వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 31, 2007
Appearance
వికీపీడియా వ్యాసాల్లో బయటి లింకులు అనే విభాగం ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన వికీపీడియాయేతర లింకులను ఈ విభాగంలో ఉదహరిస్తారు. ఈ లింకులను చేర్చేటపుడు సమర్పకులు విచక్షణతో వ్యవహరించాలి. కొందరు ఉద్దేశపూర్వకంగా సంబంధం లేని లింకులు ఇస్తారు. ఇలాంటి లింకులను గమనించినపుడు వాటిని తొలగించాలి. మీరు గమనించిన ఒక లింకు ఇంకా ఎన్ని పేజీల్లో ఉందో తెలుసుకునేందుకు ఒక వెతికే సాధనం వికీపీడియాలో ఉంది. అదే ప్రత్యేక:Linksearch. బయటిలింకుల్లో ఎలాంటివి సముచితమైనవో, ఎలాంటివి కావో తెలుసుకునేందుకు వికీపీడియా:బయటి లింకులు పేజీ చూడండి. తెవికీలో ఎక్కువగా పొందుపరచబడిన బయటిలింకుల జాబితాను ఇక్కడ చూడవచ్చు.