వికీపీడియా:వికీ చిట్కాలు/జూన్ 9
స్వరూపం
"తరలించు" ద్వారా గాని, లేదా "#REDIRECT" అని వ్రాయడం ద్వారా గాని దారిమార్పు పేజీలు తయారవుతాయని మీకు తెలిసే ఉంటుంది.
"రాముడు" వ్యాసం నుండి "శ్రీరాముడు" వ్యాసానికి, "శ్రీరాముడు" వ్యాసం నుండి "రామావతారము" వ్యాసానికి దారి మళ్ళింపు ఇచ్చామనుకోండి. అది "మెలికెల దారిమార్పు" అవుతుంది. వీలు చిక్కినపుడు అటువంటివాటిని సరిచేస్తూ ఉండండి. "రాముడు" వ్యాసం నుండి నేరుగా "రామావతారము"కు దారిమార్పు ఇవ్వడం ద్వారా ఈ మెలిక సవరించబడుతుంది.