వికీపీడియా:వికీ చిట్కాలు/జనవరి 28
స్వరూపం
వికీపీడియాలో చేర్చడానికి సమాచారం ఎక్కడనుంచి సేకరించాలి అన్న ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. ప్రస్తుతం ఆర్కైవ్.ఆర్గ్ జాలస్థలిలో కేవలం ఆంగ్ల పుస్తకాలే కాక తెలుగు పుస్తకాలు కూడా బోలెడు లభ్యమవుతున్నాయి. అయితే వీటిలో కొన్ని మంచి పేరున్న రచయితలు రాసినవి చదివి సేకరించవచ్చు. దీనిలో దొరకని లేక నాణ్యతగా స్కాను చేయని గ్రంథాలకు ఉత్తమమైన పద్దతి గ్రంథాలయాలకు వెళ్ళి సేకరించడం.