషను, ఈ సాఫ్టువేరును నిరంతరం మెరుగుపరుస్తూ, కొత్త కొత్త అంశాలను ప్రవేశపెడుతూ ఉంటుంది. ఈ సాఫ్టువేరును ఉచితంగా డౌన్‌లోడు చేసుకుని ఎవరైనా తమ స్వంత వికీ వెబ్‌సైటును నెలకొల్పుకోవచ్చు. వికీమీడియా ఫౌండేషను ఈ సాఫ్టువేరును అభివృద్ధి చెయ్యడమే కాకుండా, దాని ఆధారంగా పలు విజ్ఞాన సర్వస్వ ప్రాజెక్టులను నిర్మించింది. వికీపీడియా, వికీసోర్సు, విక్షనరీ, వికీకామన్స్, వికీడేటా వంటి పలు ప్రాజెక్టులను వందలాది భాషలలో స్థాపించి, నిర్వహిస్తూ వాటి పురోగతికి కృషిచేస్తోంది.

మీడియావికీ సాఫ్టువేరు

[మార్చు]

ఫౌండేషను కార్యకలాపాల్లో మీడీయావికీ సాఫ్టువేరు అభివృద్ధి ఒక ప్రధానమైన అంగం. ఈ సాఫ్టువేరును ఎవరైనా ఉచితంగా డౌన్‌లోడు చేసుకుని వాడుకోవచ్చు. పాఠకులే రచయితలై కలిసిమెలిసి (కొలాబొరేషను పద్ధతిలో) కంటెంట్ మేనేజిమెంట్ వెబ్‌సైట్లను అభివృద్ధి చేసుకోవడం ఈ సాఫ్టువేరు ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు ఈ సాఫ్టువేరు ద్వారా తమ ఉత్పత్తులు, సేవలకు సంబంధించిన సమాచారాన్ని ఈ సాఫ్టువేరు ద్వారా అందిస్తున్నారు. తెలుగుతో సహా 400 కు పైగా భాషల్లో ఈ సాఫ్టువేరు అందుబాటులో ఉంది. నేరుగా అనేక లక్షల వెబ్‌సైట్లు ఈ సాఫ్టువేరుపై ఆధారపడి ఉండగా, వెబ్‌సైట్లను హోస్టు చేసే వివిధ హోస్టింగు సైట్లు కూడా ఈ సాఫ్టువేరును స్థాపించుకుని వాటిపై 75 వేల వెబ్‌సైట్లను హోస్టు చేస్తున్నాయి. వీటిలో ఫౌండేషను స్వయంగా నిర్వహిస్తున్న 900 సైట్లు కూడా భాగం.

ఈ సైట్లలో 125 కోట్ల పేజీలు పాఠకులకు అందుబాటులో ఉన్నాయి. 120 కోట్ల వాడుకరులు నమోదై ఉన్నారు. 43 లక్షల మందికి పైగా రోజూ ఈ సైట్లలో సమాచారం చేరుస్తూంటారు. 20 కోట్లకు పైగా ఫొటోలు, చిత్రాలు, ఇతర ఫైళ్ళూ ఉన్నాయి.

ఫౌండేషను స్థాపించిన వికీ ప్రాజెక్టులు

[మార్చు]

మీడియావికీ సాఫ్టువేరును అభివృద్ధి చెయ్యడంతో పాటు, ఆ సాఫ్టువేరు పునాదులపై అనేక విజ్ఞానసర్వస్వ వెబ్‌సైట్లను కూడా ఫౌండేషను నిర్వహిస్తోంది. వీటిలో వికీపీడియా మొదటిది, అత్యంత ప్రసిద్ధి పొందినదీ, అత్యంత ప్రజాదరణ పొందినదీను. ఇది 352 భాషలలో 6 కోట్ల పైచిలుకు వ్యాసాలతో ప్రపంచంలో కెల్లా అత్యంత ప్రజాదరణ పొందిన అన్ని రకాల వెబ్‌సైట్లలో 7 వ స్థానంలో ఉంది. ఈ వికీపీడియాల్లో తెలుగు వికీపీడియా లక్షకు పైగా వ్యాసాలతో 72 వ స్థానంలో, భారతీయ భాషా వికీపీడియాల్లో 5 వ స్థానంలో ఉంది. వికీపీడియాతో పాటు, వికీసోర్సు, వికీకోట్, విక్షనరీ, వికీవాయేజ్, వికీవార్సిటీ, వికీబుక్స్, వికీడేటా, వికీకామన్స్ వంటి అనేక ఇతర వెబ్‌సైట్లను కూడా నిర్వహిస్తోంది.

ఫౌండేషను నిర్వహించే వెబ్‌సైట్లలో నెలకు 2300 కోట్ల పేజీవ్యూలు ఉంటాయి. ఒక్క భారతదేశం లోనే నెలకు అన్ని రకాల వికీలకూ కలిపి 70 కోట్ల పేజీవ్యూలు ఉంటాయి. ఒక్క తెలుగు వికీపీడియాలో నెలకు కోటీ 30 లక్షల పేజీవ్యూలుంటాయి.

ఈ వెబ్‌సైట్లను హోస్టింగు చెయ్యడం, సాంకేతిక నిర్వహణ చెయ్యడం, సాఫ్టువేరును మెరుగుపరచడం వంటివి మాత్రమే ఫౌండేషను బాధ్యత. ఈ ఖర్చుల కోసం విరాళాలు సేకరిస్తుంది. ఫౌండేషను నిర్వహించే ఏ వెబ్‌సైట్లలోనూ వ్యాపార ప్రకటనలుండవు. మీడియావికీ సాఫ్టువేరుతో సహా ఫౌండేషను అభివృద్ధి చేసి నిర్వహించే ఉత్పత్తులు సేవలూ అన్నీ ఉచితమే, సార్వజనీనమే, ఎవరైనా స్వేచ్ఛగా వాడుకోవచ్చు. ఎంత స్వేచ్ఛ అంటే, వికీపీడియా లోని సమాచారాన్ని ఉచితంగా డౌన్‌లోడు చేసుకుని వాటిని పుస్తకాలుగా ముద్రించి అమ్ముకోవచ్చు. ఈ సమాచారాన్ని వికీపీడియా నుండి సేకరించామని వెల్లడిస్తే చాలు. విరాళాల ద్వారా అందే సొమ్ము నుండి కొంత భాగాన్ని వివిధ ప్రాజెక్టుల్లో వాడుకరులు చేపట్టదలచిన ప్రత్యేక ప్రాజెక్టులు, సమావేశాలు, గోష్ఠులు, వగైరాల కోసం గ్రాంటులుగా అందిస్తుంది.

వీటిలో చేర్చే సమాచారంపై ఫౌండేషనుకు ఎలాంటి నియంత్రణా లేదు. సమాచారాన్నంతా స్వచ్ఛందంగా పనిచేసే వాడుకరులే పరస్పరం సహకరించుకుంటూ, సంప్రదించుకుంటూ సమాచారం చేరుస్తారు. ఈ వాడుకరులందరినీ కలిపి సముదాయం అంటారు. సమాచారపు ఎంపిక, విశ్వసనీయత, కాపీహక్కుల పాలన, వాడుకరుల పరస్పర వ్యవహార సరళి వంటి పలు అంశాలకు సంబంధించి ఈ సముదాయాలే నియమ నిబంధనలను ఏర్పరచుకుని పనిచేస్తాయి. ఈ వెబ్‌సైట్లలో సమాచారాన్ని చేర్చే వాడుకరులకు కూడా ఈ సమాచారంపై ఏ హక్కూ ఉండదు. ప్రచురితమైన సమాచారమంతా సర్వ మానవాళికీ చెందుతుంది.

2022 లో ఫౌండేషను వికీమీడియా ఎంటర్‌ప్రైస్ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. దీనిద్వారా వికీ ప్రాజెక్టుల్లో ఉచితంగా లభించే సమాచారాన్నే సంస్థలు నేరుగా పెద్దయెత్తున API ల ద్వారా అందుకునే సౌలభ్యాన్ని కల్పించింది. ఫౌండేషను ఈ సేవను ఉచితంగా ఇవ్వదు, విక్రయిస్తుంది. గూగుల్ వంటి సంస్థలు దీన్ని వాడుకుంటున్నాయి.

ఫౌండేషన్ చరిత్ర

[మార్చు]

వికీమీడియా ఫౌండేషన్ [1] జూన్ 2003లో ప్రారంభించబడింది. వికీపీడియా వ్యవస్థాపకులలో ఒకరైన జిమ్మీ వేల్స్, తన సంస్థ ద్వారా ప్రారంభించిన వికీపీడియా, ఇతర సోదర ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను దీనికి అప్పగించాడు. బహుభాషలలో విజ్ఞాన సర్వస్వాలు, సోదర ప్రణాళికల పెంపు, అభివృద్ధి, వీటిలో సమాచారాన్ని ఉచిత పంపిణీ చేయటం దీని ముఖ్యోద్దేశం. దీని నిర్వహణకు ధర్మకర్తల (ట్రస్టీల) మండలి ఉంది. ఇది మూడు చోట్ల కొన్ని వందల కంప్యూటర్ సర్వర్లు నడుపుతూ, ఈ ప్రాజెక్టులను వీక్షించే దాదాపు నెలసరిగా అరకోటి ప్రజలకు సేవలందిస్తున్నది. దాదాపు 38 స్వతంత్ర స్థానిక వికీమీడియా సంఘాలతో, ఔత్సాహిక స్వచ్ఛంద కార్యకర్తలతో సమన్వయం చేస్తూ ప్రజల నుండి, సంస్థలనుండి ధన, వనరుల సేకరణ, ప్రాజెక్టులలో వాడబడే మీడియావికీ సాఫ్ట్వేర్ నిర్వహణ, అభివృద్ధి చేస్తుంది. అవగాహన పెంచే కార్యక్రమాలు, కొత్త వాడుకరుల సంఖ్యను అభివృద్ధి చేయటం, మొబైల్, జాలసంపర్కంలేని పద్ధతులలో వికీ ప్రాజెక్టుల సమాచారాన్ని అందచేయటం, శిక్షణా వీడియోలు తయారి, ప్రాజెక్టుల గణాంకాలలో మార్పులను విశ్లేషించి కొత్త తరహా ప్రాజెక్టులను చేపట్టటం, దీని ఇతర కార్యక్రమాలు.

వికీమీడియా సంఘాలు

[మార్చు]
వికీమీడియా భారతదేశం చిహ్నం
వికీపీడియా అవగాహన సదస్సు

వికీమీడియా సంఘాలు (చాప్టర్లు) ఒక దేశం ప్రాతిపదికగా వికీమీడియా ప్రాజెక్టుల పురోగతికి స్థాపించబడిన లాభాపేక్షరహిత స్వతంత్ర సంస్థలు. ఇవి వికీమీడియా ఫౌండేషన్ తో ఒప్పందం ప్రకారం సహకరించుకుని పనిచేస్తాయి.

వికీమీడియా భారతదేశం

[మార్చు]

భారతదేశంలో ఈ వికీమీడియా చాప్టర్ [2] సంఘం 2011 జనవరి 3 న బెంగుళూరులో నమోదైంది. డిసెంబరు 2011 నాటికి దాదాపు 170 పైగా సభ్యులు నమోదైయ్యారు. సెప్టెంబరు 24 న సర్వసభ్య సమావేశం జరుపుకొని, కార్యవర్గంలో కొత్త సభ్యులను ఎన్నుకుంది. జూలై 30 న నకలుహక్కులు, స్వేచ్ఛా పంపకషరతులు అనబడేదానిపై సదస్సు ఆ తరువాత సెప్టెంబరు 12 న కర్ణాటక రాష్ట్ర ప్రజా గ్రంథాలయాల శాఖ వారికి వికీ అవగాహన కార్యక్రమము నిర్వహించింది. ఇటువంటి కార్యక్రమాలు [3] ఇంకా దేశంలో పలుచోట్ల స్థానిక సభ్యులు లేకఅనుభవజ్ఞులైన వికీపీడియన్ల సహకారంతో నిర్వహించే పనిలో ఉంది.

ముంబయి సముదాయంతో కలసి వికీ కాన్ఫరెన్స్ ఇండియా [4] అనబడే జాతీయ స్థాయి సమావేశాన్ని నవంబరు 18-20, 2011 లలో నిర్వహించింది.

కార్యక్రమాలను మరింత చురుకుగా చేయటానికి, విస్తరించటానికి, కార్యనిర్వహక జట్టులోని సభ్యుల నేతృత్వంలో నగర, భాషా ప్రత్యేక ఆసక్తి జట్టులు, బహుళ వికీ ప్రాజెక్టులన సమన్వయంచేపట్టటం అలాగే రోజు వారి కార్యకలాపాలను సమర్థవంతంగా చేయటానికి నిర్వహణ, ధనసేకరణ, సమాచార, ప్రజాసంబంధాల జట్టులను ఏర్పాటుచేసింది.

అయితే విదేశీ ద్రవ్యం పొందేందుకు అవసరమైన చట్టపరమైన ఇబ్బందుల వలన, నేరుగా, సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ ద్వారా వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలు మరి ఇతరచర్యల వలన వికీమీడియా భారతదేశం బలోపేతం కాలేకపోయింది, ఇతర కారణాలవలన సోదర సంస్థగా కొనసాగుటకు కావలసిన నిబంధనలను పాటించలేకపోయింది. 2019 సెప్టెంబరు 14 నుండి అమలు అయ్యేటట్లు వికీమీడియా భారతదేశం గుర్తింపు వికీమీడియా ఫౌండేషన్ రద్దుచేసింది.[5]

‌‌‌వికీమీడియా ఫౌండేషన్ భారతీయ ప్రణాళికల జట్టు

[మార్చు]

వికీమీడియా ఫౌండేషన్ తన దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా, భారతీయ వికీ ప్రాజెక్టుల [6] అభివృద్ధి వేగవంతం చేయడానికి, కొద్ది మంది ఉద్యోగస్తులను జనవరి 2011లో నియమించటం ప్రారంభించింది. సంవత్సరాంతానికి ఈ జట్టులో భారతీయ ప్రణాళికల సలహాదారు, ఆయనతో పాటు, భారతీయ భాషల సలహాదారు, విద్యా‌విషయక సలహాదారు, అవగాహన సదస్సుల సలహాదారు ఉన్నారు. ఇంకా ప్రజాసంబంధాల సలహదారుని నియమించవలసివుంది. పూనెలో భారతీయ విద్యా ప్రణాళికలో భాగంగా వివిధ కళాశాల విద్యార్థులతో వికీ వ్యాసాల ప్రణాళిక చేపట్టింది. కొంతకాలం తరువాత సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ అనే లాభనిరపేక్షసంస్థ ద్వారా కార్యకలాపాలు కొనసాగించింది.

వనరులు

[మార్చు]
  1. వికీమీడియా ఫౌండేషన్
  2. "వికీమీడియా చాప్టర్". Archived from the original on 2014-10-06. Retrieved 2020-01-08.
  3. "వికీ అవగాహనా కార్యక్రమాలు". Archived from the original on 2012-01-11. Retrieved 2011-09-26.
  4. వికీ కాన్ఫరెన్స్ ఇండియా
  5. "Derecognition of Wikimedia India". Wikipedia Signpost. 2019-07-31. Retrieved 2019-10-22.
  6. వికీమీడియా ఫౌండేషన్ భారతీయ వికీ ప్రాజెక్టులు

వికీమీడియా సంఘాలు

[మార్చు]
వికీమీడియా భారతదేశం చిహ్నం
వికీపీడియా అవగాహన సదస్సు

వికీమీడియా సంఘాలు (చాప్టర్లు) ఒక దేశం ప్రాతిపదికగా వికీమీడియా ప్రాజెక్టుల పురోగతికి స్థాపించబడిన లాభాపేక్షరహిత స్వతంత్ర సంస్థలు. ఇవి వికీమీడియా ఫౌండేషన్ తో ఒప్పందం ప్రకారం సహకరించుకుని పనిచేస్తాయి.

వికీమీడియా భారతదేశం

[మార్చు]

భారతదేశంలో ఈ వికీమీడియా చాప్టర్ [1] సంఘం 2011 జనవరి 3 న బెంగుళూరులో నమోదైంది. డిసెంబరు 2011 నాటికి దాదాపు 170 పైగా సభ్యులు నమోదైయ్యారు. సెప్టెంబరు 24 న సర్వసభ్య సమావేశం జరుపుకొని, కార్యవర్గంలో కొత్త సభ్యులను ఎన్నుకుంది. జూలై 30 న నకలుహక్కులు, స్వేచ్ఛా పంపకషరతులు అనబడేదానిపై సదస్సు ఆ తరువాత సెప్టెంబరు 12 న కర్ణాటక రాష్ట్ర ప్రజా గ్రంథాలయాల శాఖ వారికి వికీ అవగాహన కార్యక్రమము నిర్వహించింది. ఇటువంటి కార్యక్రమాలు [2] ఇంకా దేశంలో పలుచోట్ల స్థానిక సభ్యులు లేకఅనుభవజ్ఞులైన వికీపీడియన్ల సహకారంతో నిర్వహించే పనిలో ఉంది.

ముంబయి సముదాయంతో కలసి వికీ కాన్ఫరెన్స్ ఇండియా [3] అనబడే జాతీయ స్థాయి సమావేశాన్ని నవంబరు 18-20, 2011 లలో నిర్వహించింది.

కార్యక్రమాలను మరింత చురుకుగా చేయటానికి, విస్తరించటానికి, కార్యనిర్వహక జట్టులోని సభ్యుల నేతృత్వంలో నగర, భాషా ప్రత్యేక ఆసక్తి జట్టులు, బహుళ వికీ ప్రాజెక్టులన సమన్వయంచేపట్టటం అలాగే రోజు వారి కార్యకలాపాలను సమర్థవంతంగా చేయటానికి నిర్వహణ, ధనసేకరణ, సమాచార, ప్రజాసంబంధాల జట్టులను ఏర్పాటుచేసింది.

అయితే విదేశీ ద్రవ్యం పొందేందుకు అవసరమైన చట్టపరమైన ఇబ్బందుల వలన, నేరుగా, సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ ద్వారా వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలు మరి ఇతరచర్యల వలన వికీమీడియా భారతదేశం బలోపేతం కాలేకపోయింది, ఇతర కారణాలవలన సోదర సంస్థగా కొనసాగుటకు కావలసిన నిబంధనలను పాటించలేకపోయింది. 2019 సెప్టెంబరు 14 నుండి అమలు అయ్యేటట్లు వికీమీడియా భారతదేశం గుర్తింపు వికీమీడియా ఫౌండేషన్ రద్దుచేసింది.[4]


వనరులు

[మార్చు]
  1. "వికీమీడియా చాప్టర్". Archived from the original on 2014-10-06. Retrieved 2020-01-08.
  2. "వికీ అవగాహనా కార్యక్రమాలు". Archived from the original on 2012-01-11. Retrieved 2011-09-26.
  3. వికీ కాన్ఫరెన్స్ ఇండియా
  4. "Derecognition of Wikimedia India". Wikipedia Signpost. 2019-07-31. Retrieved 2019-10-22.