వికీపీడియా:వికీప్రాజెక్టు/క్రికెట్ 2023/చెయ్యాల్సిన పనులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

క్రికెట్ 2023 ప్రాజెక్టు ద్వారా సృష్టించిన పేజీల్లో కొన్ని పనులు ఇంకా చెయ్యాల్సి ఉంది. ఆయా పనులేమిటో కింద చూడవచ్చు.

అనాథ పేజీలు[మార్చు]

ప్రాజెక్టులో భాగంగా సృష్టించిన పేజీల్లో ఉన్న లోటుల్లో అన్నిటికంటే పెద్దది ఇది. వికీ పేజీల్లో ఉండకూడని లోటు.

వికీపీడియాలో లింకు ఆవశ్యకత గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ఒక పేజీ నుండి మరో దానికి వెళ్ళే లింకులు వెబ్‌పేజీల్లో ఉండాల్సిన అత్యంత ప్రధానమైన అంశం. మన పేజీని చేరుకోవడానికి మరే ఇతర పేజీ నుండి కూడా కనీసం ఒక్క లింకైనా లేకపోతే ఆ పేజీని అనాథ పేజీ అంటారు. అలాంటి అనాథలు, ఈ ప్రాక్జెక్టులో సృష్టించిన పేజీల్లో 900 పైచిలుకు ఉన్నాయి. ఈ పేజీలతో అనుబంధం ఉన్న పేజీల నుండి వీటికి కనీసం ఒక్కటైనా లింకు ఇవ్వాలి. లింకులిచ్చే సమయంలో ఏదో ఒక రెండు పేజీలను తీసుకుని పరస్పరం లింకులిస్తే అవి రెండూ కలిపి అనాథజంట ఔతాయి తప్ప జనజీవనస్రవంతిలో కలిసినట్లు కాదు. ఒక పది పేజీలను తీసుకు వాటికి పరస్పరం లింకులిచ్చినా అంతే - ఒక అనాథ సమాజం అవుతుంది. విస్తారమైన లింకుల సమూహం నుండి వస్తే అవి అనాథలు కావు. అంటే ఈ పది పేజీల అనాథ సమూహపు ఉదాహరణలో - వాటిలో ఏదో ఒక పేజీకి ఒక పెద్ద పేజీ నుండి, ఉదాహరణకు "క్రికెట్" పేజీ నుండి, లింకు ఇచ్చామనుకోండి అప్పుడు ఈ పది కూడా అనాథలు కావు. లింకులిచ్చే కొన్ని విధానాలు-

  1. ముందుగా పేజీ పేరుతో వెతకండి. ఆ పేరు ఏదైనా పేఝీలో ఉంటే, అక్కడ లింకు ఇవ్వండి. ఒకటి కంటే ఎక్కువ పేఝీలు ఫలితాల్లో వస్తే కనీసం మూడు పేజీల్లో లింకులు ఇవ్వండి.
  2. వ్యక్తుల పేజీలకు:
    1. ఆ వ్యక్తులు (ఆటగాళ్ళు, అంపైర్లు, నిర్వాహకులు, వగైరా) ఏ జట్టుకు చెందిన వాళ్ళో చూసి, ఆ జట్టు పేజీకి వెళ్ళి అక్కడ లింకు ఇవ్వాలి. ఒకవేళ జట్టు పేజీలో ఆ పేరు లేకపోతే, ఆ పేరు చేర్చి లింకు ఇవ్వాలి.
    2. ఆ ఆటగాళ్ళు ఏదైనా టోర్నమెంటులో ఆడారా అనేది చూడండి. ఆ టోర్నమెంటు పేజీకి వెళ్ళి చూడండి. అక్కడ ఆ ఆటగాడి పేరు తప్పుగా రాసి ఉండవచ్చు, లేదా ఇంగ్లీషులో ఉండవచ్చు. అక్కడ ఆ పేరు సవరించి, లింకు ఇవ్వండి
    3. జాబితాల పేజీ సృష్టించండి. ఉదాహరణకు, ఆస్ట్రేలియా వన్‌డే క్రికెటర్ల జాబితా, న్యూజీలాండ్ టి20 క్రికెటర్ల జాబితా. ఇలాంటి జాబితా పేఝీలు సృష్టిస్తే అందులో ఆయా ఆటగాళ్ళ పేర్లు ఉంటాయి, వాటికి లింకులు ఇవ్వవచ్చు. ముందుగా ఎన్వికీలో ఆ జాబితా పేజీలను పరిశీలించి, మనకు అవసరమైన పేర్లు ఆ జాబితాల్లో ఉన్నాయో లేదో ధ్రువీకరించుకోవచ్చు.
  3. లింకు ఇచ్చే ఆస్కారం ఎక్కడా కనిపించకపోతే,
    1. ఈ పేజీలో ఉన్న సమాచారంతో సంబంధం ఉన్న వేరే పేజీలో సముచితమైన పాఠ్యం రాసి, అందులో లింకు ఇవ్వండి.
    2. ఈ పేజీలో ఉన్న సమాచారంతో సంబంధం ఉన్న వేరే పేజీలో "ఇవి కూడా చూడండి" విభాగంలో ఈ పేజీకి లింకు ఇవ్వండి

అనాథ పేజీల సంస్కరణ ప్రగతి[మార్చు]

అనాథ పేజీల సంస్కరణ ప్రగతి
తేదీ అనాథ పేజీల సంఖ్య
2023 నవం 21
926
నవం 22
720
నవం 23
335
నవం 25
192
డిసెం 26
123
2024 జన 4
98

ఎర్రలింకులు[మార్చు]

ప్రాజెక్టులో భాగంగా సృష్టించిన పేజీల్లో కనీసం ఒక్కటైనా ఎర్రలింకు ఉన్న పేజీలు 2063 ఉన్నాయి. ఈ పేజీల్లో ఉన్న మొత్తం లింకులు 17,000 దాకా ఉన్నాయి. అంటే దాదాపుగా సృష్టించిన ప్రతీ పేజీలోనూ కనీసం ఒక్కటైనా ఎర్రలింకు ఉందన్నమాట. ఈ క్వారీ క్వెరీలో దానికి సంబంధించిన డేటాను చూదవచ్చు. ఈ ఎర్రలింకులను సరిచేసే పద్ధతులు ఇవి:

  • లింకులో పేజీ పేరును తప్పుగా ఇచ్చారేమో చూసి దాన్ని సవరించాలి.
  • లింకు లక్ష్యంగా ఉన్న పేజీని సృష్టించాలి
  • లింకు అంత ముఖ్యమైనది కాకపోతే, పేజీని సృష్టించడం ఇప్పుడప్పుడే చెయ్యలేమని అనిపిస్తే, ఆ లింకును తీసెయ్యాలి
  • ఏదైనా మూసనుండి ఆ లింకులు వస్తున్నాయేమో చూసి ఆ మూసలో లింకును సవరించడం/పేజీ సృష్టించడం/లింకు తీసెయ్యడం చెయ్యాలి.

ఎర్రలింకులు ఏయే పేజీలకు (ఏయే పేజీల నుండి కాదు) ఎక్కువ పోతున్నాయో తెలుసుకునేందుకు ప్రత్యేకపేజీల్లోని ఆవశ్యక పేజీలు అనే చోటికి వెళ్తే అక్కడ చూదవచ్చు. ఇక్కడ ఈ ప్రాజెక్టు పేజీలే కాక వికీపీడియా లోని అన్ని ఎర్రలింకుల పేజీల శీర్షికలూ ఉంటాయి. అంటే ఈ పేజీలను సృష్టించాల్సిన అవసరం ఉందని అర్థం. పక్కన బ్రాకెట్లో ఇచ్చిన లింకుల సంఖ్య ఎంత ఎక్కూవగా ఉంటే ఆ పేఝీ ఆవశ్యకత అంత ఎక్కువగా ఉన్నట్లన్నమాట. అక్కడ "Pakistan క్రికెట్ జట్టు" అనే పేజీ శీర్షికకు 92 లింకులు వెళ్తున్నాయి. పేజీ శీర్షిక తప్పే.. కానీ లింకులు వెళ్తున్నాయి. అంచేత దాన్ని పాకిస్తాన్ క్రికెట్ జట్టు అనే పేజీకి దారిమార్పుగా చేసాం. దానితో ఆ పేజీ ఆ జాబితా లోంచి పోయింది. పైనున్న ఎర్రలింకుల సంఖ్యలో 92 తగ్గినట్టే (అయితే, దీనికంటే మెరుగైన పరిష్కారం వేరే ఉంది. అది కూడా చేద్దాం). ఈ విధంగా దారిమార్పులు సృష్టించి 600 పైచిలుకు ఎర్రలింకులను సవరించాం.

అనువాదాలు[మార్చు]

పేజీల్లో కొన్ని చోట్ల అనువాదాలు/తెలుగీకరణలూ చెయ్యకుండా వదిలేసాం. ముఖ్యంగా పట్టికలు, సమాచారపెట్టెల్లో ఇలా జరిగింది. వీటిని సవరించాలి.

బొమ్మలు చేర్చడం[మార్చు]

బొమ్మల్లేని పేజీలు అనేకం ఉన్నాయి. సాధారణంగా కామన్సులో ఉండే బొమ్మలైతే ఆటోమాటిగ్గా అనువాదంలోకి వచ్చేస్తాయి. ఎన్వికీలో స్థానికంగా ఎక్కించిన బొమ్మలైతే మాత్రం రావు వాటిని ఇక్కడ ఎక్కించుకోవాలి. బొమ్మల్లేని వ్యాసాల పాక్షిక జాబితా ఇక్కడ ఉంది, చూడవచ్చు. బొమ్మలు చేర్చడానికి ఒక సుళువైన పద్ధతి కూడా అక్కడ ఇచ్చారు. అయితే బొమ్మను చేర్చాక, లైసెన్సు వివరాలకు సంబంధించిన మూసను చేర్చడం మరువరాదు. లేదంటే ఆ బొమ్మను తొలగించే అవకాశం ఉంది.

వికీడేటా వివరాలు/క్లుప్త వివరణను చేర్చడం[మార్చు]

ప్రతి పేజీకి పైన, శీర్షిక కింద "క్లుప్త వివరణ" ఉంటుంది. వికీడేటా లింకుకు వెళ్ళి అక్కడ లేబులు, వివరణ చేర్చాలి. అక్కడ ఇచ్చే వివరణే ఇక్కడి పేజీలో క్లుప్త వివరణగా కనిపిస్తుంది. "నా అభిరుచులు" పేజీలో, "ఉపకరణాలు" ట్యాబులో, "క్లుప్త వివరణ సహాయకం" అనే దానికి టిక్కు పెట్టినవారికి, క్లుప్తవివరణ ఇచ్చే అవకాశం ఇక్కడి పేజీలోనే కనిపిస్తుంది.

పేజీ పేర్ల సవరణ[మార్చు]

కొన్ని పేజీ పేర్లను సవరించాల్సి ఉంది.దానికి కింది కారణాలున్నాయి

  • పేరు ఉచ్చారణను సవరించవలసి రావడం
  • పేరులో అవసరం లేని క్వాలిఫయర్లుండడం. ఉదాహరణకు ఇంగ్లీషులో Frank Johnson (New Zealand Cricketer born in 1998) అనే పేజీ ఉందనుకోండి. ఎన్వికీలో ఫ్రాం కాన్సన్ అనే మరొక న్యూజీలాండ్ క్రికెటరుకు కూడా పేజీ ఉందన్నమాట. అందుకే వాళ్ళు పేజీ పేరు అలా పెట్టారు. మనక్కూడా ఆ పేజీ ఉంటే ఇప్పటి పేజీ పేరుకు ఆ విధంగా క్వాలిఫై చెయ్యవచ్చు. అలా లేనపుడు మనం ఉత్త "ఫ్రాంక్ జాన్సన్" అని పెట్టుకోవచ్చు. లాంటి సందర్భం మనకు ఆర్.పి.సింగ్ అనే పేరున్న ఇద్దరు క్రికెటర్లతో వచ్చింది. మనం ఆర్.పి. సింగ్, ఆర్.పి.సింగ్ (జననం 1965 అనే పేర్లతో పేజీలు పెట్టుకున్నాం.

ఇలా పేర్లు సవరిఉంచడం వలన, ఎర్రలింకులను తగ్గించే అవకాశం కూడా ఉంది.

వర్గీకరణ[మార్చు]

పేజీని సముచితమైన వర్గాల్లో చేర్చడం అనేది చాలా ముఖ్యమైన పని. అసలు ఒక్క వర్గంలో కూడ చేరని పేజీలంటూ దాదాపుగా లేవు. అయితే చేర్చిన వర్గాలు సరైనవో కావో, లేదా చేర్చిన వర్గాలకు పేజీలున్నాయో లేదో (ఎర్రవర్గాలు కాకూడదు) చూడాలి. దీనికి కాస్త తక్కువ ప్రాధాన్యత ఇవ్వవచ్చు

ఇతరాలు[మార్చు]

  • అగాధ పేజీలు: వాటినుండి ఇతర పేజీలకు లింకులు ఇవ్వడం
  • భాషా సవరణలు: కొన్ని భాషా సవరణలు చెయ్యాల్సి ఉంది.
    • మొదటి రెండు వాక్యాల్లో వచ్చే "ఒక" అనేదాన్ని సవరించడం. ఉదాహరణకు, ఫలానా సుబ్బారావు భారతదేశానికి చెందిన ఒక క్రికెట్ ఆటగాడు అని ఉందనుకోండి. ఇంగ్లీషులో "ఎ క్రికెటర్" అనదం మామూలే గానీ మనకు "ఒక" అనేది ఈ సందర్భంలో అంతగా నప్పదు.
    • బ్యాట్స్‌మన్‌ను బ్యాటరుగా మార్చడం