వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు వికీ పాఠ్య ప్రణాళిక ప్రాజెక్టు/పురోగతి (రెండవ దశ)
తెలుగు వికీపీడియా గురించి వాడుకరులు స్వయంగా నేర్చుకోగలిగే పాఠ్య ప్రణాళిక, దానికి అవసరమైన అన్ని రకాల బోధనా ఉపకరణాలు తయారుచేసి అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ప్రాజెక్టు రెండవ దశ (2021 ద్వితీయార్థం)కు వికీమీడియా ఫౌండేషన్ ప్రాజెక్టు గ్రాంటు అందిస్తోంది. ప్రాజెక్టు రెండవ దశ, 2021 జూలై 1వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు ఉంటుంది.
తొలి ఆరు నెలలకాలంలో ప్రాజెక్టులో జరిగిన పనులు ప్రాజెక్టు గ్రాంట్ టైంలైన్ పేజీ, ప్రాజెక్టు మిడ్ పాయింట్ నివేదిక పేజీలలో రాశాము. ఆ తరువాత జరిగే పురోగతిని ప్రతివారం ఈ పేజీలో పొందుపరుస్తున్నాము.
మార్చి 28 - ఏప్రిల్ 1
[మార్చు]- రాసుకున్న 8 పాఠాలలో, డెమో పరిశీలన కోసం 3 పాఠాలకు సంబంధించిన వీడియోలను స్క్రీన్ రికార్డింగ్ చేశాను.
- ప్రాజెక్టు గ్రాంట్ కు సంబంధించిన మిడ్ పాయింట్ రిపోర్టును తయారు చేశాను.
ఏప్రిల్ 4 - 8
[మార్చు]- పాఠ్య ప్రణాళిక వీడియోలు తయారుచేయడానికి వికీపీడియా ఖాతా పేరు నిర్ధారణకోసం వికీపీడియాలో రచ్చబండలో రాసి, సభ్యుల స్పందన కోరడం జరిగింది. ఖాతా పేరు నిర్ధారణకోసం రచ్చబండలో వచ్చిన స్పందనలకు రిప్లై ఇచ్చాను.
- మెటా పేజీలో ప్రాజెక్టు మిడ్ పాయింట్ రిపోర్టును సబ్మిట్ చేశాను. రివ్యూ చేస్తున్నట్టు చెప్పారు.
- ప్రాజెక్టు పురోగతి (రెండవ దశ) నివేదిక కోసం పేజీ పెట్టి, అందులో నివేదిక రాశాను.
- వీడియోల తయారీ గురించి ఎడిటర్ లో చర్చించాను. ఫిమేల్ వాయిస్ ఓవర్ కోసం కొంతమంది వాయిస్ ఓవర్లను పరిశీలించాను. లోగో, సిగ్నేచర్ టోన్ గురించి మాట్లాడాను.
- పాఠ్యరూపంలో ఉన్న కంటెంట్ ను వీడియోలకు అనుకూలంగా సరిచేసి రాశాను. 1. ఖాతాను తెరవడం, 2. వాడుకరి పేజీ సృష్టి, 3. వాడుకరి చర్చాపేజీ, 4. ప్రయోగశాల, 5. వీక్షణ జాబితా.
అక్టోబరు 24 - 28
[మార్చు]అక్టోబరు 22న ఉదయం 10 గంటలకు కమిటీ సభ్యులతో గూగుల్ మీట్ సమావేశం జరిగింది. వికీలో ప్రస్తుతమున్న "వెక్టర్" స్థానంలో "వెక్టర్ 2022" డిఫాల్టు రూపుగా రాబోతోందని ప్రాజెక్టు కమిటీ సభ్యుల సమావేశంలో ప్రస్తావించగా... ఇప్పటివరకు చేసినవాటిని వదిలిపెట్టి, వాటి స్థానంలో కొత్త రూపుకు తగ్గట్టుగానే పాఠాలు రూపొందించుకుంటేనే బాగుంటుందని ప్రాజెక్టు కమిటీ సభ్యులు సూచించారు. దాంతో వాటని మళ్ళీ కొత్తగా రూపొందించాల్సివస్తుంది.
- "వెక్టర్ 2022"ను వాడుతూ వ్యాసాలు రాయడం, దిద్దుబాట్లు చేశాను.
- ప్రాజెక్టు గ్రాంట్ రెండవ ఇంస్టాల్ మెంట్ కోసం వచ్చిన మెయిల్ కు సమాధానాలు రాశాను.
- ప్రాజెక్టు చర్చాపేజీలో చదువరి గారు రాసిన ప్రశ్నలకు సమాధానాలు రాశాను (వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/తెలుగు వికీ పాఠ్య ప్రణాళిక ప్రాజెక్టు, వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/తెవికీ పాఠ్య ప్రణాళిక/పాఠ్యాశాలు/వ్యాస వివరాల పరిచయం)
- గతంలో రాసిన టాపిక్స్ లల్లో 1. వికీపీడియా పరిచయం, 2. మొదటిపేజీ పరిచయం, 3. యూజర్ ఇంటర్ ఫేజ్ పరిచయం, 4. వ్యాస వివరాల పరిచయంల పాఠాన్ని పరిశీలించి, కొత్తరూపుకు తగినట్టుగా చేయాల్సిన మార్పులను లిస్టు చేశాను. (ఇందులో వికీపీడియా పరిచయం పాఠాన్ని పరిశీలించగా అది కొత్తరూపుకు తగ్గట్టుగానే ఉంది. మొదటిపేజీ పరిచయం పాఠాన్ని పరిశీలించిగా... దాదాపుగా కొత్తరూపుకు తగ్గట్టుగానే ఉంది. అయితే లాగిన్ కానివారికి కొత్తరూపు ఇంకా అందుబాటులోకి రాలేదు కాబట్టి... ఖాతా సృష్టించుకోండి, ‘లాగినవండి’ వంటి వాటి గురించి కొత్తరూపు వచ్చిన తరువాత చూసి రాయాలి. యూజర్ ఇంటర్ ఫేజ్ పరిచయం పాఠాన్ని పరిశీలించగా అది కొత్తరూపుకు తగ్గట్టుగానే ఉంది.)
అక్టోబరు 31 - నవంబరు 4
[మార్చు]- "వెక్టర్ 2022"ను వాడుతూ వ్యాసాలు రాయడం, దిద్దుబాట్లు చేశాను.
- గతంలో రాసిన టాపిక్స్ లల్లో 5. ఖాతాను తెరవడం, 6. వాడుకరి పేజీని సృష్టి, 7. వాడుకరి చర్చాపేజీ, 8. ప్రయోగశాల, 9. వీక్షణ జాబితా పాఠాన్ని పరిశీలించి, కొత్తరూపుకు తగినట్టుగా చేయాల్సిన మార్పులను లిస్టు చేశాను.
- రాసిన టాపిక్స్ ను మరోసారి రివిజన్ చేశాను.
నవంబరు 7 - 11
[మార్చు]- పాఠాల వీడియోల ప్రారంభంలో ఉపయోగించాల్సిన లోగో విషయమై ప్రాజెక్టు కమిటీతో, ఇతర వికీసభ్యులతో చర్చించాను. లోగో కోసం కొన్ని మోడల్స్ పరిశీలించి, మోడల్ లోగోలు తయారుచేశాను.
- పాఠ్యాంశాల ప్రశ్నావళితో ’అధ్యాయాలు - పాఠ్యాంశాలు - పాఠాలు’ వారిగా ఒక పట్టిక తయారుచేశాను.