వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ-ఐఐఐటి/నమూనా వ్యాసాలు/బిశ్వేశ్వర్ భట్టాచార్జీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బిశ్వేశ్వర్ భట్టాచార్జీ
జననం1942
పశ్చిమ బెంగాల్
విద్యకెమికల్ ఇంజనీరింగ్ లోమాస్టర్ డిగ్రీ
ఉద్యోగంభాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్)
పురస్కారాలుపద్మశ్రీ

బిశ్వేశ్వర్ భట్టాచార్జీ ఒక భారతీయ కెమికల్ ఇంజనీర్. బహుళ క్రమశిక్షణ శాస్త్రవేత్తగా ప్రసిద్ధి. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) కెమికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గ్రూప్ కు మాజీ డైరెక్టర్ గా పనిచేసాడు.

మైసూరులోని రేర్ మెటీరియల్స్ ప్రాజెక్ట్ మాజీ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా, అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా సభ్యుడు గా కూడా విధులు నిర్వహించాడు.

పద్మశ్రీ పౌర పురస్కార గ్రహీత[1]. బార్క్ లో సమృద్ధ యురేనియం , ఇతర వ్యూహాత్మక పదార్థాల ఉత్పత్తిలో ఉపయోగించే హై స్పీడ్ రోటార్స్ (హెచ్.ఎస్.ఆర్) కోసం గ్యాస్ సెంట్రిఫ్యూగల్ టెక్నాలజీ అభివృద్ధిలో విశేష కృషి చేసాడు.[2]

జీవిత చరిత్ర[మార్చు]

జననం విద్యాభ్యాసం[మార్చు]

భట్టాచార్జీ 1942లో భారత రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ లో జన్మించాడు[3]. కోల్ కతాలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ లో కెమికల్ ఇంజనీరింగ్ లోమాస్టర్ డిగ్రీ పూర్తిచేసాడు. 1996 లో బార్క్ శిక్షణా పాఠశాలలో చేరాడు.

వృత్తి జీవితం[మార్చు]

దేశంలోని ఏకైక యురేనియం మిల్లు అయిన బీహార్ లోని జదుగూడలో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు తన సేవలందించాడు. మైసూరులోని రత్నహళ్ళి గ్రామంలో ఒక క్లాసిఫైడ్ ప్రాజెక్ట్ అయిన రేర్ మెటీరియల్స్ ప్లాంట్ స్థాపనలో కీలకపాత్ర పోషించాడు.[4] బార్క్ కొరకు డీశాలినేషన్ ప్లాంట్ ల అభివృద్ధిలో కూడా ఆయన ముఖ్య పాత్ర పోషించాడు. ఇది మద్రాసు అణువిద్యుత్ కేంద్రానికి అనుబంధంగా ఉన్నది. దేశంలో బార్క్ సరఫరా చేసే పదిహేను ప్లాంట్ లలో కల్పాక్కం కూడా ఒకటి. 2001 నుండి 2004 వరకు భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ హోదాలో ఉన్నాడు.[5] 2004 ఏప్రిల్ లో శ్రీకుమార్ బెనర్జీకి తన పదవీ బాధ్యతలు అప్పగించాడు. బార్క్ అధిపతిగా ఉన్న కాలంలోనే కల్పాక్కం రీప్రాసెసింగ్ ప్లాంట్ లో 21 జనవరి 2003న ఒక ప్రమాదం సంభవించి ఆరుగురు బార్క్ సిబ్బంది రేడియేషన్ కు గురికావడానికి కారణమైంది.

  • భట్టాచార్జీ ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ (ఐఎన్ఎఇ)కు ఫెలో[6] గా ఎన్నికనాడు.
  • నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీలో న్యూక్లియర్ అండ్ రేడియోలాజికల్ ఎమర్జెన్సీ మాజీ సభ్యుడు.
  • భారత అణు శక్తి కమిషన్ సభ్యుడిగా కూడా పనిచేశాడు.
  • 2006లో ప్రచురితమైన కెమికల్ మెటలర్జీపై టెక్స్ట్ బుక్ అయిన కెమికల్ మెటలర్జీ: ప్రిన్సిపుల్స్ అండ్ ప్రాక్టీస్ కు ముందుమాట రాశాడు .
  • శాస్త్ర ఇంజనీరింగ్ రంగాలకు చేసిన సేవలకు గాను 2001లో నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ [1]ని భారత ప్రభుత్వం భట్టాచార్జీకి ప్రదానం చేసింది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 https://www.webcitation.org/6U68ulwpb?url=http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf
  2. http://www.oocities.org/bharatvarsha1947/Feb_2003/bbcnukes.htm
  3. https://www.celebrityborn.com/biography/bisweswar-bhattacharjee/13516
  4. https://www.tribuneindia.com/2001/20010404/nation.htm
  5. https://www.thehindu.com/archive/print/2001/04/04/
  6. https://web.archive.org/web/20150403030936/http://inae.in/search-of-fellows/