వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జిల్లా, మండల, గ్రామ వర్గాల సవరణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రెండు తెలుగు రాష్ట్రాలలోని జిల్లా, మండల, గ్రామ వ్యాసాలకు చెందిన వర్గాలు అవసరంలేని పదాలతో నిడివి ఎక్కువ ఉండి, ఒకే రకం వర్గాలు కొన్ని ఒకే పద్ధతిలో కాకుండా, వ్యాకరణ విరుద్ధంగా వివిధరకాలుగా ఉన్నాయి.అన్నీ ఒకే రకంగా ఉంటే బాగుంటుదనే అభిప్రాయంతో వాటిని సవరించటానికి సముదాయం చర్చ కొరకు రచ్చబండలో వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 85#జిల్లా, మండల, గ్రామ వ్యాసాల వర్గాల సవరణ కు, చర్చా పేజీ నొకదానిని దీనిలో తయారుచేసి ప్రతిపాదించబడింది.దానిమీద విస్తృతంగా గౌరవ సముదాయ సభ్యుల అభిప్రాయాలు, సూచనలు చేసినమీదట వాటిన్నిటిని పరిశీలించి, ఏ వర్గం ఎలా ఉండాలనేదానిమీద మాదిరి వర్గాలు ఉదహరిస్తూ ఒక నిర్ణయం ప్రకటించబడింది.

నిర్ణయ ప్రకటన సారాంశం[మార్చు]

  1. చర్చలో జిల్లా లోని మండలాలు, మండలం లోని గ్రామాలు లాంటి వర్గాల పేర్ల నుంచి లోని అనే పదాన్ని తొలగిస్తే సంక్షిప్తంగా బాగుంటుందని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు కాబట్టి ఆ పదాన్ని తొలగించాలని నిర్ణయించడమైనది. ఈ పద్ధతిని జనరలైజు చేయకుండా ఈ చర్చలో పేర్కొన్న వర్గాల పేరు మార్పుకే పరిమితం చేయాలి.
  2. మండల గ్రామాల వర్గం పేరులో జిల్లా పేరు బ్రాకెట్లో కనిపిస్తే (ఉదాహరణకు ప్రస్తుతం వర్గం:ఆత్మకూరు (అనంతపురం) మండలంలోని గ్రామాలు) జిల్లా పేరును ఆఖర్లో బ్రాకెట్లో చేర్చాలి అంటే ఇలా ఉండాలి. వర్గం:ఆత్మకూరు మండల గ్రామాలు (అనంతపురం). అలాగే రూరల్ అని బ్రాకెట్లో వస్తే (ఉదాహరణకు: వర్గం:ఆదిలాబాద్ (రూరల్) మండలంలోని గ్రామాలు) దాన్ని గ్రామీణ అని మార్చాలి (ఉదాహరణ: ఆదిలాబాద్ గ్రామీణ మండల గ్రామాలు)
  3. మూసల పేర్లలో సంబంధించిన అనే పదాన్ని తీసివేయడానికి నలుగురు సమర్ధించినా, ముగ్గురు సభ్యులు సరైన కారణాన్ని చూపి (వర్గం పేరువల్ల గందరగోళానికి గురి కావడం) వ్యతిరేకించినందున, అవి అలాగే కొనసాగాలని నిర్ణయిస్తున్నాను.

గమనిక:ఇంకా పూర్తి సమాచారం కొరకు మండల, గ్రామ వ్యాసాల వర్గాల చర్చా పేజీ చూడగలరు.