వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022/నియమాలు
స్వరూపం
వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 |
మొదటి పేజి | న్యాయ నిర్ణేతలు | పాల్గొనేవారు | ఫలితాలు | వనరులు | నియమాలు |
నియమాలు
[మార్చు]- వికీపీడియా వ్యాసాల్లో బొమ్మలను చేర్చడం 2022 జూలై 1 - ఆగస్టు 31 మధ్య జరగాలి.
- ఒక్కొక్కరు ఎన్ని ఫైళ్ళను వాడొచ్చు అనే దానికి పరిమితి ఏమీ లేదు. అయితే, బహుమతుల్లో వివిధ వర్గాలున్నాయి. అనేకమైన ఫొటోలను, సంబంధం లేని ఫొటోలను పెట్టేసి వ్యాసాలను వికారంగా చెయ్యకండి. అసలు ఒక్క ఫొటో కూడా లేని వ్యాసాల్లో మాత్రమే ఫొటో చేర్చండి.
- బొమ్మ స్వేచ్ఛగా వాడుకునే లైసెన్సుకు లోబడి గానీ పబ్లిక్ డొమెయిన్ లో గానీ విడుదలై ఉండాలి. వాడదగ్గ లైసెన్సులు CC-BY-SA 4.0, CC-BY 4.0, CC0 1.0. / (లేదా) స్థానికంగా ఎక్కించిన "సముచిత వినియోగం" బొమ్మలను కూడా ఉపయోగించవచ్చు, అయితే వాటిని ఖచ్చితంగా సరైన లైసెన్సుతో ఎక్కించాలి.
- పాల్గొనేవారు ఏదో ఒక వికీమీడియా ప్రాజెక్టులో సభ్యులై ఉండాలి. ఖాతా ఉంటే లాగినవండి. లేదంటే వికీపీడియాలో ఖాతాను సృష్టించుకోండి (ఏ భాషకు చెందిన వికీపీడియాలో నైనా ఖాతాను సృష్టించుకోవచ్చు. ఆ ఖాతాను ఏ వికీమీడియా ప్రాజెక్టులో నైనా వాడవచ్చు).
- తక్కువ నాణ్యత కలిగిన ఫొటోలు సాధారణంగా అనుమతింపబడవు.
- బొమ్మ కనీసం 200 పిక్సెళ్ళ పరిమాణం కలిగి ఉండాలి. దీనికన్న తక్కువ పరిమాణం కల బొమ్మలు సాధారణంగా పోటీకి పరిగణింపబడవు.
- బొమ్మకు చేర్చే వ్యాఖ్య, వివరణ స్పష్టంగా ఉండాలి, వ్యాసానికి సరిపోయేలా ఉండాలి.
- చేర్చే ప్రతీ బొమ్మకూ, అది దేనికి సంబధించినదో వివరించే వ్యాఖ్య తప్పనిసరిగా ఉండాలి.
- పేజీలో చేర్చే బొమ్మ వీలైనంత ఖచ్చితంగా ఆ పేజీకి సరిపోయేలా ఉండాలి. జనరిక్ బొమ్మలను, సముచితం కాని బొమ్మలను చేర్చరాదు.
- వ్యాసంలో సంబంధమున్న చోటనే బొమ్మను చేర్చాలి.
- మీకు భాష సరిగ్గా తెలియని వికీపీడియాలో బొమ్మలను చేర్చకండి. వ్యాఖ్యల్లేని బొమ్మలు, సంబంధం లేని బొమ్మలు వగైరాలను పదేపదే చేర్చే వారిని అనర్హులుగా ప్రకటించవచ్చు.
- బొమ్మలను చేర్చాక, మార్పులను ప్రచురించేటపుడు రాసే దిద్దుబాటు సారాంశంలో సవివరమైన సారాంశంతో పాటు #WPWPTE, #WPWP అనే హ్యాష్‌ట్యాగులను తప్పనిసరిగా చేర్చాలి. ఉదాహరణకు, "సమాచారపెట్టెలో బొమ్మను చేర్చి మెరుగుపరచాను" #WPWPTE, #WPWP. ఈ హ్యాష్‌ట్యాగులను చేర్చకపోతే, ఆ వాసాలు పోటీ పరిగణన లోకి రావు. ఈ హ్యాష్‌ట్యాగులను (#WPWPTE), (#WPWP) వ్యాసం లోపల చేర్చకండి.
- పేజీలో బొమ్మను చేర్చి మెరుగు పరచాక, సంబంధిత చర్చ పేజీలో ఉన్న {{బొమ్మ అభ్యర్థన}} అనే మూసను తీసెయ్యాలి.
- ఒకసారి బొమ్మ చేర్చాక సారంశంలో ట్యాగును (#WPWPTE, #WPWP) పెట్టి, దిద్దుబాటును సేవు చేస్తే మీ దిద్దుబాటు పోటీ లెక్కలోకి వచ్చేస్తుంది. ఒకవేళ, ఏదైనా సవరణ చెయ్యడం కోసం (బొమ్మను మార్చడానికో, బొమ్మ వ్యాఖ్యను మార్చడానికో లేదా మరేదైనా సవరణ కోసమో) అదే పేజీలో మళ్ళీ ఇంకో దిద్దుబాటు చేస్తే, దాని సారాంశంలో మళ్ళీ ఈ ట్యాగును చేర్చకండి. అలాచేస్తే ఆ దిద్దుబాటు పోటీ పరిగణన లోకి రాదు సరికదా, అలాంటి పొరపాట్లు మూడు కంటే ఎక్కువ జరిగితే దిద్దుబాట్ల లెక్కింపులో జరిమానా విధించే అవకాశం ఉంది.
- (#WPWPTE, #WPWP) ట్యాగులను బొమ్మలు చేర్చిన దిద్దుబాటు సారాంశం లోనే చేర్చాలి. బొమ్మ చేర్చని దిద్దుబాట్లను సేవు చేసేటపుడు ఈ ట్యాగులను చేర్చకండి. అలా చేస్తే దిద్దుబాట్ల లెక్కింపులో జరిమానా విధించే అవకాశం ఉంది.
కొన్ని ముఖ్యమైన గమనికలు
[మార్చు]ఈ క్రింది నియమాలు పోటిలో జరుగుతన్న కొన్ని మార్పులకు అనుగుణంగా, న్యాయ నిర్ణేతల సూచన ద్వారా పొందుపరచబడ్డాయి. అయితే ఇలాంటి మార్పులు కింద సూచించిన ప్రామాణికాలను దాటితె సదరు వాడుకరి మొత్తం దిద్దుబాటులలో ఇటువంటి మార్పుల శాతం గుర్తించి బహుమతులకు అర్హత విషయమై న్యాయ నిర్ణేతలకు విన్నవించడం జరుగుతుంది.
- పేజీలో ఎక్కడున్నా బొమ్మ ఉన్నట్టే, సమాచారపెట్టెలో మాత్రమే ఉండాలనే నియమమేమీ లేదు. అయితే గతంలో ఉన్న బొమ్మ వ్యాస పాఠ్యానికి సంబంధం లేనిదని భావిస్తే దాన్ని పోటీ నిర్వాహకుని దృష్టికి తెచ్చి, ఆ తరవాత బొమ్మను చేర్చవచ్చు. పాత బొమ్మను తీసెయ్యరాదు.
- ఒక ఫొటో ఉన్నప్పటికీ మరొక ఫొటోను చేర్చి ఆ పేజీని పోటీలోకి పెట్టడం. ఇలాంటి పొరపాట్లను 6 వరకూ అనుమతించబడతాయి.
- ఒక చెల్లని ఫొటోను కామన్సు లోకి ఎక్కించి, దాని పేజీలో చేర్చడం, ఆనక ఆ బొమ్మను కామన్సు వారు తీసెయ్యడం. బొమ్మను ఎక్కించినదీ, చేర్చినదీ ఒకరే అయినప్పుడు. ఇలాంటి తప్పులు 2 వరకూ అనుమతించబడతాయి..
- స్థానికంగా ఎక్కించిన బొమ్మకు సరైన లైసెన్సులు ఉంటే పరవాలేదు. కానీ సరైన లైసెన్సులు లేకుండా ఎక్కించి దాన్ని పేజీలో చేర్చి పోటీ కోసం వాడరాదు. బొమ్మను ఎక్కించినదీ, చేర్చినదీ ఒకరే అయినప్పుడు. ఆలాంటి తప్పులను 2 వరకు అనుమతించబడతాయి.
- సంబంధం లేని బొమ్మను చేర్చిన సందర్భాలు - ఆ బొమ్మకూ వ్యాసానికీ సంబంధం లేదని వివాదాతీతంగా తేలినపుడు - 4 వరకూ అనుమతించబడతాయి.. ఉదాహరణకు సినిమా పేజీలో నటుల సాంకేతిక నిపుణుల బొమ్మ చేర్చడం.