ఆర్.పి. సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్.పి. సింగ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రుద్ర ప్రతాప్ సింగ్
పుట్టిన తేదీ (1985-12-06) 1985 డిసెంబరు 6 (వయసు 38)
రాయ్ బరేలి, ఉత్తర ప్రదేశ్
ఎత్తు5 ft 11 in (180 cm)[1]
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుLeft-arm ఫాస్ట్ మీడియం
పాత్రBowler
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు2006 జనవరి 21 - పాకిస్తాన్ తో
చివరి టెస్టు2011 ఆగస్టు 18 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 165)2005 సెప్టెంబరు 4 - జింబాబ్వే తో
చివరి వన్‌డే2011 సెప్టెంబరు 16 - ఇంగ్లాండ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.9
తొలి T20I (క్యాప్ 13)2007 సెప్టెంబరు 13 - స్కాంట్లాండ్ తో
చివరి T20I2009 జూన్ 16 - దక్షిణాఫ్రికా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2003–2015ఉత్తర ప్రదేశ్
2007Leicestershire
2008–2010Deccan Chargers
2011Kochi Tuskers Kerala
2012ముంబై ఇండియన్స్
2013రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్
2015–2018గుజరాత్
2016రైజింగ్ పూణే సూపర్‌జైంట్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లి ఎ
మ్యాచ్‌లు 14 58 94 136
చేసిన పరుగులు 116 104 922 443
బ్యాటింగు సగటు 7.25 10.40 10.13 10.54
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 30 23* 47 35
వేసిన బంతులు 2,534 2,565 17,192 6,378
వికెట్లు 40 69 301 190
బౌలింగు సగటు 42.05 33.95 30.57 28.73
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 12 3
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 1 0
అత్యుత్తమ బౌలింగు 5/59 4/35 6/50 5/30
క్యాచ్‌లు/స్టంపింగులు 6/– 13/– 35/– 40/–
మూలం: CricketArchive, 2017 అక్టోబరు 28

రుద్ర ప్రతాప్ సింగ్ (జననం 1985 డిసెంబరు 6) మాజీ భారతీయ క్రికెటరు. అతను భారత జాతీయ క్రికెట్ జట్టు తరపున టెస్టులు, వన్డే ఇంటర్నేషనళ్ళు, ట్వంటీ 20 ఇంటర్నేషనళ్ళూ ఆడాడు. అతను లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్-మీడియం బౌలరు.[2] 2018 సెప్టెంబరులో అతను అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. [3] 2007 T20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో ఆర్.పి. సింగ్ సభ్యుడు.

తొలి ఎదుగుదల[మార్చు]

అతను 2004లో బంగ్లాదేశ్‌లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్‌లో 24.75 సగటుతో ఎనిమిది వికెట్లు పడగొట్టినప్పుడు మొదటిసారిగా క్రికెట్ పెద్దల దృష్టిలో పడ్డాడు. [4] తరువాత ఉత్తర ప్రదేశ్ [5] కొరకు రంజీ ట్రోఫీలో నిలకడగా ప్రదర్శన ఇచ్చాడు. ఆకట్టుకునే ప్రదర్శనల వలన అతను 2005లో వన్‌డే జట్టులో స్థానం సంపాదించాడు. 2015లో దేశీయ పోటీల్లో యూపీ నుంచి గుజరాత్‌కు మారాడు.

అంతర్జాతీయ కెరీర్[మార్చు]

సింగ్‌ ఆడిన మూడవ వన్డే మ్యాచ్‌లో, శ్రీలంకను 196 పరుగులకు ఆలౌట్ చేయడంలో తన వంతు పాత్ర పోషించినందుకు సింగ్ తన మొదటి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. బ్యాటింగ్ వికెట్‌పై బంతిని స్వింగ్ చేస్తూ 4 ముఖ్యమైన వికెట్లు పడగొట్టి శ్రీలంకను కుదిపేశాడు. అతని బౌలింగ్ గణాంకాలు 8.5 ఓవర్లు, 2 మెయిడిన్లు, 35 పరుగులు, 4 వికెట్లు. ఈ గణాంకాలు అంతర్జాతీయ వేదికపై అతని ఉనికిని ప్రకటించాయి. [6] 2006 జనవరిలో పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌లో జరిగిన 2వ టెస్టులో సింగ్ తన తొలి టెస్టు ఆడుతూ, 5 వికెట్లు పడగొట్టి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. [7]

2006లో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోని నాల్గవ మ్యాచ్‌లో సింగ్ 4 వికెట్లు పడగొట్టడం, సిరీస్‌లో భారత్ తిరుగులేని 3-1 ఆధిక్యాన్ని సాధించడంలో సహాయపడింది. ఆ మ్యాచ్‌లో అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది.[8] దీంతో భారత్ 4-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అతని మొదటి 11 వన్‌డే మ్యాచ్‌లలో, 3 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.


ఐంగ్ అత్యుత్తమ ఎకానమీ రేట్ కారణంగా 2006 ICC ఛాంపియన్స్ ట్రోఫీ కోసం శ్రీశాంత్‌ను కాదని అతన్ని తీసుకున్నారు.[9] అయితే, అతను ఆ స్థాయి ప్రదర్శనను కొనసాగించలేకపోవడంతో, ఆ తరువాత జట్టు నుండి తొలగించారు.

సింగ్‌ను ఇంగ్లండ్ పర్యటన కోసం టెస్ట్ జట్టులో తీసుకున్నారు. లార్డ్స్‌లో 5/59 స్కోర్‌తో మంచి ప్రదర్శన ఇచ్చాడు, టెస్టుల్లో అది అతని మొదటి ఐదు వికెట్ల పంట. [10] వన్డే సిరీస్‌లో ఐదు మ్యాచ్‌ల నుంచి 31.71 సగటుతో ఏడు వికెట్లు తీశాడు. [11]

సింగ్ 2007 సెప్టెంబరులో దక్షిణాఫ్రికాలో జరిగిన 2007 ICC వరల్డ్ ట్వంటీ20 టోర్నమెంట్‌లో ఆడేందుకు ఎంపికయ్యాడు [12] 7 మ్యాచ్‌ల్లో ఒక్కో వికెట్‌కు 12.66 పరుగుల సగటుతో 12 వికెట్లు పడగొట్టి, మొత్తం పోటీలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా సింగ్ నిలిచాడు. [13] 12 దేశాల టోర్నీ ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించి భారత్ విజేతగా నిలిచింది. [14] RP సింగ్ అత్యుత్తమ గణాంకాలు 4 ఓవర్లలో 4/13. ఇది భారత చివరి సూపర్-8 స్టేజ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై చేసినది.[15]


ఆ తర్వాత ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌లతో జరిగిన వన్డే హోమ్ సిరీస్‌లకు సింగ్ ఎంపికయ్యాడు, ఒక్కో సిరీస్‌లో నాలుగు గేమ్‌లు ఆడి మొత్తం 11 వికెట్లు పడగొట్టాడు. [16] [17]

2011 ఆగస్టులో ఇంగ్లండ్ పర్యటనలో జహీర్ ఖాన్‌కు గాయం అవడంతో, సింగ్‌ను భారత జట్టు లోకి తీసుకున్నారు. 3 సంవత్సరాల గ్యాపు తర్వాత అతనికి ఈ అవకాశం వచ్చింది.[18]

ఈ సిరీస్‌లోని నాలుగో టెస్టు మ్యాచ్‌లో సింగ్ ఆడాడు. మొదటి ఓవరులో అతని మొదటి నాలుగు బంతులు లెగ్ సైడ్‌కు ఆవల పడ్డాయి. సింగ్ మామూలు క్లబ్ స్థాయి బౌలరు లాగా కనిపించాడు. అతని పేస్ 120 కి.మీ/గం కు తగ్గింది. అతను ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌కు ఎలాంటి ముప్పుగా కనిపించలేదు. టెస్ట్ క్రికెట్‌లో తాను చూసిన అత్యంత చెత్త ఓపెనింగ్ ఓవర్లలో ఇది ఒకటి అని ఇయాన్ బోథమ్ అభివర్ణించాడు. సునీల్ గవాస్కర్ కూడా, అతన్ని ఎంపిక చేయడాన్ని విమర్శించాడు. అప్పటి భారత కెప్టెన్ MS ధోనీతో సన్నిహితంగా ఉండటం వల్లే సింగ్‌ని ఎంపిక చేసినట్లు కొందరు క్రికెట్ నిపుణులు, మాజీ ఆటగాళ్లూ భావించారు.

దేశీయ కేరీర్[మార్చు]

2006లో, సింగ్ ఇంగ్లీష్ జట్టు లీసెస్టర్‌షైర్‌కు సంతకం చేసాడు.[19] అయితే అతను ప్రపంచ కప్‌లో భారత జట్టు పేలవమైన ప్రదర్శన తరువాత, ఊహించని విధంగా అతన్ని భారత జట్టుకు తిరిగి పిలిచారు. అప్పుడు కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.[20]

అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కొచ్చి టస్కర్స్ కోసం ఆడాడు. 2011 లో డెక్కన్ ఛార్జర్స్ కోసం సంతకం చేశాడు. టోర్నమెంటులో అతని రెండవ సీజన్‌లో, సింగ్ అత్యంత విజయవంతమయ్యాడు. టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. 16 మ్యాచ్‌లలో 23 వికెట్లు తీసి తద్వారా పర్పుల్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. [21] డెక్కన్ ఛార్జర్స్ టోర్నీ విజేతగా నిలిచింది. [22] టోర్నమెంట్ ప్రారంభంలో అతని ప్రదర్శన వలన, అతనికి 2009 ICC వరల్డ్ ట్వంటీ 20 కోసం భారత జట్టులో చోటు లభించింది. [23]2012లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లేయర్స్ వేలంలో ముంబై ఇండియన్స్ అతనిని $600,000కి కొనుగోలు చేసింది [24] 2013లో ఐపీఎల్‌లో 2013లో జరిగిన ఆటగాళ్ల వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతన్ని $400,000కు కొనుగోలు చేసింది. 2014 IPL వేలంలో, అతను అమ్ముడుపోలేదు. రూ. 1 కోటి ప్రాథమిక ధరను కలిగి ఉన్నాడు. అతను 2016 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్ తరపున కొన్ని మ్యాచ్‌లు ఆడాడు.

మూలాలు[మార్చు]

  1. RP Singh’s profile on Sportskeeda
  2. "R. P. Singh". ESPNcricinfo. Retrieved 17 February 2017.
  3. "Former India seamer RP Singh retires". ESPNcricinfo. Retrieved 4 September 2018.
  4. "ICC Under-19 World Cup 2004". ESPNcricinfo. Retrieved 17 February 2017.
  5. "BOWLING IN RANJI TROPHY 2004/05 (ORDERED BY WICKETS)". cricketarchive. Retrieved 17 February 2017.
  6. "Sri Lanka tour of India, 6th ODI: India v Sri Lanka at Rajkot, Nov 9, 2005". ESPNcricinfo. Retrieved 17 February 2017.
  7. "India tour of Pakistan, 2nd Test: Pakistan v India at Faisalabad, Jan 21–25, 2006". ESPNcricinfo. Retrieved 17 February 2017.
  8. "India tour of Pakistan, 4th ODI: Pakistan v India at Multan, Feb 16, 2006". ESPNcricinfo. Retrieved 17 February 2017.
  9. "Champions Trophy 2006 – India Squad". ESPNcricinfo. Retrieved 17 February 2017.
  10. "India tour of Ireland, England and Scotland, 1st Test: England v India at Lord's, Jul 19–23, 2007". ESPNcricinfo. Retrieved 17 February 2017.
  11. "NatWest Series [India in England], 2007 / Records / Most wickets". ESPNcricinfo. Retrieved 18 February 2017.
  12. "ICC WORLD TWENTY20, 2007 – India Squad / Players". ESPNcricinfo. Retrieved 18 February 2017.
  13. "ICC World Twenty20, 2007 / Records / Most wickets". ESPNcricinfo. Retrieved 18 February 2017.
  14. "ICC WORLD TWENTY20 2007 – Results". ESPNcricinfo. Retrieved 18 February 2017.
  15. "ICC World Twenty20, 24th Match, Group E: South Africa v India at Durban, Sep 20, 2007". ESPNcricinfo. Retrieved 18 February 2017.
  16. "Records / Australia in India ODI Series, 2007/08 / Most wickets". ESPNcricinfo. Retrieved 18 February 2017.
  17. "Records / Pakistan in India ODI Series, 2007/08 / Most wickets". ESPNcricinfo. Retrieved 18 February 2017.
  18. "India's Zaheer Khan ruled out of England series with ankle injury". The Guardian. London. 7 August 2011. Retrieved 7 August 2011.
  19. "Leicestershire sign left-armer Singh". ESPNcricinfo. Retrieved 17 February 2017.
  20. "Foxes eye replacement for Singh". BBC Sport. 16 May 2007. Retrieved 17 February 2017.
  21. "Indian Premier League 2009 – Records – Most wickets". ESPNcricinfo. Retrieved 17 February 2017.
  22. "Indian Premier League, Final: Royal Challengers Bangalore v Deccan Chargers at Johannesburg, May 24, 2009".
  23. "Indian squad for the World T20". Retrieved 2009-06-03.
  24. "IPL Auction 2012". Retrieved 4 February 2012.