వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ-ఐఐఐటి/నమూనా వ్యాసాలు/మోతీ లాల్ ధర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మోతీ లాల్ ధర్ (22 అక్టోబర్ 1914 - 20 జనవరి 2002) భారతదేశంలో ఒక ప్రముఖ ఔషధ రసాయన శాస్త్రవేత్త[1], సైన్స్ అడ్మినిస్ట్రేటర్.[2] సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, లక్నో లో 1960 నుండి 1972 లో పదవీ విరమణ చేసే వరకు డా. ధర్ డైరెక్టర్ గా కొనసాగాడు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్‌గా పనిచేసిన ఏకైక కాశ్మీరీ పండిట్.[3] 1971లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నాడు.

దస్త్రం:Dr Moti Lal Dhar.jpg
డా. మోతీ లాల్ ధర్ పండిట్

బాల్యం, విద్య[మార్చు]

మోతీ లాల్ ధర్ పండిట్ దినా నాథ్, పోష్-ఐ-కుజ్ ధర్ దంపతులకు అక్టోబర్ 29, 1914న శ్రీనగర్ (కాశ్మీర్) లో జన్మించాడు. ఇక్కడే ఇంటర్మీడియట్ వరకు విద్యాభ్యాసం పూర్తిచేసాడు. తరువాత కెమిస్ట్రీలో ఎంఎస్సీ చేయడానికి లాహోర్‌కు (ఇప్పుడు పాకిస్తాన్‌లో) వెళ్లాడు. ఇక్కడ  ఫోర్మాన్ క్రిస్టియన్ కాలేజీలో చదివి యూనివర్శిటీ కెమికల్ లాబొరేటరీస్, పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ – హానర్స్ (1936), ఎంఎస్సీ-కెమిస్ట్రీ (1937) రెండింటిలోనూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణతనే కాక మొదటి స్థానాన్ని పొందాడు. ఇందుకుగాను బంగారు పతకం సొంతం చేసుకున్నాడు, 1937-38 విద్యా సంవత్సరం విశ్వవిద్యాలయ రసాయన ప్రయోగశాలలలో పరిశోధన కోసం విశ్వవిద్యాలయ స్కాలర్‌షిప్ పొందాడు.

ఉన్నత విద్య, పదవులు[మార్చు]

మోతీ లాల్ ధర్ ఉన్నత చదువుల కోసం యూకే కి వెళ్ళడానికి జమ్మూ-కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్‌ స్పాన్సర్ చేసింది. లండన్ లో యూనివర్శిటీ కాలేజీలోని సర్ విలియం రామ్సే, రాల్ఫ్ ఫోర్స్టర్ లాబొరేటరీస్‌లో 1938లో  చేరాడు. 1940లో ఈ విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్‌డి పొందిన తరువాత డాక్టర్ ధర్ భారతదేశానికి తిరిగి వచ్చాడు. మళ్లీ 1957 లో విజిటింగ్ సైంటిస్ట్ గా కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యుఎస్ఎ లో బాధ్యతలు చేపట్టాడు.

పదవులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Dr.Moti Lal Dhar".{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Dr. Moti Lal Dhar". fellows.ias.ac.in.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "GK Gurtu". ikashmir.net. Retrieved 2021-06-30.