Jump to content

వికీపీడియా:దశాబ్ది ఉత్సవాల వికీమీడియా పురస్కార ఎంపిక/మొదటి స్కైప్ సమావేశం నివేదిక

వికీపీడియా నుండి

తేది సమయం

[మార్చు]

29నవంబర్ 2013, భారత కాలమానం 1300 నుండి 1415

హాజరయినవారు

[మార్చు]

సమావేశ సారాంశం

[మార్చు]
  1. ప్రస్తుత గుర్తింపు విధానాలు-పరిమితులు
    1. మార్పుల సంఖ్యను బట్టి వాడుకరికి శుభాకాంక్ష బొమ్మ ద్వారా గుర్తింపు
    2. మార్పుల విషయం ఆధారంగా శుభాకాంక్ష బొమ్మ ద్వారా గుర్తింపు
    3. వార్షికోత్సవాలలో భాగంగా ఇ-పుస్తక కూపన్
    4. వికీసమావేశానికి ప్రయాణ, వసతి ఖర్చులు
    5. విద్యార్ధులకు వ్యాసరచనపోటీ-నగదు బహుమతులు
పరిమితులు
  • ఇప్పటికే పనిచేస్తున్న వారికి ప్రోత్సాహకంగా నగదు బహుమతులు లేవు
  • ప్రస్తుత గుర్తింపు విధానం ఏ ఒక్కరిపైనే ఆధారపడివున్నది. కేవలం మార్పుల సంఖ్య ఆధారంగానే గుర్తింపు వస్తుందన్న భావన బలపడడానికి కారణమవుతున్నది. దీనివలన సరైన సమయానికి సభ్యుల కృషిని గుర్తించడం కొన్ని సార్లు జరగటంలేదు. పక్షపాత ఆరోపణలకు అవకాశముంటున్నది. సమగ్ర విశ్లేషణ ఆధారంగా గుర్తింపు లేదు.
  • పోటీలో బహుమతులు కొత్త వారిని ఆకర్షించటానికి మాత్రమే పరిమితమవుతున్నాయి. అలా ఖర్చుపెట్టినా ఎంతమంది వికీలో మరింత క్రియాశీలమవుతారన్నది సంశయమే
  • చాలా కొద్దిమంది మాత్రమే వికీమేనియా లేకభారత వికీసమావేశాలకి ఎంపిక కాగలుగుతున్నారు.

కొత్త పురస్కార ఆవశ్యకతపై ఆంగీకారం కుదిరింది.

పురస్కార విధి విధానాలు

[మార్చు]
    1. ఎంపిక మండలి పదాధికారులు
      1. అధ్యక్షులు

అధ్యక్షుల భాధ్యతలు:ఎంపిక మండలి కి వ్యక్తిరూపం మరియు ప్రతినిధి. ఇతరులతో (వార్షికోత్సవ కమిటీ, సముదాయం..) సమన్వయం, సముదాయమునకు ప్రకటనలు. పురస్కార అభివందన కార్డు, మరియు ధృవపత్రాలపై సంతకం చేయటం.

  • వైజాసత్య ను ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది.
      1. కార్యదర్శి

కార్యదర్శి బాధ్యతలు: ఆధ్యక్షని సూచన మేరకు సమావేశ ఏర్పాట్లు, ప్రక్రియ సజావుగా జరిగేటట్లు చూడడం. అధ్యక్షులు పాల్గొనలేనప్పుడు మరియు ఎంపికమండలి సూచనమేరకు ప్రాతినిధ్యం వహించడం.

  • అర్జునను ఏకగ్రీవంగా కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది.
    1. పురస్కారం పేరు

'కొమర్రాజు లక్ష్మణరావు విశిష్ట వికీ పురస్కారం ' అనే పేరుపై ఏకాభిప్రాయం కుదిరింది.

    1. ప్రతిపాదన విధానం
      1. మూస:2013 వికీ పురస్కార ప్రతిపాదన

మూస రూపం సరిపోతుందని ఏకాభిప్రాయం కుదిరింది. దీనిని అనువదించాలి.

      1. ఎంతమందిని విశిష్ట వికీపీడియనుగా గుర్తించాలి.
      2. బహమతికి కేటాయించిన మొత్తం
      3. ఈ పురస్కారం ప్రతి సంవత్సరం ఇవ్వటానికి అవకాశం

ఈ సంవత్సరానికి 100000 రూపాయలు దశాబ్ది ఉత్సవాల కమిటీ కేటాయించిందని అర్జున తెలిపారు. 2013 మూడవ త్రైమాసికం అంతానికి కనీసం ఒక సంవత్సర కాలం వికీ ప్రాజెక్టులలో పనిచేసిన వారు ఈ పురస్కారాలకు అర్హులనుచేయటంపై ఏకాభిప్రాయం కుదిరింది. ఈ ప్రక్రియ మొదటిసారి కాబట్టి గత 10 సంవత్సరాల కాలంలో పదిమంది వరకు వచ్చిన ప్రతిపాదనలలో ఎంపిక చేయటానికి అవకాశం వుంటుందని చాలా మంది సభ్యులు అంగీకరించారు. తరువాతి సంవత్సరంలో నగదుబహమతుని బట్టి మరియు ప్రతిపాదనలను అత్యధికంగా ఇటీవలి రెండుసంవత్సరాల కృషిని పరిగణనలోకి తీసుకొని అవసరమైనన్నీ పురస్కారాలను నిర్ణయించుకోవచ్చు. పై వాటిని చర్చించిన పిదప పురస్కారాల సంఖ్యపై పూర్తి అధికారం ఎంపిక మండలికి వుంటుందని నిర్ణయించడమైనది. అలాగే సముదాయం నుండి వచ్చే ప్రశ్నలకు ఎంపిక మండలి జవాబుదారుగా వుండాలని నిర్ణయించడమైనది.

      1. ప్రతిపాదన వర్గాలు
        1. విశిష్ట వికీ సభ్యుడు(రాలు)
        2. విశేష వ్యాసం
        3. విశేష ప్రాజెక్టు

ఈ సంవత్సరానికి విశేష సభ్యునిపై మాత్రమే దృష్టిపెట్టాలని నిర్ణయించింది.

    1. కాలరేఖ

ప్రతిపాదన విధానాలను ఐదుగురు అనుభవజ్ఞులైన సభ్యుల ఎంపిక మండలి చర్చించి ఖరారుచేస్తున్నందున, ఇది మొదటి సారి కావున చిత్తుప్రతిపై సముదాయ స్పందన పెద్ద ఉపయోగముండదని అభిప్రాయబడింది. ఈ ప్రక్రియ పూర్తయినతర్వాత విమర్శలేవైనా వుంటే వచ్చే సంవత్సరపు విధానానికి అవి వాడుకొని విధానాన్ని మెరుగు చేయవచ్చు. సాధారణంగా అక్టోబర్ 1 న ప్రక్రియ ప్రారంభించి డిసెంబర్ 10లోపు పురస్కార గ్రహీతల ఎంపిక ప్రకటించాలి. ఈ సంవత్సరానికి డిసెంబర్ 2 ప్రక్రియ ప్రారంభించి ఒక వారం వరకు ప్రతిపాదనలను ఆహ్వనించి ఇంకొకవారంలో ప్రతిపాదనలను విశ్లేషించి, చర్చించి పురస్కారాలను ప్రకటించాలని సమావేశం నిర్ణయించింది.

    1. బహుమతి రూపం, లాభాలు
      1. పురస్కార కార్డు(ఎలెక్ట్రానిక్)
      2. పురస్కార నగదు
        1. ప్రోత్సాహకాలు ధనరూపంగా ఇవ్వడానికి గల ఇబ్బందులు.
        2. విదేశాలలోని వికీ సభ్యులకు నగదు బదీలీలో ఇబ్బంది
        3. ప్రతిపాదిత సభ్యుని ఇటీవలిఈమెయిల్ సంపర్క స్థితి
        4. ప్రతిపాదిత సభ్యుని అంగీకారం
      3. వికీ ప్రచార సామాగ్రిలో ఛాయాచిత్రాలు వాడుక
      4. సమావేశాలలో బహుమతి ప్రదానం మరియు పురస్కార గ్రహీతలు తమ అనుభవాలను సమావేశంలో పంచుకొనటానికి అవకాశం
      5. సమావేశం హాజరవటానికి భారతదేశంలోని సాధారణంగా నివసించే/శాశ్వతనివాసం లేక సమావేశ స్థలానికి దగ్గరిలో నున్న విమానాశ్రయం గల స్థలంనుండి సమా‌వేశ కేంద్రానికి మూడవటియర్ ఎసి కు మించని ప్రయాణ, వసతి సౌకర్యాలు. ( వార్షికోత్సవాల కమిటీ తో చర్చించవలసివుంది)

ఎంపికయిన వారికి నగదు బహుమతిని వినియోగించడంలో పూర్తి స్వాతంత్ర్యం వుండాలని, నగదు అందుకోలేని పరిస్థితిలోనే వేరే వస్తురూపేణా బహమతి అందజేయటానికి ప్రయత్నించాలని, ఆ విధంగా ఈ ఎంపిక మండలికి మరియు వార్షికోత్సవ కార్యనిర్వాహక వర్గానికి మరియు పురస్కారం అందుకొనేవారికి ప్రక్రియ సులభంగా వుంటుందని అభిప్రాయపడింది. అయితే నగదు బహుమతి వలన ఏదైనా పన్ను చెల్లించవలసి వస్తే అది పురస్కారం అందుకొన్న వ్యక్తి బాధ్యత మాత్రమేనని స్పష్టీకరణ ఇవ్వాలని అభిప్రాయపడింది. పురస్కారంలో వివిధ రకాలు వుండవు. ప్రతి పురస్కారానికి ఏకరూపంగా రూ10,000 నగదు మొత్తం నిర్ణయించబడింది. ప్రతిపాదనలు సరిపోయినన్నీ రాని పక్షంలో మరియు/లేక తనంతట తానే ఎంపికమండలి తమ అనుభవంలో విశేషంగా కృషిచేసిన సభ్యుల పేర్లను చర్చించి ఎంపిక మండలి ప్రత్యేక అభినందన కార్డు(ఎలెక్ట్రానిక్) పత్రానికి సభ్యులను ఎంపికచేయవచ్చు. వీరికి నగదు బహుమతులుండవు. వార్షికోత్సవసమావేశాలకు ప్రత్యేక అతిధిహోదావుండదు.

  1. పురస్కార నిర్ణయానికి వాడుకరి కృషిని బేరీజు వేయటానికి వాడే విభాగాలు
    1. తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసవిభాగంలో కృషి
    2. తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి -బొమ్మలు
    3. తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి -చర్చలు,
    4. తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి - మూసలు,
    5. తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి - వికీ ప్రాజెక్టులు
    6. సహసభ్యులకు ప్రోత్సాహం, సహకారం మరియు వికీనడవడి
    7. ఆన్లైన్ ప్రచారంలో కృషి
    8. భౌతిక ప్రచారంలో కృషి
    9. వికీ విధానాలపై అవగాహన
    10. ఇప్పటికే ప్రతిపాదిత వ్యక్తికి వికీ ప్రపంచంలో లభించిన గుర్తింపులు, పురస్కారాలు.

విభాగాలను 10 గా విస్తరించాలని ప్రతిఒక్కదానికి 10 పాయింట్లతో బేరీజు వేయాలని, ఎంపిక మండలి సభ్యుల బేరీజు ఆధారంగా చర్చలు జరిపి పురస్కారానికి అర్హులను నిర్ణయించడానికి సమావేశం తీర్మానించింది. ఈ పై విభాగాలపై ప్రతిపాదనల గడువు ముగిసే లోపల సముదాయ ఏమైనా స్పందిస్తే వాటిని ఎంపిక మండలి పరిగణనలోకి తీసుకోవటానికి అంగీకారంకుదిరింది. ఈ ఎంపిక ప్రక్రియ గణకాలను (ఎంపిక మండలి సభ్యుల పేర్లు వాడకుండా) పురస్కార ప్రకటనతో పాటు ప్రకటించి పారదర్శకతని పెంచాలని సమావేశం తీర్మానించింది.

తదుపరి చర్యలు

[మార్చు]