వికీపీడియా:దశాబ్ది ఉత్సవాల వికీ పురస్కార ఎంపిక/ఇతరవికీప్రాజెక్టుల రచ్చబండలో ప్రచారానికి ప్రకటన
కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారానికి ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నాం
[మార్చు]గడువు: 9 డిసెంబర్ 2013 11:59(UTC) |
- తెలుగు వికీపీడియా రచ్చబండలో ఎంపిక మండలి అధ్యక్షుడు వైజాసత్య గారి సందేశం
తెవికీ సభ్యులందరికీ నమస్కారాలు. తెలుగు వికీ పది సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో గత పది సంవత్సరాలలో విశేష కృషి చేసి, తెలుగు వికీ ఈ స్థాయికి చేరటానికి దోహదం చేసిన మిత్రులందరినీ ఒక్కసారి మళ్లీ వారి సేవలకు గుర్తు చేసుకొని, వారికి తగు విధంగా గుర్తింపు ఇచ్చే శుభ సందర్భం ఇది. ఈ పురస్కారాల ప్రకటన అధికారికంగా వెలువడక ముందే కొన్ని ప్రతిపాదనలు ప్రారంభించబడటం ఆహ్వానించదగ్గ విషయం. సభ్యులందరూ ఈ ప్రక్రియలో క్రియాశీలకంగా పాల్గొని, గుర్తింపుకు అర్హులైన అందరినీ ప్రతిపాదించి, వాళ్ళను గుర్తించేందుకు తగు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ పురస్కారాన్ని సాకారం చేయటానికి కృషి చేస్తున్న దశాబ్ది ఉత్సవాల కమిటీకి ధన్యవాదాలు. అలాగే ఈ పురస్కార ప్రతిపాదనకు చాలా సమయం వెచ్చించి రూపుదిద్దిన ఎంపిక సంఘం సభ్యులు అర్జున గారికి, సుజాత గారికి, రాధాకృష్ణ గారికి, రాజశేఖర్ గారికి ధన్యవాదాలు. మీ ప్రతిపాదనలు ఇక్కడ చేయగలరు. ప్రతిపాదనలు చేయటానికి గడువు సమయం 09 డిసెంబరు 2013 11:59 (UTC) (10డిసెంబరు 2013 05:29 ఉదయం భారత ప్రామాణిక కాలం). స్వీయపత్రిపాదనలు చేయటానికి వెనుకాడవద్దు. మీరు ప్రతిపాదితులైతే, మీ ప్రతిపాదనకు అదనపు సమాచారం చేర్చటానికి మొహమాటపడపద్దు. మన కృషి మనకంటే ఇంక ఎవరికి బాగా తెలుస్తుంది. అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఫలప్రదం చేస్తారని ఆశిస్తూ..
ఎంపిక సంఘం అధ్యక్షుడు - వైజాసత్య --వైజాసత్య (చర్చ) 16:15, 2 డిసెంబర్ 2013 (UTC)